తిమింగలం కడుపులో కోట్ల రూపాయల విలువైన నిధి! ఎక్కడంటే?

  • Author singhj Published - 05:36 PM, Thu - 6 July 23
  • Author singhj Published - 05:36 PM, Thu - 6 July 23
తిమింగలం కడుపులో కోట్ల రూపాయల విలువైన నిధి! ఎక్కడంటే?

డబ్బులు సంపాదించడం అంటే అంత ఈజీ కాదు. ఏదో ఒక పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు. డబ్బుల కంటే పని ముఖ్యం కాబట్టి నచ్చిన పని చేసుకుంటూ జీవనం సాగించేవారు కూడా కొంతమంది ఉన్నారు. వ్యాపారం చేస్తూ లైఫ్​ను లీడ్ చేసేవాళ్లూ ఉన్నారు. అయితే డబ్బుల కోసం జాబ్, బిజినెస్ లాంటివి ఏదో ఒకటి చేయాల్సిందే. కానీ కొందరు మాత్రం ఏ పని లేకుండానే రూ.కోట్లు గడించాలని అనుకుంటారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతుంటారు. గుప్త నిధుల కోసం వెతివకేవాళ్లూ ఉన్నారు. అయితే అలా వెళ్లినవారిలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. నిధుల కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు.

కానీ ఈ సంఘటనలో మాత్రం వెతక్కుండానే ఒక భారీ నిధి దొరికింది. కానరీ అనే దీవుల్లోని లా పాల్మాలోని నోగలెస్ బీచ్​లో పడి ఉన్న ఒక తిమింగళం కడుపులో ఏకంగా రూ.44 కోట్ల విలువైన నిధిని గుర్తించడం సంచలనంగా మారింది. బీచ్​లో నిర్జీవంగా పడి ఉన్న తిమింగలాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. జీర్ణ సంబంధిత సమస్యతో ఇది చనిపోయిందని టెస్టుల్లో వెల్లడైంది. ఈ భారీ తిమింగళం అవశేషాలను పరిశీలించిన సైంటిస్టులకు దాని అంతర్భాగంలో విలువైన నిధి కనిపించింది. తిమింగలం చావుకు గల కారణాలను పరిశోధించడానికి లాస్ పాల్మాస్ యూనివర్సిటీ వాళ్లు ఆంటోనియో ఫెర్నాండెజ్ రోడ్రిగ్జ్​ అనే వ్యక్తిని పిలిపించారు.

రోడ్రిగ్జ్ పరిశీలించగా తిమింగలం కడుపులో ఒక వస్తువు దృఢంగా కనిపించింది. 50 నుంచి 60 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన 9.5 కిలోల బరువున్న రాయి బయటపడిందని రోడ్రిగ్జ్ తెలిపారు. ఈ రాయిని అంబర్​గ్రిస్ అని అంటారని ఆయన తెలిపారు. అంబర్​గ్రిస్ అనేది 1 శాతం కంటే తక్కువ స్పెర్మ్‌ తిమింగలాలు ఉత్పత్తి చేసే అరుదైన పదార్థమట. స్పెర్మ్‌ తిమింగలాలు మామూలుగా స్క్విడ్, కటిల్ ఫిష్​లను తింటాయి. అయితే ఇవి తినేవి పూర్తిగా అరగవట. అలా కాలక్రమేణా కడుపులో పేరుకుపోయిన వాటితో అంబర్​గ్రిస్ తయారవుతోంది. అలాంటి ఒక అంబర్​గ్రిస్​ ముద్దను తిమింగలం నుంచి రోడ్రిగ్జ్ బయటకు తీశారు. దీని విలువ రూ.44 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.

Show comments