iDreamPost
android-app
ios-app

ఎవరీ బాబా వంగా? వేరే గ్రహానికి మనుషులు.. కాలజ్ఞానంలో విస్తుపోయే అంశాలు!

  • Published Jul 16, 2024 | 8:06 AM Updated Updated Jul 16, 2024 | 8:06 AM

Who Is Baba Baba Vanga Predictions List: డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన కాల్పులతో ఒక్కసారిగా బాబా వంగా పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈమె అప్పట్లో ట్రంప్ గురించి జోస్యం చెప్పారు. అది ఇప్పుడు నిజం అయ్యేలా ఉన్నాయని అంటున్నారు. దీంతో అసలు ఎవరీ బాబా వంగా? ఈమె కాలజ్ఞానం ఏంటి? అనే విషయాల గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు.

Who Is Baba Baba Vanga Predictions List: డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన కాల్పులతో ఒక్కసారిగా బాబా వంగా పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈమె అప్పట్లో ట్రంప్ గురించి జోస్యం చెప్పారు. అది ఇప్పుడు నిజం అయ్యేలా ఉన్నాయని అంటున్నారు. దీంతో అసలు ఎవరీ బాబా వంగా? ఈమె కాలజ్ఞానం ఏంటి? అనే విషయాల గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు.

ఎవరీ బాబా వంగా? వేరే గ్రహానికి మనుషులు.. కాలజ్ఞానంలో విస్తుపోయే అంశాలు!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ల ప్రాణాలకు ముప్పు ఉందని వంగా బాబా గతంలో జోస్యం చెప్పారు. ట్రంప్ అంతుచిక్కని వ్యాధి కారణంగా చెవుడు వస్తుందని.. బ్రెయిన్ ట్యూమర్ తో కూడా బాధపడతారని ఆమె అప్పట్లో భవిష్యవాణిలో చెప్పారు. అంతేకాదు రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద ఎటాక్ జరుగుతుందని.. ఉక్రెయిన్ యుద్ధం గురించి, రష్యాలోని కుర్స్క్ సబ్ మెరైన్ డిజాస్టర్, అమెరికాలో 9/11 దాడుల గురించి, బరాక్ ఒబామా గురించి ఆమె ముందుగానే అంచనా వేశారు. ఆమె చెప్పినట్టే జరగడంతో ఆమె జోస్యాన్ని నమ్ముతూ వచ్చారు. తాజాగా ట్రంప్ పై కాల్పులు జరగడం.. ఆయన చెవికి తీవ్ర గాయం కావడంతో ఆమె జోస్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అసలు ఈమె ఎవరు? ఈమె తన జోస్యంలో ఇంకా ఏమేమీ చెప్పారు?

వంగా బాబా అసలు పేరు వేంజోలియా పాండేవ గస్త్రోవా. ఈమె బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ గాంచిన మహిళా కాలజ్ఞాని. ఈమె 1911లో అక్టోబర్ 3న జన్మించారు. ఈమె ఒక ఆధ్యాత్మిక వైద్యురాలు. ఈమె తన చిన్నతనంలోనే కంటి చూపును కోల్పోయారు. అయినప్పటికీ ఆమె ఉన్నత స్థాయికి ఎదిగారు. కంటి చూపు లేకపోవడం తన గమ్యాన్ని ఆపలేదని ఆమె నిరూపించారు. ఆధ్యాత్మిక వైద్యురాలిగా ఉన్న ఈమె భవిష్యవాణి చెప్పడం మొదలుపెట్టారు. ఈమె చెప్పినవి చాలా వరకూ జరుగుతూ వచ్చాయి.  అందుకే ఈమెను అక్కడ బాల్కన్స్ యొక్క నోస్ట్రడామస్ అని పిలుస్తారు. చాలా మంది ధనవంతులు, వ్యాపారవేత్తలు భవిష్యత్తు గురించి జోస్యం చెప్పించుకునేందుకు ఆమె దగ్గరకు వెళ్లేవారు.

అయితే ఈమె ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో? భూమి ఎప్పుడు అంతమవ్వబోతుందో కూడా అంచనా వేశారు. 2025లో ఐరోపాలో ఒక సంఘర్షణ కారణంగా జనాభా నాశనం అవుతుందని.. తద్వారా ఆ ఖండమే తుడుచుపెట్టుకుపోతుందని ఆమె చెప్పారు. 2028లో వీనస్ గ్రహాన్ని శక్తి వనరుగా అన్వేషిస్తారని ఆమె వెల్లడించారు.  2033లో ధ్రువ మంచుగడ్డలు (పోలార్ ఐస్ క్యాప్స్) కరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్ర మట్టాలు విపరీతమైన ఎత్తుకు పెరుగుతాయని ఆమె చెప్పారు. 2076లో కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందని ఆమె చెప్పిన జోస్యంలో ఒకటి. 2130లో ఏలియన్స్ తో మనుషులు సంబంధం పెట్టుకుని సంపర్కం చేసుకుంటారని చెప్పారు. 2170లో కరువు విలయతాండవం చేసి ప్రపంచంలో సగ భాగం నాశనమవుతుందని పేర్కొన్నారు.

3005లో భూమ్మీద ఉండే మనుషులు అంగారక గ్రహం మీద యుద్ధం చేసుకుంటారని ఆమె చెప్పుకొచ్చారు. 3797వ సంవత్సరంలో ఏమీ లేదని భూమిని ఖాళీ చేసి వేరే గ్రహానికి వెళ్ళిపోతారని ఆమె చెప్పుకొచ్చారు. 5079వ సంవత్సరంలో ఈ ప్రపంచమే అంతమైపోతుందని వంగా బాబా జోస్యం చెప్పారు. విచిత్రం ఏంటంటే ఈమె తన మరణాన్ని కూడా ముందే ఊహించారు. 1996లో ఆగస్టు 11న మరణిస్తానని ఆమె చెప్పినట్టే అదే రోజున మరణించడం జరిగింది. అయితే ఈమె చెప్పినవి చాలా వరకూ జరిగినా కొన్ని మాత్రం జరగలేదు. వాటిలో 2010, 2014 మధ్య అణుయుద్ధం జరుగుతుందని చెప్పడం.. 2023లో పెద్ద న్యూక్లియర్ ప్లాంట్ పేలుతుందని.. ఆ విష వాయువు ఆసియా మొత్తం వ్యాపిస్తుందని అంచనా వేశారు. కానీ ఆమె చెప్పినట్టు జరగలేదు. ఇలా ఆమె వేసిన కొన్ని అంచనాలు నిజం కాలేదు. కానీ ఇప్పటికీ ఆమె జోస్యాన్ని నమ్మేవారు ఉన్నారు.

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş