iDreamPost
android-app
ios-app

భర్తతో విడిపోయి.. ఊహించని రేంజ్‌లో రివేంజ్‌ తీర్చుకున్న భార్య!

  • Published Sep 10, 2024 | 1:50 PM Updated Updated Sep 10, 2024 | 1:50 PM

Dubai Princess Sheikha Mahra: సోషల్ మీడియాలో తరుచూ దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తుమ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇటీవల తన భర్త నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.తాజాగా షైకా మహ్రా చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది.

Dubai Princess Sheikha Mahra: సోషల్ మీడియాలో తరుచూ దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తుమ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇటీవల తన భర్త నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.తాజాగా షైకా మహ్రా చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది.

  • Published Sep 10, 2024 | 1:50 PMUpdated Sep 10, 2024 | 1:50 PM
భర్తతో విడిపోయి.. ఊహించని రేంజ్‌లో రివేంజ్‌ తీర్చుకున్న భార్య!

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి విషయం క్షణాల్లో వైరల్ గా మారుతుంది. సోషల్ మాధ్యమాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న దుబాయ్ యువరణా షేఖా మహ్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. అందం, హై ఎడ్యూకేషన్, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిఉన్న ఆమె ఏది పోస్ట్ చేసినా సెన్సేషన్ అవుతుంది. ఇటీవల తన భర్తతో విడాకులతో తీసుకుంటున్నా అంటూ ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసి సెన్సేషన్ సృష్టించిన దుబాయ్ యువరాణి షేఖా మహ్రా ఆల్ మక్తూమ్ తాజాగా మరో పోస్ట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఆమె చేసిన ఆ పోస్ట్ ఏంటీ? ఎందుకు అంత ప్రత్యేకత అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

దుబాయ్ యువరాణి షేఖా మహ్రా ఆల్ మక్తూమ్ జులై లో తన భర్తకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాను ‘డివోర్స్’ (విడాకులు) పేరుతో కొత్త పెర్ఫ్యూమ్ లాంచ్ చేయబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. సొంత బ్రాండ్ ‘మహ్రా ఎం1’ కింద దాన్ని త్వరలో మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ టీజర్ భలే ఆకట్టుకుంటుంది. అయితే ఆ పర్ప్యూమ్ ధర, ఇతర విషయాలు ఏమీ వెల్లడించలేదు. విడాకులు తీసుకున్న కొన్ని వారాలకే ‘డివోర్స్’ పేరుతో ఆమె బిజినెస్ రంగంలోకి దిగడంతో భర్తపై రివేంజ్‌ తీర్చుకుంటుందా అన్న కామెంట్స్ వినిపిస్తునున్నాయి. దుబాయ్ రాజు, యూఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బీన్ రషీద్ అల్ మక్తమ్ కూతురు యువరాణి షైకా మహ్రా. బ్రిటన్ లో చదువుకున్న షైకా మహ్రా ఇంటర్నేషనల్ ఎఫైర్స్ లో పట్టా పుచ్చుకుంది.

గత ఏడాది దుబాయ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనాబిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ తో వివాహం జరిగింది. పలు దేశాలకు టూర్స్ కు వెళ్తూ ఈ జంట ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ హల్ చల్ చేశాయి. వీరికి ఒక పాప జన్మించింది. ఏడాది తర్వాత.. తన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకమని చెబుతూ భర్త, చిన్నారితో కూడిన ఫోటోలను మహ్రా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత విడాకుల ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చింది. మీరు ఇతరుల సహచర్యం కోరుకున్నందుకు మీతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నా సోషల్ మీడియా వేదికగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వ్యాపార రంగంలో అడుగు పెడుతూ.. డివోర్స్ పేరుతో పర్ప్యూమ్ మార్కెట్ లోకి తీసుకురావడంపై ఆమెలో ఎంత గట్స్ ఉన్నాయో అర్థమవుతుంది. ప్రస్తుతం షేఖా మహ్రా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by @mahraxm1

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş