iDreamPost
android-app
ios-app

కొత్తగా పెళ్లి..భార్యపై ప్రేమతో భర్త చేసిన సాహసం..! అసలు ట్విస్ట్ ఇదే!

  • Published Jul 22, 2024 | 4:30 AM Updated Updated Jul 22, 2024 | 4:30 AM

కొన్ని సంఘటనలు చూసినప్పుడు భాగస్వామిపై ఇంత ప్రేమ ఉంటుందా అనే సందేహం కలుగమానదు. అలాంటి ఘటనే తాజాగా ఒకటి చోటుచేసుకుంది. భార్య కోసం రోజూ 320 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు ఓ భర్త.

కొన్ని సంఘటనలు చూసినప్పుడు భాగస్వామిపై ఇంత ప్రేమ ఉంటుందా అనే సందేహం కలుగమానదు. అలాంటి ఘటనే తాజాగా ఒకటి చోటుచేసుకుంది. భార్య కోసం రోజూ 320 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు ఓ భర్త.

  • Published Jul 22, 2024 | 4:30 AMUpdated Jul 22, 2024 | 4:30 AM
కొత్తగా పెళ్లి..భార్యపై ప్రేమతో భర్త చేసిన సాహసం..! అసలు ట్విస్ట్ ఇదే!

భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రత్యేకమైనది. రెండు వేరు వేరు స్వభావాలు కలిగిన మనస్సులు పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతుంటారు. ఇక దంపతులక మధ్య ఉండే ప్రేమాను బంధాలు చాలా ప్రత్యేకంగా. కష్టాసుఖాల్లో పాలు పంచుకుంటూ సంసారం సాగిస్తుంటారు. ఇది ఇలాంటే..కొన్ని సంఘటనలు చూసినప్పుడు భాగస్వామిపై ఇంత ప్రేమ ఉంటుందా అనే సందేహం కలుగమానదు. అలాంటి ఘటనే తాజాగా ఒకటి చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్య కోసం రోజూ 320 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో.. ఈ విషయం కాస్తా తెగ వైరల్ అవుతోంది. మరి.. ఆవివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

చైనాలోని వైఫాంగ్‌లో ఉండే లిన్ షు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే లిన్ కి వివాహం అయింది. అయితే పెళ్లి తర్వాత ఆఫీస్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లేందుకు నిత్యం వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు. తాను పెళ్లి చేసుకున్న అమ్మాయిని 7 ఏళ్ల క్రితం తొలిసారి కలిశాడు. ఇక అప్పటి నుంచి ఇద్దరం ప్రేమించుకోవడం ప్రారంభించారు. అలా ఏడేళ్ల పాటు ప్రేమించుకుని చివరికి ఇటీవలే పెళ్లి  చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత తన ఉద్యోగం కోసం రోజూ 320 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని లిన్ షు తెలిపాడు.

వైఫాంగ్ ప్రాంతంలో లిన్ షూ భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి ఆఫీస్ కింగ్ డావోకు ఉంది. ఈ రెంటిది మధ్య దూరం 160 కిలోమీటర్ల పైనే ఉంది. ఆఫీస్ ప్రాంతంలో అద్దెలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో కొత్తగా పెళ్లి కావడంతో భార్యను ఒంటరిగా వదల్లేక, అలా అని తన ఆఫీస్ ఉండే ప్రాంతంలో ఇళ్లు తీసుకోలేక లిన్ షూ.. ఇలా రోజు జర్నీ చేస్తున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందకు తన  భార్యను కంటికి రెప్పలా చూసుకునేందుకు ఇదంతా చేస్తున్నట్లు తెలిపాడు. ఇదంతా తన భార్యపై ఉన్న  ప్రేమేనంటూ లిన్ షు ..తాను పోస్టు చేసిన వీడియోలు వ్యక్తం చేశాడు.  ఈ వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

లిన్ షూ భార్య కింగ్‌డావోలో జాబ్ చేసేందుకు.. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోందని తెలిపాడు. దీంతో తన భార్యాకు కింగ్‌డావోలో ఉద్యోగం వచ్చేవరకు మాత్రమే సుదీర్ఘ ప్రయాణం ఉంటుందని తెలిపాడు. ఇద్దరికీ కింగ్‌డావోలో జాబ్ వచ్చిన తర్వాత కొంత ధనం సంపాదించిన.. అప్పుడు ఆఫీస్‌కు సమీపంలో ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు లిన్ షు పేర్కొన్నాడు. ఇక లిన్‌ షు చేసిన వీడియో వైరల్ కావడంతో అందరూ తొలుత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భార్య కోసం లిన్ షు చేస్తున్న ప్రయత్నాన్ని  ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. భార్య కోసం ఇన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించడం గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet