iDreamPost
android-app
ios-app

రూ.490 కోట్ల ఖర్చుతో ఘనంగా కూతురు పెళ్లి!

  • Published Nov 28, 2023 | 11:18 AM Updated Updated Nov 28, 2023 | 11:18 AM

పెళ్లిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు.. కానీ ఈ మధ్య పెళ్లిళ్లు మాత్రం వధూ-వరుల ఇష్టానుసారంగా జరుగుతున్నాయి. పెళ్లి కి ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్ మొదలు.. పెళ్లి తంతు ముగిసే వరకు తమ స్థాయికి తగ్గట్లు జరిపించుకుంటున్నారు.

పెళ్లిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు.. కానీ ఈ మధ్య పెళ్లిళ్లు మాత్రం వధూ-వరుల ఇష్టానుసారంగా జరుగుతున్నాయి. పెళ్లి కి ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్ మొదలు.. పెళ్లి తంతు ముగిసే వరకు తమ స్థాయికి తగ్గట్లు జరిపించుకుంటున్నారు.

  • Published Nov 28, 2023 | 11:18 AMUpdated Nov 28, 2023 | 11:18 AM
రూ.490 కోట్ల ఖర్చుతో ఘనంగా కూతురు పెళ్లి!

పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితంలో వివాహ వేడుక ఎప్పటికీ మర్చిపోలేని విధంగా జరుపుకోవాలని చూస్తుంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు తమ స్థాయికి తగ్గట్టు వివాహవేడుకలు జరిపిస్తుంటారు. ఈ మధ్య నిశ్చితార్థం నుంచి మొదలు పెళ్లి వరకు ఎన్నో రకాలుగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక కాబోయే నవదంపతులు ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ తో ఊదరగొడుతున్నారు. ఇందుకోసం అందమైన లోకేష్స్ ఎంచుకుంటున్నారు.. వివిధ రకాలుగా ఫోటో షూట్స్ తీయించుకుంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు తమ కూతురు పెళ్లి కనీవినీ ఎరుగని రీతిలో ఎవరూ ఊహించని విధంగా జరిపించాలని చూస్తుంటారు. ఇటీవల పెళ్లిళ్లు ఏకంగా ఆకాశం, సముద్ర భూగర్భంలో జరుగుతున్నాయి.  రెండు రోజుల క్రితం ఓ తండ్రి ఆకాశంలో ఎగురుతున్న విమానంలో తన కూతురు పెళ్లి చేసి అందరి దృష్టి ఆకర్షించారు. తాజాగా ఓ తండ్రి కూతురు పెళ్లి కోసం కోట్లు ఖర్చు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే..

అమెరికాకు చెందిన బెంజ్ కార్ల డీలర్ బాబ్ బ్రాక్ వే అనే ఓ బడా వ్యాపారవేత్త తన కూతురి పెళ్లి ఎవరూ ఊహించలేని విధంగా జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి కూతురు మ్యాడీలైన్ (26).. పారిస్ కి చెందిన జాకబ్ ని కొంతకాలంగా ప్రేమించింది. తమ పిల్ల ప్రేమను పెద్దల మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. దీంతో విరిద్దరి పెళ్లి ఘనంగా చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాబ్ బ్రాక్ వే పెళ్లి కోసం ఖరీదైన ఆభరణాలు, లగ్జరీ మ్యారేజ్ హాల్,  అమెరికా పాన్ సింగర్లతో కన్సర్ట్, ఎన్నో రకాల స్పెషల్ డిషస్ లు ఏర్పాటు చేశారు. ఇక అతిధులను అయితే స్పెషల్ ఫ్లైట్లలో తరలించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

తన కూతురు-అల్లుడు ముఖంలో సంతోషం కోసం ఈ  పెళ్లి 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపించారు. అమెరికాలో మీడియాలో ఈ పెళ్లి వేడుక ప్రత్యేక వార్తగా నిలిచిపోయింది.  ఈ తంతంగానికి దాదాపు రూ.490 కోట్ల ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా సంపన్నులు తల్చుకుంటే ఏదైనా సాధ్యమే అంటారు.. తండ్రి తన కూతురుపై ప్రేమను అంతగొప్పగా చాటుకున్నాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcandycasino girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio