కొత్త ట్రెండ్..లక్షలు ఖర్చు చేసి.. అడవుల్లోకి వెళ్లి అరుస్తున్న మహిళలు! ఎందుకంటే?

Rage Rituals: ఆడవాళ్లు ఎంత ప్రశాంతంగా ఉంటే.. అంత అందంగా ఉంటారని అంటారు. పని ఒత్తిడి.. ఇతర సమస్యలతో వారి చీటికి మాటికి కోపం రావడం చూస్తూనే ఉన్నాం. అలా కోపం వచ్చేవారికి ఈ మధ్య ఓ వింతైన ట్రీట్ మెంట్ ఇస్తున్నారు

Rage Rituals: ఆడవాళ్లు ఎంత ప్రశాంతంగా ఉంటే.. అంత అందంగా ఉంటారని అంటారు. పని ఒత్తిడి.. ఇతర సమస్యలతో వారి చీటికి మాటికి కోపం రావడం చూస్తూనే ఉన్నాం. అలా కోపం వచ్చేవారికి ఈ మధ్య ఓ వింతైన ట్రీట్ మెంట్ ఇస్తున్నారు

నేటి సమాజంలో మనుషులు ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురైతున్నారు. కోపం, చీదరించుకోవడం, ఆవేశ‌పడటం లాంటివి చేస్తున్నారు. ఒక రకంగా మనుషుల్లో ఇది ఒక దుర్గునం అనే అంటారు. మనిషి అన్న తర్వాత ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా.. ఏదో ఒక సమయంలో కోపం వస్తుంది. అతిగా ఆవేశపడటం..కోపగించుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతుంటారు. చాలా మంది మహిళలు కోపాన్ని అధిగమించడానికి యోగ, మెడిటేషన్, భక్తితో పూజలు చేస్తుంటార.  కోపం తగ్గించుకోవడానికి కొత్త పద్దతులు అవలంభిస్తున్నారు.  ఇది  ఒక ఆచారంగా మారింది. వివరాల్లోకి వెళితే..

అమెరికా, యూరోపియన్ దేశాల్లో కోపాన్ని తగ్గించుకోవడం కోసం కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. దీని ప్రకారం అడవిలో పార్టీ నిర్వహిస్తారు.. కోపం.. చిరాకుతో ఉండే మహిళలను అడవుల్లో గట్టిగా అరవాలి. ఇందుకోసం మహిళలు లక్షలు రూపాయలు ఖర్చు పెట్టి మరీ అడవులకు వెళ్లి అరిచి.. తద్వారా తమ కోపాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు కోపం తగ్గే వరకు ఏదో ఒక విధ్వంసం ప్రాణాలకు హాని కానిది)సృష్టిస్తూనే ఉంటారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం మహిళలు ఈ ఆచారానికి వెళ్లడానికి దాదాపు రూ.5 నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చు చేస్తుంటారు. అమెరికాకు చెందిన మియా మ్యాజిక్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ‘రేజ్ రిచువల్స్’ ని నడిపిస్తుంది. చాలా మంది మహిళలు తమ కోపాన్ని తగ్గించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు.

మియా మ్యాజిక్ ని మియా బాండుచీ అని కూడా పిలుస్తారు. మొదట్లో ఈ వింత ఆచారం గురించి పెద్దగా పట్టించుకోకపోయినా.. మహిళలు తమ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఇక్కడికి క్యూ కడుతున్నారు. అయితే కోపం అనేది సహజ గుణం.. అది ప్రతి మనిషికి ఎప్పటికైనా ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది. ఈ వింత ఆచారం ఫ్రాన్స్ లో కూడా మొదలు పెట్టబోతున్నారు. మియా వచ్చే ఆగస్టు లో ఫ్రాన్స్ లో ఒక ఫంక్షన్ నిర్వహించబోతుంది.

Show comments