Uppula Naresh
Uppula Naresh
మాములుగా పాములాంటి పరాన్న జీవులు అడవుల్లో, పాడు బడిన ఇళ్లల్లో చెట్ల పొదల్లో ఉంటాయి. ఇక అప్పుడప్పుడు ఇళ్లల్లోకి కూడా దూరిపోతుంటాయి. కానీ, తాజాగా మాత్రం ఏకంగా ఓ మహిళ మెదడులో కనిపించింది. మీరు చదివింది నిజమే. వైద్యులు ఆ మహిళకు MRI స్కానింగ్ చేసి చూడగా నిజంగానే మెదడులో ఓ పాము లాంటి పరాన్నజీవి దర్శనమిచ్చింది. ఇది చూసిన వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనంతరం చాకచక్యంగా చికిత్స చేసి మొత్తానికి ఆ మహిళ మెదడులో ఉన్న ఆ జీవిని బయటకు తీశారు. ఆ మహిళ మెదడులోకి అది ఎలా దూరింది? అసలు సంగతి ఏంటనే పూర్తి వివరాలు మీ కోసం.
ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా నగరంలో 64 ఏళ్ల వృద్ధురాలు నివాసం ఉంటున్నారు. అయితే గత కొంత కాలం నుంచి ఆమెకు అప్పుడప్పుడు పొడి దగ్గు, తీవ్రమైన జ్వరం, అలసట, ఒళ్లు నొప్పులు వస్తుండేది. దీంతో ఆ మహిళ చికిత్స కోసం వైద్యులను సంప్రదించిది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లింది. ఏం జరిగిందా అని వైద్యులు ఆమెకు MRI స్కానింగ్ చేసి చూడగా.. ఆ మహిళ మెదడులో ఓ చిన్న పాము లాంటి పరాన్నజీవి పాము కనిపించింది. దీన్ని చూసి డాక్టర్లు మొదటగా షాక్ గురై ఆ తర్వాత ఆశ్చర్యపోయారు. ఇక మొత్తానికి చాకచక్యంగా చికిత్స చేసిన వైద్యులు ఆ మహిళ మెదడులో ఆ జీవిని బయటకు తీశారు. దీంతో ఆమె ఊపిరి పీల్చుకుంది.
ఈ విషయం ఆ మహిళ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వాళ్లు షాక్ గురయ్యారు. అనంతరం చికిత్స చేసిన వైద్యులు మాట్లాడుతూ.. ఓ మనిషి శరీరంలో ఓ పాము లాంటి పరాన్నజీవి ఉండడం అనేది ఇదే మొదటి సారి. ఇలా ఎన్నడూ జరగలేదు. పొరపాటున ఆమె తిన్న ఆహారంలో పాము గుడ్లు చేరి ఉండవచ్చని, దీని కారణంగానే ఆమె మెదడులో ఆ జీవి ప్రవేశించిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మహిళ మెదడులో కనిపించిన పరాన్నజీవి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కోడి రెట్టతో కరెంట్ తయారు చేస్తున్న వ్యక్తి!