iDreamPost
android-app
ios-app

బాస్ తో భార్య వివాహేతర సంబంధం…డ్రోన్ సాయంతో పట్టుకున్నభర్త!

  • Published Jul 16, 2024 | 12:41 PM Updated Updated Jul 16, 2024 | 12:41 PM

Husband Catches His Wife Uses Drone: టెక్నాలజీ కారణంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటని వినియోగించి.. అనేక సమస్యలకు పరిష్కారం కనిపెడుతున్నారు. అలానే ఓ వ్యక్తి ఏకంగా తన సంసారంలో జరిగే ఘోరాన్ని నిజాలతో బయటపెట్టేందుకు డ్రోన్ ను వినియోగించాడు. 

Husband Catches His Wife Uses Drone: టెక్నాలజీ కారణంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటని వినియోగించి.. అనేక సమస్యలకు పరిష్కారం కనిపెడుతున్నారు. అలానే ఓ వ్యక్తి ఏకంగా తన సంసారంలో జరిగే ఘోరాన్ని నిజాలతో బయటపెట్టేందుకు డ్రోన్ ను వినియోగించాడు. 

  • Published Jul 16, 2024 | 12:41 PMUpdated Jul 16, 2024 | 12:41 PM
బాస్ తో భార్య వివాహేతర సంబంధం…డ్రోన్ సాయంతో పట్టుకున్నభర్త!

నేటికాలంలో అక్రమసంబంధాలు అనేవి బాగా పెరిగిపోయాయి. కొందరు పరాయి వారి మోజులో పడి..సంసారాన్ని నిట్ట నిలువునా కూల్చుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాల్లో మహిళలు కూడా ఎక్కువగా ఉంటున్నారు. భర్తకు తెలియకుండా పరాయి వ్యక్తులతో పడక సుఖాన్ని పంచుకుంటున్నారు. ఇదే సమయంలో కొందరు భర్తలు వారి భార్యలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని..వారికి బుద్ధి చెబుతున్నారు. అయితే ఓ భర్త ఏకంగా డ్రోన్ ను ఉపయోగించి…తన భార్యా పరాయి వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆ తరువాత ఆమెకు బుద్ది వచ్చేలా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ అసలు స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

టెక్నాలజీ కారణంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటని వినియోగించి.. అనేక సమస్యలకు పరిష్కారం కనిపెడుతున్నారు. అలానే ఓ వ్యక్తి ఏకంగా తన సంసారంలో జరిగే ఘోరాన్ని నిజాలతో బయటపెట్టేందుకు డ్రోన్ ను వినియోగించాడు.  చైనాలోని సెంట్రల్ హుబీ ప్రావిన్స్ లో షియాన్ లో 33 ఏళ్ల ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు ఆయన భార్య ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా కాలం పాటు వారిద్దరి సంసారం బాగానే సాగింది. అయితే గత ఏడాది నుంచి అతడి భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. అంతేకాక పడక గదిలో అతడి దూరం పెట్టడం ప్రారంభించింది.

దీంతో ఆమహిళపై ఆమె భర్తకు అనుమానం పెరిగింది. అంతేకాక ఆమె చేసే పనుల్లో  చాలా మార్పులు వచ్చాయి. ఆఫీస్ మారడం, తరచూ తల్లిదండ్రుల ఉండే  గ్రామానికి వెళ్లిరావడం వంటివి చేస్తుంది. దీంతో తన భార్యపై సదరు వ్యక్తికి అనుమానం కలిగింది. తన భార్య ఏదో తప్పు చేస్తుందని గ్రహించాడు. దీంతో డ్రోన్ సాయంతో ఆమెను ట్రాక్ చేశాడు. ఈ క్రమంలో ఆ డ్రోన్ సాయంతో తీసిన వీడియో చూస్తే.. విస్తుపోయే  విజువల్స్ సదరు వ్యక్తికి కనిపించాయి. అతడి భార్య మరో వ్యక్తితో కారులో బయటకు వెళ్లింది. కొండ ప్రాంతంలోని మట్టి గుడిసెలోకి వారిద్దరు వెళ్లారు. దాదాపు 20 నిమిషాల తరువాత, వారు గుడిసెలో నుండి బయటకు వచ్చి..ఆమె పనిచేసే కంపెనీలోకి వెళ్లారు. ఆమెతో పాటు వెళ్లిన వ్యక్తి.. ఆ మహిళ బాస్ అని తేలింది. అతడికి కూడా ఇది వరకే వివాహం జరిగింది.

దీంతో బాధితుడు వెంటనే విడాకులకు దరఖాస్తు చేశాడు. విడాకుల విచారణలో అతను డ్రోన్ నుండి సేకరించిన సాక్ష్యాలను ఉపయోగించాలని ఆ వ్యక్తి భావిస్తున్నాడు. ఇలా ఇల్లీగల్ ఎఫైర్ ను సాంకేతికతను వినియోగించి బయటపెట్టడంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. అంతేకాక ఈ ఘటనపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ‘డ్రోన్ కొనడం మంచి ఆలోచనని, అది లేకుంటే.. ఆ అక్రమం సంబంధం ఎప్పటికీ తెలియదని పేర్కొన్నారు. ఈ హైటెక్ యుగంలో, ఏదైనా అబద్ధం కచ్చితంగా బయటపడుతుందని, కాబట్టి దంపతులు నిజాయితీగా కలసి జీవించాలనే మరికొందరు చెబుతున్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş