iDreamPost
android-app
ios-app

అమెరికన్స్‌ రికార్డు బద్దలు కొట్టిన విచిత్ర కుటుంబం!

  • Published Jul 12, 2023 | 12:45 PM Updated Updated Jul 12, 2023 | 12:45 PM
  • Published Jul 12, 2023 | 12:45 PMUpdated Jul 12, 2023 | 12:45 PM
అమెరికన్స్‌ రికార్డు బద్దలు కొట్టిన విచిత్ర కుటుంబం!

సాధారణంగా కుటుంబంలోని వారి పుట్టిన రోజులు.. ఒక్కోరిది ఒక్కో నెలలో ఉండటం పరిపాటి. కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇంట్లోని ఒకరిద్దరి పుట్టినరోజులు ఒకే నెల్లో వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మిగిలిన కుటుంసభ్యులు వారి పుట్టిన రోజు ఎంతో సందడిగా చేసేస్తుంటారు. మరి, అలాంటిది ఒకే నెల్లో.. ఒకే రోజు కుటుంబంలోని అందరు కుటుంసభ్యుల పుట్టిన రోజులు ఉంటే.. అది కచ్చితంగా రికార్డు అవ్వకమానదు. అలాంటి కుటుంబం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వక మానదు.

ఇలాంటి అత్యంత అరుదైన రికార్డును పాకిస్తాన్‌కు చెందిన ఓ కుటుంబం సాధించింది. ఆ వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని లార్ఖానా లో నివాసం ఉంటున్న కుటుంబంలో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారు. వారందరూ ఒకే రోజు.. ఒకే నెలలో జన్మించటం విశేషం. అయితే, వారు పుట్టిన సంవత్సరాలు మాత్రం వేరు. అమీర్ అలీ – ఖదీజా దంపతుల పుట్టినరోజు ఆగష్టు 1. వీళ్లిద్దరి వివాహం కూడా ఆగష్టు 1, 1991లో జరిగింది. ఓ సంవత్సరంలో ఆగష్టు 1, 1992న వీళ్ళకి మొదటి పాప(సింధు ) జన్మించింది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారట.

ఆమె పుట్టుక దేవుడు ఇచ్చిన వరం అని అందరూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆగస్టు 1వ తేదీనే.. కవలలు ససుయ్ – సప్నా, ఆమిర్ – అంబర్ ,అమ్మర్ – అహ్మర్‌లు జన్మించారు. వీరందరూ సాధారణ కాన్పు ద్వారానే జన్మించటం ఆశ్చర్యకరం. ఇక, ఒకే కుటుంబంలో 9 మంది ఆగస్టు 1న పుట్టడంతో ఈ కుటుంబం గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.  ఇంతకు ముందు ఉన్న గిన్నిస్‌ రికార్డును తుడిచేసింది. అమెరికాకి చెందిన కమ్మిన్స్ కుటుంబంలో ఒకే రోజు.. ఒకే నెలలో.. ఫిబ్రవరి 20న.. 7 మంది జన్మించారు. ఈ రికార్డును అమీర్‌ కుటుంబం బద్దలు కొట్టింది. ఈ వరల్డ్ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom