iDreamPost
android-app
ios-app

అర్జెంటీనా అధ్యక్షుడి వెకిలీ చేష్టలు.. తిట్టిపోస్తున్న ప్రజలు

  • Published Jan 03, 2024 | 6:39 PM Updated Updated Jan 03, 2024 | 6:39 PM

దేశానికి, ఆ దేశ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించే ముఖ్యమైన వ్యక్తి అధ్యక్షుడు. కానీ ఇటీవల కాలంలో కొంత మంది వికృత, వింత చేష్టలతో వార్తల్లో నిలుస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, మాజీ ప్రెసిడెంట్ ట్రంప్, ఫిలీప్పిన్ మాజీ అధ్యక్షుడు ఇలాంటి చేష్టలతో వైరల్ అవుతుంటారు.. తాజాగా

దేశానికి, ఆ దేశ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించే ముఖ్యమైన వ్యక్తి అధ్యక్షుడు. కానీ ఇటీవల కాలంలో కొంత మంది వికృత, వింత చేష్టలతో వార్తల్లో నిలుస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, మాజీ ప్రెసిడెంట్ ట్రంప్, ఫిలీప్పిన్ మాజీ అధ్యక్షుడు ఇలాంటి చేష్టలతో వైరల్ అవుతుంటారు.. తాజాగా

  • Published Jan 03, 2024 | 6:39 PMUpdated Jan 03, 2024 | 6:39 PM
అర్జెంటీనా అధ్యక్షుడి వెకిలీ చేష్టలు.. తిట్టిపోస్తున్న ప్రజలు

ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి గుర్తించిన, గుర్తించబడని దేశాలు 240 ఉన్నాయి. దేశాన్ని బట్టి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. దేశానికో అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి ఉంటారు. ఆ తర్వాత కీలక పాత్ర పోషిస్తాడు..ప్రధాని. దుబాయ్ వంటి రాజుల పాలన మినహా.. ఎక్కువ దేశాల్లో అధ్యక్ష పాలనే ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఈ అధ్యక్షులు తమ వ్యవహార శైలితో విమర్శలు పాలు అవుతున్నారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. ఏదో ఒక విషయంలో వివాదాల్లో  వార్తల్లో నిలుస్తూనే ఉండేవారు. ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూరెట్టి అమ్మాయిల విషయంలో జుగుప్పాకరంగా వ్యవహరిస్తూ గతంలో పలు మార్లు విమర్శలు కొని తెచ్చుకున్నాడు.

ఇప్పుడు మరో దేశ అధ్యక్షుడు.. ఓ ప్రైవేట్ సంగీత కార్యక్రమంలో ప్రియురాలితో కలిసి రొమాన్స్ చేశాడు. వీక్షకుల ముందే ఈ పని చేయడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. అతడే అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే. మార్ డెల్ ప్లాటాలోని రాక్సీ థియేటర్‌లో సంగీత విభావరీ జరుగుతుండగా.. అక్కడకు వెళ్లారు జేవియర్.. అతడి ప్రేయసి ఫాతిమా ఫ్లోరేజ్. ఈ సంగీత ప్రదర్శన కోసం 53 ఏళ్ల ప్రెసిడెంట్ తన సొంత ఖర్చుతో టికెట్ కూడా కొన్నాడు. ఈ కచేరీ అయిపోయాక.. తన ప్రియురాలు ఫాతిమాతో వేదికపై వెళ్లాడు. అనంతరం అధ్యక్షుడు జేవియర్ మాట్లాడుతూ.. అర్జెంటీనాకు కష్ట కాలం రాబోతుందని, దేశం కోసం కలిసి కట్టుగా పనిచేయాలని అందరిలోనూ స్ఫూర్తినింపాడు. అంతలో అదే వేదికపై ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ఫాతిమాకు లిప్ కిస్ ఇచ్చాడు.

 ఆమె కూడా రెచ్చిపోతూ అతడికి ముద్దుల వర్షం కురిపించింది. అంతే ప్రేక్షకులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.  ఈ డిసెంబర్ 30న జరిగిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవు తుంది. దీంతో అధ్యక్షుడిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం పరువు తీశాంటూ తిట్టిపోస్తున్నారు. దేశ అధ్యక్షుడి స్థానంలో ఉండి.. ఇవేం చేష్టలు అంటూ మండిపడుతున్నారు. ఇక ఫాతిమా ఒక ప్రముఖ హాస్యనటి. తన భర్త నుండి విడిపోయిన తర్వాత ఆమె ఒక టాక్ షోలో జేవియర్‌ను కలుసుకుంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ప్రారంభమైంది. అయితే వీరిద్దరూ ఇలా ప్రవర్తించడం ఇది తొలిసారి కాదు.. నవంబర్ లో దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత.. జేవియర్ గెలుస్తాడన్న ఆనందంలో వీరిద్దరూ బహిరంగంగానే రెచ్చిపోయారట.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet