iDreamPost
android-app
ios-app

వెయిట్ లాస్ కోసం అలాంటి పనులు చేస్తున్నారా? ఈ అమ్మాయి కథ తెలుసుకోండి!

  • Published May 24, 2024 | 3:28 PM Updated Updated May 24, 2024 | 3:28 PM

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నానన్న ఆనందం. తన పెళ్లిలో తానే స్పెషల్ ఆఫ్ ఎట్రాక్షన్ కావాలనుకుంటుంది. దీంతో కాస్త ఒంటిపై శ్రద్ధ పెట్టాలనుకుంది. వెయిట్ తగ్గాలని భావించి.. ఓ ఆసుపత్రికి వెళ్లింది. కానీ

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నానన్న ఆనందం. తన పెళ్లిలో తానే స్పెషల్ ఆఫ్ ఎట్రాక్షన్ కావాలనుకుంటుంది. దీంతో కాస్త ఒంటిపై శ్రద్ధ పెట్టాలనుకుంది. వెయిట్ తగ్గాలని భావించి.. ఓ ఆసుపత్రికి వెళ్లింది. కానీ

  • Published May 24, 2024 | 3:28 PMUpdated May 24, 2024 | 3:28 PM
వెయిట్ లాస్ కోసం అలాంటి పనులు చేస్తున్నారా? ఈ అమ్మాయి కథ తెలుసుకోండి!

పెళ్లి కుదరడం ఆలస్యం షాపింగ్స్‌కు పనులు మొదలవుతాయి. ముఖ్యంగా పెళ్లి కూతురు స్పెషల్ ఆఫ్ ఎట్రాక్షన్ కావాలనుకుంటుంది. అందుకే పెళ్లికి రెండు, మూడు నెలల నుండి ఫేసియల్స్ చేయించుకోవడం, శరీరంపై కాస్త అదనపు జాగ్రత్తలు తీసుకుంటుంది. తాను యువరాణిలా మెరిసిపోవాలని కోరుకుంటుంది. కాస్త బరువు ఎక్కువగా ఉన్న అమ్మాయిలైతే.. తమ సైజ్ తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ఎక్సస్ సైజ్, వాకింగ్, రన్నింగ్, జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తుంటారు. ఇప్పుడు ఇదే పెళ్లి ఓ అమ్మాయి చావుకొచ్చింది. మరికొన్ని నెలల్లో పెళ్లి కావడంతో.. కాస్త బరువు తగ్గాలనుకుంది. దీంతో సన్నగా కనిపించేందుకు  శరీరాన్ని కష్టపెట్టే కసరత్తులు  కాకుండా మెడిసన్‌ను నమ్ముకుంది. చివరకు పెళ్లి కూతురు కాకుండానే.. శ్మశాన వాటికకు చేరింది.

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నానన్న ఆనందంలో ఉంది యువతి. తాను మహారాణిలా కనిపించాలనుకుంది. అందుకు వెయిట్ తగ్గాలని భావించింది. అయితే నార్మల్ వాటికి భిన్నంగా ఆసుపత్రికి వెళ్లింది. చికిత్స తీసుకుంది. కానీ చివరకు వికటించి చనిపోయింది. ఈ ఘటన బ్రెజిల్ దేశంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లారా ఫెర్నాండెజ్ కోస్టా అనే 31 ఏళ్ల ఇంజనీర్‌కు మాథ్యూస్ టుర్చెట్ అనే వ్యక్తికి వివాహం కుదిరింది. సెప్టెంబర్ 7న వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే ఇంతలో లారాకు తన పెళ్లిలో యువరాణిలా కనిపించాలని, అందుకు తగ్గట్లుగా శరీర ఆకృతిని మలుచుకోవాలనుకుంది. ఎనిమిది కిలోలు తగ్గాలనుకుంది. అనుకున్నదే తడువుగా గత నెల ఓ క్లినిక్‌లో చేరింది. బరువు తగ్గడానికి తన కడుపులో గ్యాస్ట్రిక్ బెలూన్ అమర్చుకుంది.

ఈ ప్రక్రియ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో ఎక్కువగా ఆహారం తీసుకోలేరు. సెలైన్‌తో నిండిన సిలికాన్ బ్యాగ్‌ని కడుపులో చొప్పిస్తుంటారు. ఈ ప్రక్రియ తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. అయినా సరే ఆసుపత్రిలో చేరింది లారా. అయితే గ్యాస్ట్రిక్ బెలూన్ అమర్చుకున్న మరుసటి రోజు ఆమెకు రక్తపు వాంతులు అయ్యాయి. దీంతో కంగారు పడి.. మే 1న ఆసుపత్రిలో చేరింది. దీంతో ఆమెకు బెలూన్ తొలగించారు వైద్యులు. అయినప్పటికీ.. లారాకు ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. తీవ్రమైన నొప్పితో మే 6న ఆసుపత్రిలో చేరింది. కాగా, ఆమె కడుపులో రంధ్రాలు ఏర్పడ్డాయని, ఇది ఇన్ ఫెక్షన్‌కు దారి తీసిందని గుర్తించారు. చికిత్స పొందుతూ ఆమె మే 7న మరణించింది. కాగా, లారా కాబోయే భర్త మాథ్యూస్ మాట్లాడుతూ.. ఆమె చాలా ఆరోగ్యంగా ఉందని, ఊబకాయం కూడా లేదని, అయితే పెళ్లి కోసం యువరాణిలా కనిపించాలన్న తపనతో ఈ చికిత్స చేయించుకుందని, అదే ఆమె ప్రాణాలను తీసిందని వెల్లడించాడు. పెళ్లి కూతురు కావాల్సిన అమ్మాయి.. చివరకు బరువు తగ్గాలన్న ఉద్దేశంతో పిచ్చి ప్రయత్నాలు చేసుకుని.. మరణించింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş