Businessman Spends 11 Crores for Book: ఈ పుస్తం ఖరీదు అక్షరాలా రూ.11 కోట్లు.. ఎందుకంత ప్రత్యేకత?

ఈ పుస్తం ఖరీదు అక్షరాలా రూ.11 కోట్లు.. ఎందుకంత ప్రత్యేకత?

Businessman Spends 11 Crores for Book: కొంతమందికి పుస్తకాలు కొని లైబ్రెరీలో దాచుకోవడం అంటే ఎంతో ఇష్టం.. అందుకోసం ఎంత ఖరీదైనా చేస్తుంటారు. పుస్తకం మంచి నేస్తం అంటారు.

Businessman Spends 11 Crores for Book: కొంతమందికి పుస్తకాలు కొని లైబ్రెరీలో దాచుకోవడం అంటే ఎంతో ఇష్టం.. అందుకోసం ఎంత ఖరీదైనా చేస్తుంటారు. పుస్తకం మంచి నేస్తం అంటారు.

పుస్తకం ఒక మంచి నేస్తం అంటారు.. పుస్తకంలో మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఎంతో ఉంటుంది. పుస్తకంలో మనం గుర్తుంచుకోవాల్సిన విలువైన సమాచారం ఎంతో ఉంటుంది. ఒక వ్యక్తి తాలూకు జ్ఞాపకాల పరంపర కావొచ్చు.. అనుభవాలు కావొచ్చు లేదా యదార్థాలు కావొచ్చు.. ఏదైనా సరే ఒక పుస్థకం మీ జ్ఞానాన్ని పెంచుతుందన్న వార్త నిజం. మన పూర్వికులు మొదట్లో సమాచారం తాళపత్రాల పై రాసేవారు.. తర్వాత పేపర్ పై రాయడం, 15 వ శతాబ్దం నుంచి అచ్చు యంత్రాల ద్వారా ముద్రించడం ద్వారా పుస్తకాలకు రూపం వచ్చింది. ప్రస్తుతం ప్రింటింగ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక పుస్తం గురించిన వార్త తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ పుస్తం ఏంటీ? ఎందుకుంత వైరల్ అవుతుందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు ఏ విషయం అయినా తెలుసుకోవాలంటే పుస్తకాలు చదివేవారు.. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ప్రపంచంలోని ప్రతి విషయం సెల్ ఫోన్, ఇంటర్నెట్ లో లభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి తనకు కావాల్సిన పుస్తకం కోసం ఎక్కడికో వెళ్లి.. కోట్టు ఖర్చు పెట్టి మరీ కొన్నాడు. వింటానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. నిజం. సుమారు 100 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన పుస్తకం. 1925 లో అమెరికన్ రచయిత నెపోలియన్ హిల్ రాశారు. అప్పట్లో ఆయన ఫేమస్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.  దీని పేరు ‘ ది లా ఆఫ్ సక్సెస్’. అమెరికాలోని ఇడాహూ నివాసి అయిన రస్సెల్ బ్రున్సర్ ఈ పుస్తకం మొదటి ఎడిషన్ కొన్నారు.

ఈ పుస్తకంలో నెపోలియన్ సంతకం ఉండటం విశేషం. డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. రస్సెల్స్ ఈ పుస్తకం విక్రయించడం ఆన్ లైన్ లో చూసి దాన్ని కొనాలని నిశ్చయించుకున్నాడు.అయితే ఈ పుస్తకం ధర 1.5 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.11 కోట్లు. అంత ఖరీతు చేసే పుక్తం కొనుగోలుచేయడం అంతీ వీజీ కాదు. మొదట ఆ పుస్తకం కొనుగోలుపై రస్సెల్ భార్య అభ్యంతరం చెప్పింది. మొత్తానికి తన భార్యను ఒప్పించి ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్లి పుస్తకం కొనుగోలు చేసి తన వెంట తెచ్చుకున్నాడు రస్సెల్. వృత్తి రిత్యా బిజినెస్ మ్యాన్ అయిన రస్సెల్ నెపోలియన్ రాసిన ఇతర పుస్తకాలు కూడా కొనుగోలు చేశారు. ఇందుకోసం మొత్తం రూ.18 కోట్లు ఖర్చు చేశాడు. ప్రస్తుతం రస్సెల్ కొనుగోలు చేసిన పుస్తకాల గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.

Show comments