ఈ చిన్న గిన్నె ధర రూ.248 కోట్లు! అంత స్పెషల్‌ ఏంటంటే..?

ఈ చిన్న గిన్నె ధర రూ.248 కోట్లు! అంత స్పెషల్‌ ఏంటంటే..?

Hong Kong, Sadabi, Bowl: ఒక చిన్న గిన్నె, అందులోనూ చాలా పాత గిన్నె.. దాన్ని ధర ఏకంగా రూ.248 కోట్లు. వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే.. ఆ గిన్నె స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Hong Kong, Sadabi, Bowl: ఒక చిన్న గిన్నె, అందులోనూ చాలా పాత గిన్నె.. దాన్ని ధర ఏకంగా రూ.248 కోట్లు. వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే.. ఆ గిన్నె స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంత పచ్చడి వేసుకోవడానికి పనికొచ్చేలా ఉన్న ఈ చిన్న బౌల్‌కు అంత ధర ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. పైగా అది పాత గిన్నె. అయితే.. ఇక్కడే ఒక సామెతను మనం గుర్తు చేసుకోవాలి. అదే.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌. ఈ సూత్రం ఆధారంగానే ఈ చిన్న పాత గిన్నెకు ఏకంగా రూ.248 కోట్ల అతి భారీ దక్కింది. ఇంతకీ ఆ గిన్నెకు ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఎంత పూరాతన వస్తువు అయినా దానికి అంత ధర ఎందుకు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం..

1000 ఏళ్ల నాటి అరుదైన ఈ చిన్న గిన్నె రూ.248 కోట్లకు వేలంలో అమ్ముడుపోయింది. హాంగ్‌కాంగ్‌లో జరిగిన వేలం పాటలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ చిన్న బౌల్‌ చైనాలోని సాంగ్‌ రాజవంశానికి చెందినది. అందుకే దీనికి అంత డిమాండ్‌. ఈ గిన్నె కోసం జరిగిన వేలం పాటలో చాలా మంది పాల్గొన్నారు. కొంతమంది ప్రత్యక్షంగా పాల్గొన్న మరికొంత మంది ఆల్‌లైన్‌లో సైతం వేలంలో పాల్గొన్నారు. ఈ గిన్నె కోసం కేవలం 20 నిమిషాల్లోనే 248 కోట్లు కుమ్మరించారు.

ఇక ఈ గిన్నె విషయానికి వస్తే.. దీని చుట్టుకొలత 13 సెంటీ మీటర్లు. లేత నీలం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ పాత్రను రాజుల కాలంలో బ్రష్‌లు కడిగేందుకు ఉపయోగించేవారంటా. వేలంలో ఈ గిన్నె ధర రూ.67 కోట్లుగా నిర్ణయించారు. 67 కోట్ల నుంచి కేవలం 20 నిమిషాల్లోనే ఏకంగా 248 కోట్లు వెళ్లింది గిన్నె ధర. రు-వేర్‌(పాత) పాత్రలకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. గతంలో అంటే 2014లో మింగ్‌ రాజవంశానికి చెందిన వైన్‌ పాత్రను వేలం వేస్తే.. లియు అనే వ్యక్తి దాన్ని రూ.235 కోట్లకు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును ఈ పాత్ర బ్రేక్‌ చేసింది. అయితే.. ఈ పాత్రను ఎవరు కొనుగోలు చేశారనే విషయాన్ని.. వేలం నిర్వహించిన సంస్థ సదబీ ఇంకా తెలియజేయలేదు. మరి ఒక చిన్న గిన్నె రూ.248 కోట్ల ధర పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments