iDreamPost
android-app
ios-app

బట్ట బొమ్మతో వ్యక్తి పెళ్లి, సంసారం.. పిల్లలు కూడా ఉన్నారు!

  • Published Aug 09, 2023 | 10:32 AM Updated Updated Aug 09, 2023 | 10:32 AM
  • Published Aug 09, 2023 | 10:32 AMUpdated Aug 09, 2023 | 10:32 AM
బట్ట బొమ్మతో వ్యక్తి పెళ్లి, సంసారం.. పిల్లలు కూడా ఉన్నారు!

ఆడ, మగ మధ్య పెళ్లిళ్లు జరగటం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఒకే జెండర్‌కు చెందిన వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవటం కూడా ఎక్కువయింది. తోడు కోసమో.. శారీరక సుఖం కోసమో పెళ్లి చేసుకునే వారే ఈ సమాజంలో ఎక్కువగా ఉన్నారు. అయితే, వీటన్నింటికీ భిన్నంగా టెక్నాలజీ సృష్టించిన మనుషుల్ని.. బొమ్మల్ని కూడా పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు. బట్ట బొమ్మని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న మనుషులు ఇతర దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా అలాంటిదే. ఓ వ్యక్తి బట్ట బొమ్మను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పిల్లలను కూడా సృష్టించుకున్నాడు. ఆ బట్ట బొమ్మ భార్యతో తన జీవితం ఎంతో సంతోషంగా ఉందని అంటున్నాడు.

ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. కొలంబియాకు చెందిన క్రిష్టియన్‌ మోంటెనెగ్రో గతంలో ఓ యువతిని ప్రేమించాడు. కొన్నేళ్లు వీరి ప్రేమ ప్రయాణం బాగానే సాగింది. తర్వాతి నుంచి గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు. బ్రేకప్‌ కారణంగా క్రిష్టియన్‌ ఒంటరి వాడయ్యాడు. ఆ ఒంటరి తనం కారణంగా డిప్రెషన్‌లోకి కూడా వెళ్లాడు. ఇక, అప్పటినుంచి ఎవరి తోనూ అతను రిలేషన్‌లో ఉండటానికి ఇష్టపడలేదు. అలాంటి వాడు అనుకోకుండా ఓ బట్ట బొమ్మతో ప్రేమలో పడ్డాడు. తర్వాత ఆ బట్ట బొమ్మనే పెళ్లి చేసుకున్నాడు. ఆ బొమ్మను పెళ్లి చేసుకోవటమే కాదు.. ముగ్గురు బట్ట బొమ్మ పిల్లలను కూడా సృష్టించుకున్నాడు.

బొమ్మ కుటుంబం.. చింత లేని కుటుంబం అంటూ క్రిష్టియన్‌ సంతోషిస్తున్నాడు. నటాలియ తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన జీవితం ఎంతో సంబరంగా మారిందని అంటున్నాడు. అప్పుడపుడు తన భార్య, పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం క్రిష్టియన్‌, నటాలియాల లవ్‌ స్టోరీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లవ్‌, మ్యారేజ్‌ స్టోరీ తెలిసిన జనం ‘‘ పుర్రెకో బుద్ధి.. జిహ్మకో రుచి’’ అంటూ మండిపడుతున్నారు. మరి, ఈ వింత లవ్‌, మ్యారేజ్‌ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Cristian Montenegro (@cristian_montenegrooficial)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio