iDreamPost
android-app
ios-app

తాత వయస్సు వ్యక్తితో ప్రేమ, పెళ్లి.. ట్రోల్స్ రావడంతో

  • Published Jan 05, 2024 | 4:39 PM Updated Updated Jan 05, 2024 | 4:39 PM

ఈ మధ్య కాలంలో సరిహద్దు ప్రేమ కథలు ఎక్కువగా చదివి ఉంటారు లేదా టీవీల్లోనే, సోషల్ మీడియాలోనో వాచ్ చేసుంటారు. కానీ ఇదే సమయంలో సరికొత్త ప్రేమకథలు వెలుగులోకి వస్తున్నాయి. తనకన్నా వయస్సులో చాలా పెద్దదైన పురుషులు లేదా స్త్రీలతో ప్రేమలో పడుతున్నారు నేటి యువత.. అయితే మనం చెప్పుకునే ప్రేమకథలో..

ఈ మధ్య కాలంలో సరిహద్దు ప్రేమ కథలు ఎక్కువగా చదివి ఉంటారు లేదా టీవీల్లోనే, సోషల్ మీడియాలోనో వాచ్ చేసుంటారు. కానీ ఇదే సమయంలో సరికొత్త ప్రేమకథలు వెలుగులోకి వస్తున్నాయి. తనకన్నా వయస్సులో చాలా పెద్దదైన పురుషులు లేదా స్త్రీలతో ప్రేమలో పడుతున్నారు నేటి యువత.. అయితే మనం చెప్పుకునే ప్రేమకథలో..

  • Published Jan 05, 2024 | 4:39 PMUpdated Jan 05, 2024 | 4:39 PM
తాత వయస్సు వ్యక్తితో ప్రేమ, పెళ్లి.. ట్రోల్స్ రావడంతో

ప్రేమ ఏ వయస్సుల్లో, ఎప్పుడు, ఎవరితో,ఎలా కలుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఇటీవల సరిహద్దు ప్రేమ కథలే కాదూ.. వయస్సుకు హద్దులేని లవ్ స్టోరీస్ హల్ చల్ చేస్తున్నాయి. తన కన్నా వయస్సులో పెద్దదైన మహిళ/పురుషుడి ప్రేమలో మునిగిపోతున్నారు నేటి యువత. తండ్రి వయస్సు కాదు కదా తాత వరుసయ్యే వారిని ఇష్టపడుతున్నారు. వారిని మనువాడి.. పిల్లల్ని కంటున్నారు కూడా. అలాగే తన కన్నా వయస్సుల్లో చాలా చిన్న వాళ్లను వివాహం చేసుకుంటున్నారు మహిళలు, పురుషులు. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ కూడా అలాంటిదే. ఏజ్‌లో తనకన్నా త్రిబుల్ టైమ్స్ గ్యాప్ ఉన్న వ్యక్తి ప్రేమలో పడిందో యువతి. అతడిని వివాహం చేసుకుని.. లైఫ్ లీడ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పీన్స్‌కు చెందిన జాకీ అనే యువతికి అమెరికాకు చెందిన డేవిడ్ అనే వ్యక్తితో డేటింగ్ యాప్‌లో పరిచయం అయ్యింది. కాగా, అప్పట్లో జాకీకి 21 ఏళ్లు.. డేవిడ్‌కు 64 ఏళ్లు. ఇద్దరూ చాట్ చేసుకోవడం మొదలు పెట్టారు. త్వరగానే స్నేహితులుగా మారారు. ఆ తర్వాత వీరి మధ్య చిగురించింది. జాకీని కలిసేందుకు డేవిడ్ అమెరికా నుండి ఫిలిప్పీన్స్ వెళ్లాడు. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవడంతో 2018లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి ఇద్దరూ కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వయస్సు 28 కాగా, అతడి వయస్సు 70 ఏళ్లు. అయితే జాకీ.. తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. దీంతో ఆమెను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

అతడితో ఉన్న ఏదైనా పిక్ పంచుకోగానే.. తండ్రి, కూతుళ్లనో లేదా.. తాత, మనవరాలు అంటూ వెక్కిరిస్తూ ఉంటారు. యూట్యూబ్, టిక్ టాక్, ఇన్ స్టా వేదికగా ఈ జంటపై నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. అయినప్పటికీ వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళుతున్నారీ జంట. పెళ్లై 5 నిండినా వీరి గురించి పిచ్చి పిచ్చి రాతలు రాస్తూనే ఉన్నారు. అయితే ఆ అమ్మాయి కూడా ట్రోలర్లకు గట్టి సమాధానమే ఇస్తుంది. ‘ నిజమైన ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని, అతడంటే నాకు ఎంతో ఇష్టం’ అంటూ చెబుతుంది. అలాగే ఇటీవల తన కుటుంబానికి 25 వేల డాలర్లు డేవిడ్ ఆర్థిక సాయాన్ని అందించాలన్న యోచనలో ఉన్నాడని ఇటీవల ఓ వీడియోలో పేర్కొంది.

అంతే.. ఆమె డేవిడ్ దత్త పుత్రిక అని, బంగారు బాతును పట్టుకున్నావ్ జాకీ అంటూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఆమె సుతిమెత్తంగా కౌంటర్ ఇచ్చింది. ‘డేవిడ్‌నే కాదూ మిమ్మల్ని కూడా చాలా ఘాడంగానే ప్రేమిస్తున్నా. మీరు కూడా డబ్బులు ఇవ్వండి అంటూ కామెంట్ చేసింది. అయితే నెటిజన్లు చేస్తున్న  ఇటువంటి కామెంట్స్ తాను పట్టించుకోనని చెబుతున్నాడు డేవిడ్. ఏదైమైనా ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించిందీ జంట. మరీ మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Epstein Jackie (@misisepstein)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom