iDreamPost
android-app
ios-app

జపాన్ ను వణికిస్తున్న కొత్త బ్యాక్టీరియా.. చాలా డేంజరస్..48 గంటల్లోనే మరణం!

  • Published Jun 16, 2024 | 1:17 PM Updated Updated Jun 16, 2024 | 1:17 PM

Rare flesh, Japan: తరచూ పలు దేశాల్లో వింత వింత వైరస్ లు పుట్టుకొచ్చి మనుషులను భయపెడుతున్నాయి. తాజాగా ఓ బ్యాక్టీరియా జపాన్ వాసులను వణికిస్తుందంట. ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమైనది.

Rare flesh, Japan: తరచూ పలు దేశాల్లో వింత వింత వైరస్ లు పుట్టుకొచ్చి మనుషులను భయపెడుతున్నాయి. తాజాగా ఓ బ్యాక్టీరియా జపాన్ వాసులను వణికిస్తుందంట. ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమైనది.

  • Published Jun 16, 2024 | 1:17 PMUpdated Jun 16, 2024 | 1:17 PM
జపాన్ ను వణికిస్తున్న కొత్త బ్యాక్టీరియా.. చాలా డేంజరస్..48 గంటల్లోనే మరణం!

నేటికాలంలో అనేక రకాల వైరస్ లు , బ్యాక్టీరియాలు పుట్టుకొస్తున్నాయి.  అంతేకాక వీటి కారణంగా అంతుచిక్కని వ్యాధులు వ్యాపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కరోణ కారణం ప్రపంచం అంతా ఏవిధంగా వణికిపోయిందే అందరికి తెలిసిందే. ఆ తరువాత కూడా తరచూ పలు దేశాల్లో వింత వింత వైరస్ లు పుట్టుకొచ్చి మనుషులను భయపెడుతున్నాయి. తాజాగా ఓ బ్యాక్టీరియా జపాన్ వాసులను వణికిస్తుందంట. ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమైనది. మనిషి మాంసాన్ని తిని జీవించే ఈ బ్యాక్టీరియ వలన సంభవించే ప్రాణాంతక వ్యాధి కేసులు ఆ దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫెక్షియస్ డీసీజెస్ తెలిపిన వివరాల ప్రకారం..

స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే బ్యాక్టీరియా దెబ్బకు జపాన్ వాసులు వణికిపోతున్నారు. ఇది కరోనా కంటే డేంజరస్ కావడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మనిషి మాంసాన్ని తిని బతికే ఈ బ్యాక్టీరియా వలన ప్రాణాంతక వ్యాధి సంభవిస్తుంది. అలాంటి ప్రాణాంతక కేసులు జపాన్ లో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధికి సంబంధించి 2024 జూన్ 2 నాటికి 977 కేసులు నమోదు అయ్యాయి.

ఈ వ్యాధి అనేది సాధారణంగా స్ట్రెప్ థ్రోట్ వంటి తేలిక పాటి అనారోగ్య లక్షణాలతో  ప్రారంభవుతుంది. ఆ తరువాత క్రమంగా శరీరంలోని అవయవాల నొప్పి, వాపు, జ్వరం వంటి లక్షాణాలు కనిపిస్తాయి. అంతేకాక బీపీ, నెక్రోసిస్ వంటి తీవ్రమైన లక్షాణాలను కూడా చూపుతుంది. చివరికి అవయవాలు పూర్తిగా దెబ్బతిని  మరణానికి దారితీవయచ్చని జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. ఈ వ్యాధి ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారికి చాలా డేజరస్ అని పేర్కొంది. ఈ బ్యాక్టీరియా సోకడంతో  చాలా మరణాలు 48 గంటల్లోనే జరుగుతాయని తెలిపింది. ఈ బ్యాక్టీరియా సోకిన వారిలో ఉదయం పాదంలో వాపు, మధ్యాహ్నం నాటికి మోకాలికి వ్యాపిస్తుందని, రోగి 48 గంటల్లో చనిపోవచ్చని..టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీలో ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ అధ్యాపకులు కెన్ కికుచి అంటున్నారు.

ఇక వీరు చెప్పిన ప్రకారం బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తుంది. ఈ బ్యాక్టీరియా కారణంగా జపాన్ లో ఈ ఏడాది 2500 కేసులు నమోదు అయ్యాయి. మరణాల రేటు 30 శాతం ఉందని ప్రొఫెసర్ కికుచి హెచ్చరించారు. ఇదే సమంయలోనే జాగ్రత్తలు తెలిపారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, బయటి గాయాలకు చికిత్స తప్పనిసరిగా చేసుకోవాలని కికుచి చెబుతున్నారు. రోగుల పేగుల్లో ఈ బ్యాక్టీరియా జీవిస్తుందటని తెలిపారు. ఈ డేంజర్స బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు. మొత్తంగా ఈ కొత్త బ్యాక్టీరియా జపాన్  వాసులను వణికిస్తుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet