iDreamPost
android-app
ios-app

వీడియో: లోన్ కోసం ఎంతకు తెగించింది భయ్యా.. ఏకంగా డెడ్ బాడీతో సంతకం!

డబ్బు కోసం ఏ పని చేయడానికైనా వెనకాడరు కొందరు వ్యక్తులు. అయితే ఓ మహిళ మాత్రం బ్యాంక్ నుంచి లోన్ పొంందేందుకు ఏకంగా డెడ్ బాడీని వాడుకోవాలని చూసింది. డెడ్ బాడీతో సంతకం పెట్టించి లోన్ కొట్టేయాలని చూసింది.

డబ్బు కోసం ఏ పని చేయడానికైనా వెనకాడరు కొందరు వ్యక్తులు. అయితే ఓ మహిళ మాత్రం బ్యాంక్ నుంచి లోన్ పొంందేందుకు ఏకంగా డెడ్ బాడీని వాడుకోవాలని చూసింది. డెడ్ బాడీతో సంతకం పెట్టించి లోన్ కొట్టేయాలని చూసింది.

వీడియో: లోన్ కోసం ఎంతకు తెగించింది భయ్యా.. ఏకంగా డెడ్ బాడీతో సంతకం!

బ్యాంకులు కస్టమర్లకు లోన్స్ మంజూరు చేస్తుంటాయి. లోన్ ఇచ్చే ముందు సిబిల్ స్కోర్, లోన్ దేనికోసం అవసరమో ఆ వివరాలను, కస్టమర్ ప్రాపర్టీస్ ను తనిఖీ చేస్తుంటాయి. డాక్యుమెంట్స్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత లోన్ ఇచ్చేందుకు రెడీ అవుతుంటాయి. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా లేదా ఏమైనా ఫ్రాడ్ చేసినా కూడా లోన్ రిజెక్ట్ అవుతుంది. అయితే ఓ దేశంలో ఓ మహిళ బ్యాంకును మోసం చేసి లోన్ పొందేందుకు పెద్ద స్కెచ్ వేసింది. ఏకంగా డెడ్ బాడీతో సంతకం చేయించి లోన్ పొందాలని చూసింది. కానీ బ్యాంక్ అధికారుల అప్రమత్తతో ఆ మహిళ ఆడ్డంగా దొరికిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

బ్రెజిల్ లో ఓ మహిళ బ్యాంక్ ను మోసం చేసి లోన్ తీసుకునేందుకు రెడీ అయ్యింది. ఆమె ప్లాన్ లో భాగంగానే తనకు అంకుల్ అయ్యే వ్యక్తి పేరు మీద లోన్ పొందాలని చూసింది. వెంటనే వీల్ చైర్ లో ఆ వ్యక్తిని తీసుకుని బ్యాంక్ కు బయలుదేరింది. అయితే ఆ వ్యక్తిని బ్యాంక్ కు తీసుకొచ్చే సమయానికి అతడు చనిపోయి ఉన్నాడు. బ్యాంక్ లో లోన్ మంజూరు కావాలంటే సంతకం తప్పనిసరి కాబట్టి ఆ మృతి చెందిన వృద్ధుడితో సంతకం పెట్టించేందుకు రెడీ అయ్యింది. వీల్ చైర్ లో ఉన్న అతడి చేతికి పెన్ ఇచ్చి తన చేతితో పట్టుకుని సంతకం చేయాలని చూసింది. కాగా అప్పటికే అతడు చనిపోయి ఉండడంతో వృద్ధుడు పదేపదే వెనక్కి పడిపోతుండడాన్ని బ్యాంక్ సిబ్బంది గమనించింది.

ఈ లోగా తన అంకుల్ కు బదులుగా తానే సంతకం చేస్తానని బ్యాంక్ అధికారులతో చెప్పింది. మహిళ తీరుతో బ్యాంక్ అధికారులు అప్రమత్తమయ్యారు. అతడికి ఏమైందని ప్రశ్నించారు. దానికి ఆమె బదులుగా అంకుల్ కు ఆరోగ్యం బాలేదని చెప్పింది. ఈ తతంగాన్నంతా గమనించిన బ్యాంక్ సిబ్బందికి అనుమానం కలిగింది. ఆమె మోసం చేసి లోన్ పొందేందుకు ప్రయత్నిస్తుందని తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఎంట్రీతో ఆమె ప్లాన్ రివర్స్ అయ్యింది. బ్యాంక్ ను మోసం చేసి లోన్ పొందాలని చూసిన ఆమెను అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. లోన్ కోసం డెడ్ బాడీని కూడా వదలరా అంటూ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.