iDreamPost
android-app
ios-app

80 ఏళ్ల వృద్ధుడితో 23 ఏళ్ల యువతి ప్రేమ.. పెద్దలు కాదనడంతో

‘ప్రేమకు అర్థం లేదంటే నిన్ను నన్నే చూపిస్తా’ అంటోంది ఓ యువతి. తండ్రి, కాదు తాత వయస్సున్న వ్యక్తితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అంత వయస్సున్న వ్యక్తితో కాపురం చేస్తామంటే వారు ఒప్పుకోలేదు.

‘ప్రేమకు అర్థం లేదంటే నిన్ను నన్నే చూపిస్తా’ అంటోంది ఓ యువతి. తండ్రి, కాదు తాత వయస్సున్న వ్యక్తితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అంత వయస్సున్న వ్యక్తితో కాపురం చేస్తామంటే వారు ఒప్పుకోలేదు.

80 ఏళ్ల వృద్ధుడితో 23 ఏళ్ల యువతి ప్రేమ.. పెద్దలు కాదనడంతో

ఈ రోజుల్లో ప్రేమకు వయస్సుతో సంబంధం ఉండటం లేదు.చిన్నా, పెద్ద అనే తారతమ్యం లేదు. ఒకప్పుడు తన కంటే చిన్న అమ్మాయిని మాత్రమే ప్రేమించేవాడు మగాడు. అలాగే యువతి కూడా తనకు తగ్గ జోడిని వెతుక్కునేది. కానీ నేటి కాలంలో అన్నీ మారినట్లే.. ఈ ప్రేమ వ్యవహారం కూడా కొత్త పుంతలు తొక్కుతుంది. ఆంటీ వయస్సున్న మహిళతో ప్రేమలో పడుతున్నారు యువకుడు. అలాగే తన తండ్రి వయస్సున్న వ్యక్తితో రొమాన్స్ చేస్తుంది అమ్మాయి. ఇద్దరి మధ్య వయస్సు వ్యత్యాసం సుమారు 20 నుండి 30 ఏళ్లు ఉంటుంది. ఇప్పుడు ఓ అమ్మాయి ఏకంగా తాత వయస్సున్న వ్యక్తితో ప్రేమలో పడటమే కాదు.. పెద్దలు కాదన్న అతడితోనే తన జీవితం అంటోంది.

‘పెద్దలొద్దంటున్నా.. ప్రేమ తప్పని అన్నా.. ఎవరెవమనుకున్నా.. జానేబీదో యార్’ అంటూ ఈ చైనా పిల్ల. అతడి కోసం ఎవర్ని లెక్క చేయడం లేదు ఈ మొండి పిల్ల. 80 ఏళ్ల వృద్ధుడితో ప్రేమలో పడింది. అతడితోనే సర్వస్వం అని చెబుతుంది. వినడానికి వింతగా ఉన్నఈ సరికొత్త ప్రేమ కథ ఎక్కడంటే..చైనాలోని హెబీ ప్రావిన్స్‌‌లో. వృద్ధాశ్రమంలో ఏర్పడిన పరిచయం..ప్రేమకు దారి తీసింది. ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం హెబీ ప్రావిన్స్‌లోని రిటైర్మెంట్ హోమ్‌లో వాలంటీర్‌గా పనిచేస్తోన్న 23 ఏళ్ల యువతికి..అక్కడే 80 ఏళ్ల వృద్ధుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు తొలుత స్నేహితులు అయ్యారు. ఇద్దరు తమ అభిప్రాయాలను,హబీలను పంచుకున్నారు. ఇద్దరివి ఒకే ఆలోచనలు కావడంతో కలిసి జీవించాలనుకున్నారు. అయితే పత్రి ప్రేమ కథకు విలన్లు తల్లిందండ్రులే అయినట్లు.. వీరి లవ్ స్టోరీకి కూడా అయ్యారు.

తన ప్రేమను తల్లిదండ్రులకు చెప్పింది యువతి. తమ కన్నా పెద్ద వాడైన వ్యక్తితో పెళ్లి అనగానే ససేమీరా అన్నారు పేరెంట్స్. తాత వయస్సున వ్యక్తిని పెళ్లి చేసుకుని, అతడితో శృంగారం చేస్తానంటే ఒప్పుకోలేదు. దీంతో తన ప్రేమ కోసం.. తన పుట్టుకకు కారణమైన వారిని కూడా విడిచిపెట్టేసింది. ఇటీవల వీరు వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఆ అమ్మాయి తరుఫు బంధువులు ఎవ్వరూ రాలేదు. పెళ్లి సమయంలో ఒకరినొకరు విడిపోకూడదని హామీలు ఇచ్చిపుచ్చుకున్నారట. వృద్ధుడి పరిపక్వత, స్థిరత్వం, తెలివితేటలకు తాను ఆకర్షితురాలిని అయ్యానని అమ్మాయి చెప్పింది. అదే సమయంలో వృద్దురాలు తాను ఆ యువతి దయ, శారీరక సౌందర్యానికి ముగ్ధుడయ్యానని పేర్కొన్నాడు. కాగా, ఈ పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా, ఆమె గడ్స్ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు.