Dharani
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం.. తాజాగా ఓ కేర్ టేకర్ ని.. లక్ ఇలానే పలకరించింది. వేల కోట్ల ఆస్తి కలిసి వచ్చే అవకాశం అందుకున్నాడు. ఆ వివరాలు..
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం.. తాజాగా ఓ కేర్ టేకర్ ని.. లక్ ఇలానే పలకరించింది. వేల కోట్ల ఆస్తి కలిసి వచ్చే అవకాశం అందుకున్నాడు. ఆ వివరాలు..
Dharani
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. ఈ మధ్యకాలంలో.. జీవితం ఇంక ముగిసిపోతుంది అనుకున్న దశలో లాటరీల్లో.. భారీగా డబ్బులు గెలిచి.. జీవితాలు మారిపోయిన వారిని అనేక మందిని చూశాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి వీరికి భిన్నం. అతడు ఓ వ్యక్తికి కేర్ టేకర్ గా ఉద్యోగంలో చేరాడు. తన బాధ్యతలను ఎంతో శ్రద్ధగా నిర్వహించేవాడు. వృద్దాప్యంలో తన మంచి చెడులు చూసుకుంటున్న సంరక్షకుడికి ఆ బిజినెస్‌మెన్ భారీ నజరానాను ప్రకటించాడు. అతడిని దత్తత తీసుకుని తన పేరు మీద ఉన్న వేల కోట్ల ఆస్తిని కేర్ టేకర్ కు రాసిచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సంఘటన స్విట్జార్లాండ్ లో చోటు చేసుకుంది.
స్విస్ మీడియా కథనాల ప్రకారం.. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ హెర్మెస్ వ్యవస్థాపకుడు.. థియెర్రీ హెర్మెస్ కుటుంబంలో ఐదో తరానికి చెందిన నికోలస్ ప్యూచ్ వయసు ప్రస్తుతం 80 ఏళ్లు. గత కొన్నేళ్లుగా అతడు వృద్దాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇక తనను చూసుకునేందుకు నియమించుకున్న కేర్ టేకర్ తన గురించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే కాక.. తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడని.. అందుకు కృతజ్ఞతగా నికోలస్ తన వద్ద ఉన్న రూ.97 కోట్ల ఆస్తిని రాయాలనే నిర్ణయం తీసుకున్నాడట.
థియెర్రీ హెర్మెస్ కుటుంబంలో ఐదో తరానికి చెందిన నికోలస్ ప్యూచ్ వయసు ప్రస్తుతం 80 ఏళ్లు. హెర్మెస్ కంపెనీలోని 5 నుంచి 6 శాతం వాటాలు ఇప్పుడు నికోలస్ పేరు మీద ఉన్నాయి. ప్రస్తుతం నికోలస్ ఆస్తుల విలువ దాదాపు 11 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.97 వేల కోట్లు. అయితే నికోలస్‌కు పెళ్లి కాకపోవడంతో సంతానం కూడా ఎవరూ లేరు. దాంతో వృద్ధాప్యంలో ఉన్న నికోలస్ మరణం తర్వాత ఆయన పేరుమీద ఉన్న వేల కోట్ల ఆస్తి ఎవరికి దక్కుతుందనే దాని గురించి స్థానికంగా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది.
ఈ నేపథ్యంలోనే తన ఆస్తికి వారసుడిని ప్రకటించే విషయంలో నికోలస్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు స్విస్ మీడియా రాసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా తనను ఎంతో బాగా చూసుకుంటూ.. అన్ని రకాల సపర్యలు చేస్తోన్న తన 51 ఏళ్ల కేర్ టేకర్ కి.. తనకు సంబంధించిన పూర్తి ఆస్తిని అప్పగించేందుకు నికోలస్ సిద్ధమైనట్లు సమాచారం. ఆ సంరక్షకుడిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుని.. ఒక న్యాయ బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సంరక్షకుడు ఎవరు అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం బయటకు రాలేదని తెలుస్తోంది. అంతేకాక నికోలస్.. ఇప్పటికే ఆ సంరక్షకుడికి 5.9 మిలియన్ డాలర్ల విలువైన తన ఆస్తులను అప్పగించినట్లు సమాచారం.
అయితే తన ఆస్తిని సంరక్షకుడికి అప్పగించడానికి నికోలస్ చట్టపరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. స్విట్జర్లాండ్ చట్టాల ప్రకారం పెద్దవాళ్లను దత్తత తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి అంటున్నారు. దత్తత వెళ్లే వ్యక్తి మైనర్‌గా ఉన్నప్పుడు కనీసం ఒక ఏడాది పాటు దత్తత తీసుకునే వ్యక్తి ఆ మైనర్‌తో కలిసి జీవించి ఉండాలి. మరోవైపు.. నికోలస్ ఆ సంరక్షకుడిని దత్తత తీసుకుంటే.. దానిపై హెర్మెస్ కుటుంబసభ్యులు కోర్టులో దావా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చివరకు నికోలస్ ఆస్తి ఎవరికి దక్కుతుందో చూడాలి అంటున్నారు.