iDreamPost
android-app
ios-app

సామాన్యురాలిని పెళ్లాడిన సుల్తాన్ కుమారుడు

  • Published Jan 12, 2024 | 4:09 PM Updated Updated Jan 18, 2024 | 6:18 PM

సీతారామం మూవీలో యువరాణి.. ఓ సామాన్యుడిపై మనస్సు పడి.. అతడి కోసం అన్ని త్యజించేస్తుంది. ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలో కూడా చోటుచేసుకున్నాయి. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ.. సామాన్యురాలు కేట్ ను వివాహం చేసుకున్న సంగతి విదితమే. ఆమె కోసం రాజరికాన్ని వదులుకున్నాడు.

సీతారామం మూవీలో యువరాణి.. ఓ సామాన్యుడిపై మనస్సు పడి.. అతడి కోసం అన్ని త్యజించేస్తుంది. ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలో కూడా చోటుచేసుకున్నాయి. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ.. సామాన్యురాలు కేట్ ను వివాహం చేసుకున్న సంగతి విదితమే. ఆమె కోసం రాజరికాన్ని వదులుకున్నాడు.

  • Published Jan 12, 2024 | 4:09 PMUpdated Jan 18, 2024 | 6:18 PM
సామాన్యురాలిని పెళ్లాడిన సుల్తాన్ కుమారుడు

పెళ్లిళ్లు చేసుకునే సమయంలో తమ తాహత్తుకు తగ్గట్లుగా సంబంధాలు చూసుకుంటూ ఉంటారు. ధనవంతులు, రాజులు, సుల్తాన్‌లు సాధారణ వ్యక్తులను వివాహం చేసుకోవడం బహుశా సినిమాల్లోనే చూసుకుంటాం. కానీ రియల్ లైఫ్‌లో కూడా కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయి. బ్రిటన్ రాజ వంశానికి చెందిన ప్రిన్స్ హ్యారీ.. సామాన్యురాలు కేట్ మిడిల్టన్‌ను వివాహం చేసుకున్నారు. రాజవంశాన్ని వదిలి.. సామాన్యుడిలా బతుకుతున్నాడు. జపాన్ యువరాణి మాకో కూడా తన ప్రియుడు కీ కొమురోను మనువాడింది. అదే సమయంలో యువరాణి హోదాను వదులుకుంది. ఇలాంటి జంటలు సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మరో బిలీనియర్ సామాన్యురాలిని వివాహం చేసుకున్నాడు.

ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరు బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా. ఆయన (10 మంది సంతానం) నాల్గవ కుమారుడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అబ్దుల్ మతీన్ (32) వివాహం జరిగింది. అయితే అతడు పెళ్లి చేసుకున్న మహిళ బిలినీయర్ కాదూ కోటీశ్వరురాలు అంతకన్నా కాదూ.. సామాన్యురాలు. యాంగ్ ములియా అనిషా/అనిషా రోష్నా ఇసా కలేబిక్ అనే యువతిని గురువారం రాత్రి మనువాడాడు. బందర్ సెరి బెగవాన్‌లోని బంగారు గోపురం మసీదులో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. 1,788 గదుల ప్యాలెస్‌లో వివాహ తంతు జరిగింది. పది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వేడుక నిర్వహించనున్నారు. ఈ లెక్క ప్రకారం ఈ నెల 16వ తేదీ వరకు పెళ్లి వేడుకలు జరగనున్నాయి.

ఈ పెళ్లి వేడుకలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు హాజరు కానున్నారు. వివాహ వేడుకల్లో చివరి రోజు నవ దంపతులు మతీన్, అనిషా.. ప్రజలు నుండి ఆశీర్వాదం తీసుకునేందుకు వీధుల్లోకి రానున్నారు. బోర్నియో ద్వీపంలో ఉత్తర అంచున్న ఉండే ఈ బ్రూనో.. చమురు పుష్కలంగా దొరికే దేశం. ఇక్కడ 4.50 లక్షల జనాభా మాత్రమే ఉంటారు. బ్రూనై రాజకుటుంబం దాదాపు 28 బిలియన్ డాలర్స్ నికర విలువను కలిగి ఉంది. అయితే మతీన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అతనికి 2.5 మిలియన్లకు పైగా ఇన్ స్టాలో ఫాలోవర్లు ఉన్నారు. మతీన్ భార్య అనిషా.. సుల్తాన్ ప్రత్యేక సలహాదారు మనవరాలు, రాయల్ బ్రూనై ఎయిర్ లైన్స్ వ్యవస్థాపక చైర్మన్. ఇసా కలేబిల్ సిల్క్ కలెక్టివ్ అనే ప్యాషన్ బ్రాండ్ ను నడుపుతున్నారు. మరీ సుల్తాన్, సాామాన్యురాలిని వివాహం చేసుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mateen (@tmski)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet