iDreamPost
android-app
ios-app

వంటింట్లో బంగారం ఉన్నట్టు కల..! ఏకంగా 120 అడుగులు తొవ్వి!

కలలు కన్నడం మనిషి సహజ స్వభావం. అయితే ఇలా వచ్చిన కలలను నిజం చేసుకునేందుకు చాలా మంది కష్టపడి పనిచేస్తుంటారు. మరికొందరు అత్యాశతో కూడిన కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నించి..ప్రాణాలు కోల్పోతుంటారు.

కలలు కన్నడం మనిషి సహజ స్వభావం. అయితే ఇలా వచ్చిన కలలను నిజం చేసుకునేందుకు చాలా మంది కష్టపడి పనిచేస్తుంటారు. మరికొందరు అత్యాశతో కూడిన కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నించి..ప్రాణాలు కోల్పోతుంటారు.

వంటింట్లో బంగారం ఉన్నట్టు కల..! ఏకంగా 120 అడుగులు తొవ్వి!

ప్రతి మనిషి కలలు కన్నడం అనేది సహజం. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.  అయితే ఇలా తమ కలను కోరికను తీర్చుకోవడం కోసం కష్టపడతం తప్పేమేమి కాదు. కానీ కొన్ని సార్లు అత్యాశతో కూడిన పనులు చేయడం వల్ల మాత్రం ప్రమాదాన్ని కొన్ని తెచ్చుకున్నట్లు అవుతోంది. పేరాశకు పోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు అనేది చాలా సంఘటనల్లో మనం చూశాం. తాజాగా ఓ వ్యక్తి కూడా బంగారం లాంటి కల కని.. అది నిజమా కాదా అని ఆలోచించకుండా చేసిన ఓ పని ఆయన ప్రాణాలను బలి తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

బ్రెజిల్ దేశంలోని మినాస్ గెరైస్ అనే  గ్రామంలో జోయో పిమెంటా అనే 70 ఏళ్ల పెద్దాయన నివాసం ఉంటున్నాడు. ఆయనకు  తరచూ కలలు వస్తుండేవి  అంటా. అలానే ఓ రోజు నిద్రలో తన ఇంటికి కింద ఉన్నట్లు కలగన్నాడు. అంతే మరుసటి రోజు తన ఇంటి కింద ఉన్న  బంగారం పొందాలని అనేక ప్లాన్లు రచించాడు.  ఈక్రమంలో చాలా రోజుల నుంచి ఇంటి నుంచి బయటకు రాకుండా వంట గదికే పరిమితం అయ్యాడు. తన ఇంట్లోనే బంగారం కోసం గుంత తవ్వడం ప్రారంభించాడు. ఏడాది నుంచి అదే పనిగా ఆ గదిలో తవ్వుకుంటూ పోయాడు. అలా 130 అడుగుల లోతుదాకా పోయాడు.

The work done by greed

బంగారం కోసం గుంత తవ్వే ప్రయత్నంలో పెద్ద పెద్ద రాళ్లు కూడా అడ్డు వచ్చాయి. వాటిని కూడా డైనమెట్లను ఉపయోగించాడట. వాటి ద్వారా ఆ రాళ్లను పగలగొట్టి తన పనిని కొనసాగించాడు. ఆ సమయంలోనే చుట్టుపక్కల వాళ్లకు జోయో చేస్తున్న పని గురించి తెలిసింది. అది  ప్రమాదరమని వారు హెచ్చరించినా, అధికారులతో చెప్పించినా ఆ పెద్దాయన వినలేదు. చివరకు  దాదాపు 12 అంతస్తుల భవనం లోతు ఉన్న గొయ్యిని తవ్వాడు. ఇంకా ప్రయత్నం చేస్తున్న క్రమంలో అతడికి ఎక్కడ బంగారం తారసపడలేదు. అయినా ఇంకా లోపల ఉంటదేమో అని తవ్వడాన్ని కొనసాగించాడు.

ఈ నేపథ్యంలో ఓ రోజు పని చేస్తున్న క్రమంలో పొరపాటున  అదుపు తప్పి పడిపోయి ప్రాణం విడిచాడు. 12 అంతస్తుల భవనం లోతు ఉన్న గొయ్యిలో పడి తల పగిలి.. కాళ్లు చేతులు విరిగి అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక అతడి స్టోరీ తెలిసిన అందరు అనేక విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.  కలకు కనడం మంచిదే..వాటిని నిజం చేసుకోవడం మంచిదే..కానీ మరి.. ఇంత అత్యాశతో కూడిన కోరికల కోసం వెళ్తే.. చివరకు ప్రాణాలు పోతాయి. ఈ పెద్దాయన కూడా బంగారం కలగని..బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. బంగారం కోసం ఆయన చేసిన పని.. మృత్యువు ఒడికి చేర్చింది. మరి.. ఈ పేరాశ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.