iDreamPost
android-app
ios-app

ప్రియుడు మోసం చేశాడంటూ నటి కన్నీరు

  • Published Jun 22, 2024 | 5:07 PM Updated Updated Jun 22, 2024 | 5:07 PM

ప్రియుడి మోసాన్ని తట్టుకోలేకపోయింది ఓ నటి. కానీ అప్పటికే ఆమె పరిస్థితి చేయి దాటిపోయింది. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్. లవర్ చీట్ చేసిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆమె..

ప్రియుడి మోసాన్ని తట్టుకోలేకపోయింది ఓ నటి. కానీ అప్పటికే ఆమె పరిస్థితి చేయి దాటిపోయింది. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్. లవర్ చీట్ చేసిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆమె..

  • Published Jun 22, 2024 | 5:07 PMUpdated Jun 22, 2024 | 5:07 PM
ప్రియుడు మోసం చేశాడంటూ నటి కన్నీరు

బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తే ఏ ప్రియురాలైనా బాధపడుతుంది. అతడు మోసం చేశాడని తెలిశాక లవర్ మోహం చూసేందుకు ఇష్టపడదు. ఫోనులో నుండి అతడి ఫోటోస్ అండ్ ఫోన్ నంబర్ డిలీట్ చేస్తుంది. తన ప్రేమ సిన్సీయర్ అయితే.. సంవత్సరం, రెండేళ్లు మానసికంగా కుంగిపోతుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకోవడమే, లేదంటే కెరీర్‌పై దృష్టి సారించడమో చేస్తుంది. స్ట్రాంగ్ ఉమెన్ అయితే.. ఇవన్నీ లైట్ తీసుకుంటుంది. అదే అతడే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అయితే ఇదిగో ఇలా వలవలా ఏడుస్తుంది. సామాన్యురాలైనా, సెలబ్రిటీనా అయినా మనస్సుకు బాధ అనిపిస్తే ప్లేసుతో పని లేదు.. ఏడుపు తన్నుకొచ్చేస్తుందంతే.

బాయ్ ఫ్రెండ్ తనను చీట్ చేసి..తన స్నేహితురాలితో రొమాన్స్ చేస్తున్నాడని తెలుసుకున్న ఓ టీవీ నటి.. లైవ్‌లోనే బోరున ఏడ్చేసింది. బ్యాగ్ గర్ల్స్ క్లబ్ రియాలిటీ షోతో ఫేమస్ అయిన క్రిస్టెన్ కెల్లీ టిక్ టాక్‌లో ఓ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ క్రిస్ షివిన్క్ తన స్నేహితురాలు కాలిన్‌తో మెక్సికోలో తిరుగుతున్నాడని తెలిసి ఏడుస్తూ వీడియో చేసింది. మెక్సికోలో జల్సా చేస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో గో ఫండ్ మీ పేజ్ ద్వారా ఫండ్ రైజింగ్ చేపట్టగా.. ఈ విషయం నటికి తెలిసి ఘొల్లుమంది. ఈ వీడియోలో తాను గర్భవతినని తెలిపింది. ఇప్పుడు 34 వారాల గర్బిణీని అని, తన వద్దకు రమ్మన్నప్పుడు.. ప్రియుడు వారం అంతా పనిచేస్తున్నానని తీరిక లేదని చెప్పి.. ఇప్పుడు తన స్నేహితురాలితో మెక్సికో వీధుల్లో చక్కర్లు కొట్టినట్లు చెప్పింది.

నిండు గర్భిణిగా ఉన్నావు కాబట్టి కేవలం గంటలో వచ్చేంత దూరంగానే ఉంటానని ఆమెకు మాటిచ్చిన అతడు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి తనను మోసం చేశారని పేర్కొంది. ప్రమాదం వల్లే వారి మధ్య ఉన్న రిలేషన్ షిప్ బయటపడిందని కన్నీటి పర్యంతం అయ్యింది. తనను ఇద్దరు నమ్మక ద్రోహం చేశారని, తాను తెలివి తక్కువగా ఉన్నానని పేర్కొంది. అలాగే అతడి ఆటిస్టిక్ బాధిత కూతుర్ని చూసే బాధ్యతగా కూడా చేపట్టినట్లు తెలిపింది. ఆమె భావోద్వేగంతో చేసిన లైవ్ స్ట్రీమ్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఆమె టిక్‌టాక్ వీడియో 12 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. కెల్లీ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ…  పిల్లలపై దృష్టి పెట్టుకోమని, ప్రియుడిని మరిచిపోమని సలహా ఇచ్చారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet