Congo: ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 78 మంది మృతి!

Congo: కాంగోలోని కివు సరస్సులో మితిమీరిన ప్రయాణికులతో నిండిపోయిన పడవ బోల్తా పడింది. ఆ పడవలో 278 మంది ప్రయాణికులు ఉన్నారు.

Congo: కాంగోలోని కివు సరస్సులో మితిమీరిన ప్రయాణికులతో నిండిపోయిన పడవ బోల్తా పడింది. ఆ పడవలో 278 మంది ప్రయాణికులు ఉన్నారు.

మిడిల్ ఆఫ్రికా దేశం తూర్పు కాంగోలోని కివు సరస్సులో దారుణం జరిగింది. మితిమీరిన ప్రయాణికులతో నిండిపోయిన పడవ బోల్తా పడింది. ఆ పడవలో ఏకంగా 278 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటిదాకా ఏకంగా 78 మంది మరణించారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ విషాద సంఘటన గురువారం నాడు జరిగింది. దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జీన్-జాక్వెస్ పురుస్సీ ఈ విషయం గురించి తెలిపారు. ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం కిక్కిరిసిన ప్రయాణికులని అధికారులు తెలిపారు.

బోటులో దాని సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు. దేశంలోని తూర్పు ప్రాంతంలోని కిటుకు ఓడరేవుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ ఓడ రేవుకు కొన్ని మీటర్ల దూరంలోనే ఈ పడవ మునిగిపోయింది. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా నుంచి ఉత్తర కివు ప్రావిన్స్‌లోని గోమాకు వెళ్తుండగా పడవ బోల్తా పడింది. గురువారం నాడు ప్రమాదం జరిగాక ముందుగా సరస్సు నుండి 50 మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. ఒక 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిని మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత సుమారు 50 మందిని రక్షించినట్లు తెలుస్తుంది.

పడవలపై రద్దీ అనేది కాంగోలో తరచూ రిపీట్ అయ్యే సమస్య. ఈ సమస్యే ఇటువంటి విపత్తులకు దారి తీస్తుంది. సముద్ర భద్రత నిబంధనలు కూడా అక్కడ పాటించరు. అందుకే ఇలాంటి ప్రమాదాలు కామన్ అయిపోయాయి. ఓడల్లో ఓవర్‌లోడింగ్ వద్దని అధికారుల చాలా సార్లు హెచ్చరికలు జారీ చేశారు. కాంగోలో చాలా మంది ప్రయాణీకులు ఓడల ద్వారానే వెళతారట. ఎందుకంటే ప్రయాణ ఖర్చు తక్కువ. పైగా కాంగోలో రోడ్లు కూడా చాలా తక్కువట. అందుకే అక్కడి ప్రజలు ఎక్కువగా నీటి రవాణాపై ఆధారపడతారు. గతంలో ఇలానే పడవ మునిగిపోవడంతో ఏకంగా 80 మంది మరణించారు. ఈ సంవత్సరం, జనవరిలో 22 మంది మరణించారు. ఇక ఏప్రిల్‌లో కివు సరస్సులో 64 మంది తప్పిపోయి ఆరుగురు చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు రద్దీ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ పడవ ప్రమాదంపై మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments