171ఏళ్లుగా క్రితం సముద్రంలో ఓడ! ఇప్పుడు ఏమి దొరికాయంటే?

171ఏళ్లుగా క్రితం సముద్రంలో ఓడ! ఇప్పుడు ఏమి దొరికాయంటే?

171 ఏళ్ల క్రితం బాలిస్టిక్ సముద్ర గర్భంలో మునిగిన ఓడను తాజాగా గుర్తించారు డైవర్లు. అక్కడ ఏదో వింత వస్తువులా అనిపించగా.. తొలుత ఫిషింగ్ బోట్ అనుకున్నారు. తీరా చూడగా.. పెద్ద నౌక. .పురాతనమైనదనిగా తేలింది. ఇందులో

171 ఏళ్ల క్రితం బాలిస్టిక్ సముద్ర గర్భంలో మునిగిన ఓడను తాజాగా గుర్తించారు డైవర్లు. అక్కడ ఏదో వింత వస్తువులా అనిపించగా.. తొలుత ఫిషింగ్ బోట్ అనుకున్నారు. తీరా చూడగా.. పెద్ద నౌక. .పురాతనమైనదనిగా తేలింది. ఇందులో

ఎన్నో ఏళ్ల క్రితం మునిగిపోయిన ఓడ శిథిలాలను గుర్తించారు పరిశోధకులు. 19 శతాబ్దం కాలం నాటి ఓడలో ఎన్నో ఏళ్ల నాటి షాంపైన్, మినరల్ వాటర్, పింగాణీ వస్తువులు, లగ్జరీ వస్తువులు లభించాయి. జులై 11న బాల్టిక్ సముద్ర గర్భంలో ఓలాండ్ ద్వీపానికి దక్షిణంగా 37 కిలో మీటర్ల దూరంలో ఆసక్తికరంగా ఏదో కనిపించండంతో పోలీష్ ప్రైవేట్ బాల్టిక్ టెక్ గ్రూప్ డైవర్స్ వెతకసాగారు. అయితే ఇది మునిగిపోయిన ఓడ శిథిలాలుగా గుర్తించి చూడగా.. విలువైన సరకుకు లభించింది. ఆ ఓడ నిండా ఖరీదైన షాంపైన్ మద్యం సీసాలతో నిండిపోయినట్లు డైవర్ల బృందం తెలిపింది. వీటితో పాటు మినరల్ వాటర్, సెల్టర్స్, వైద్య పరికరాలు ఉన్నట్లు పేర్కొంది. ఇది 171 ఏళ్ల నాటి ఓడగా గుర్తించారు పరిశోధకులు.

ఈ ఓడలో 100 కంటే ఎక్కువ షాంపైన్ బాటిళ్లు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఈ ఓడను కనుగొన్న టీమ్ లీడర్ టోమాస్ట్‌ స్టాచురా వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నీళ్లలో మునిగిపోయిన ఓడ శిథిలాలలో షాంపైన్‌, మినరల్‌ వాటర్‌, పింగాణి పాత్రలు పెద్ద మొత్తంలో ఉన్నాయని చెప్పారు. స్టాచురా బాల్టిక్ సముద్రంలో ఇప్పటి వరకు వేలాది శిధిలాలను ఫోటో తీశాడు. స్వీడన్‌లోని ఓలాండ్ ద్వీపానికి 37 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ నౌకను గుర్తించారు. తొలుత అది ఫిషింగ్ బోట్ అని అనుకున్నారు. కానీ ఇద్దరు డైవర్లు లోపలికి వెళ్లి పరిశోధించే క్రమంలో పెద్ద నౌకగా గుర్తించారు. 19వ శతబ్దానికి చెందిన సెయిలింగ్ షిప్ అని కనుగొన్నారు. అందులో 100 కంటే ఎక్కువ షాంపైన్ బాటిళ్లను గుర్తించారు.

అలాగే స్టాచురా మాట్లాడుతూ.. ‘నేను 40 సంవత్సరాలుగా డైవర్‌గా ఉన్నాను. అప్పుడప్పుడు, మునిగిన పడవల్లో ఒకటో లేదో రెండు బాటిల్స్ చూశాను కానీ.. ఇంత పెద్ద మొత్తంలో మద్యం సీసాలను చూడం ఇదే తొలిసారి. ఇద్దరు డైవర్లు లోపలికి వెళ్లి బయటకు రాలేదు. అప్పుడు తెలిసింది లోపల విలువ చేసేవి ఏవో ఉన్నాయని. జర్మన్ కంపెనీ సెల్టర్స్ బ్రాండ్ పేరుతో ఉన్నాయి. చూడగా 1850-1867 మధ్య కాలంలో ఓడ మునిగిపోయి ఉండొచ్చని తేలింది. ఇక వాటర్ బాటిల్స్ అప్పటి రాచరిక జీవితాన్ని చూపిస్తుంది. ఈ ఓడలో దొరికిన పాత షాంపైన్ తాగవచ్చో లేదో చూడాల్సి ఉందన్నారు. అయినప్పటికీ షాంపైన్ కోసం డైవర్లు ఎంతో ఆశగా ఉన్నారు’ అని వెల్లడించారు.

Show comments