iDreamPost
android-app
ios-app

డబ్బున్న మగాళ్లను వలలో వేసే పాఠాలు! ఈమెది కొత్త బిజినెస్ గురూ!

  • Published Jul 16, 2024 | 11:39 AM Updated Updated Jul 16, 2024 | 11:39 AM

ఈ ఫోటోలో అందంగా కనిపిస్తున్న మహిళ.. డబ్బున్న మగవాళ్లను తమ వలలో వేసుకోవడం గురించి చెబుతుంది. పెళ్లిళ్లు చేసుకుంటేనే ఆర్థిక స్వాలంబన లభిస్తుందని ఆడవాళ్లకు క్లాసులు తీసుకుంటుంది. ఇదంతా ఊరికనే కాదు..

ఈ ఫోటోలో అందంగా కనిపిస్తున్న మహిళ.. డబ్బున్న మగవాళ్లను తమ వలలో వేసుకోవడం గురించి చెబుతుంది. పెళ్లిళ్లు చేసుకుంటేనే ఆర్థిక స్వాలంబన లభిస్తుందని ఆడవాళ్లకు క్లాసులు తీసుకుంటుంది. ఇదంతా ఊరికనే కాదు..

  • Published Jul 16, 2024 | 11:39 AMUpdated Jul 16, 2024 | 11:39 AM
డబ్బున్న మగాళ్లను వలలో వేసే పాఠాలు! ఈమెది కొత్త బిజినెస్ గురూ!

అబ్బాయిల్ని ప్రేమలో పడేయడం ఎలా అందులోనూ డబ్బున్న పురుషులను తమ వలలోకి లాక్కోవడం ఎలా అని ఆలోచిస్తున్న అమ్మాయిలు ఈ ఫోటోలో యువతి నుండి ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. డబ్బున్న కుర్రాలను బుట్టలో వేసుకోవడం, వారితో పెళ్లిళ్లు ఎలాగో క్లాసులు చెబుతుంది. ఊరికనే అనుకునేరు. అందుకు మూల్యం చెల్లించాలి. మరీ ఆమె బతకాలి కదా. ప్రేమ పాఠాలు చెబుతూ కూడగట్టుకుంటుంది. మామూలు సంపాదన కాదు.. కోట్లు గడిస్తుంది. వినడానికి వింతగా ఉన్న నిజమే మరీ. అది ఆమె ఉద్యోగం. లవ్ లెసెన్స్ చెబుతూ సంపాదిస్తుందో యువతి. ఇంతకు ఈ అమ్మాయికి ఏ ఊరంటే.. మన పొరుగున ఉన్న చైనా. చైనాలో నివసిస్తుంది ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్.

చైనాకు చెందిన లీచువాంకూ అనే మహిళ స్థానికంగా చాలా ఫేమస్.  ఆమె ఒక ఇన్ఫ్లూ‌యెన్సర్. ప్రేమ, పెళ్లి, ఫ్యామిలీ గురించి పాఠాలు బోధిస్తోంది లీచువాంకూ. అబ్బాయిలకు వల వేయడం గురించి మాట్లాడుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే పెళ్లే సరైన మార్గమని చెబుతూ.. సామాన్యుడి అవసరాలైన డబ్బు, బట్టలు, బియ్యం.. ఇలా అన్ని కూడా పెళ్లి చేసుకుంటే దొరుకుతాయని చెబుతుంది. ఇలా క్లాసులు చెప్పినందుకు ఒక్కో సెషన్‌కు రూ. 13 వేల నుంచి రూ.1.16 లక్షల వరకూ వసూలు చేస్తోంది. అలా కోట్లు గడిస్తుంది. పాఠాలు  చెప్పడం ద్వారానే  ఆమె ఫేమస్ అయ్యింది. ఏడాదికి ఎంత  గడిస్తుందో తెలుసా.. రూ. 163 కోట్లట. వామ్మో అనిపిస్తుంది కదా. ఇలా చెప్పినందుకు ఆమె బ్యాన్ కూడా అయ్యింది.

అక్కడితో ఆగిపోలేదు లీచువాంకూ.  ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతూ.. తన ఫాలోవర్స్‌కు అందుబాటులో ఉంటూ కోట్లు కొల్లగొడుతోంది.   అలా లవ్ లెసెన్స్ చెబుతూనే సంపాదన పెంచుకుంది. ఇక ఆమె చెబుతున్న పాఠాలపై  చైనాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలను తమను తాము లైంగిక వస్తువులా మారేందుకు ఆమె ప్రేరేపిస్తోందని కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మగాళ్లను డబ్బులు తెచ్చే యంత్రాల మాదిరి చూస్తోందని మండిపడ్డారు. మగవాళ్లపై అమ్మాయిలను ఉసిగొల్పుతుందన్న వారు లేకపోలేరు. మొత్తానికి ఇన్ని విమర్శల నడుమ ఆమె వార్తల్లో నిలుస్తూ ట్రెండింగ్ సృష్టిస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbankobet girişgrandpashabet