Dharani
Viral Fever Symptoms (Adults, Kids) Causes, in Telugu: వర్షాకాలం వచ్చిందంటే చాలు జ్వరాలు విజృంభిస్తాయి. మరీ ముఖ్యంగా వైరల్ ఫీవర్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వైరల్ ఫీవర్ లక్షణాలు ఎలా ఉంటాయి, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాలు మీ కోసం..
Viral Fever Symptoms (Adults, Kids) Causes, in Telugu: వర్షాకాలం వచ్చిందంటే చాలు జ్వరాలు విజృంభిస్తాయి. మరీ ముఖ్యంగా వైరల్ ఫీవర్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వైరల్ ఫీవర్ లక్షణాలు ఎలా ఉంటాయి, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాలు మీ కోసం..
Dharani
వర్షాకాలం వచ్చిందంటే రోగాలు విజృంభిస్తాయి. మరీ ముఖ్యంగా వైరల్ ఫీవర్లు పెరుగుతాయి. ప్రస్తుతం నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా ఇవే కేసులు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా వైరల్ ఫీవర్లతో రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఒకే రోజు ఆరుగురు మృతి చెందడం సంచలనంగా మారింది. వైరల్ ఫీవర్ బారిన పడితే.. సరైన సమయంలో స్పందించి వెంటనే చికిత్స తీసుకోకపోతే.. ప్రాణాలు పోతాయి అనే దానికి నిదర్శనం పై కేసులు. మరి రాష్ట్రంలో వైరల్ ఫీవర్లు పెరుగుతున్న తరుణంలో.. అసలు ఇది ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఎన్ని రోజులు ఉంటుంది.. చికిత్స విధానం ఏంటి.. మందులు ఏం వాడాలి.. నివారణ చర్యలు వంటి పూర్తి సమాచారం మీ కోసం.
వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల వలన కలిగే జ్వరానికి ఉపయోగించే పదమే వైరల్ ఫీవర్. సాధారరణంగా మానవ శరీర ఉష్ణోగ్రత సుమారు 98.4°ఎఫ్, లేదా 37.1°సీగా ఉంటుంది. ఈ సగటు విలువకు మించిన ఉష్ణోగ్రత ఉంటే దాన్ని జ్వరంగా పరిగణిస్తారు. అయితే వైరల్ ఫీవర్ కొన్ని ఇన్ఫెక్షన్లలో తక్కువ ఉష్ణోగ్రత అంటే 100 డిగ్రీల లోపే ఉండవచ్చు. డెంగ్యూ వంటి కేసుల్లో ఎక్కువగా ఉంటుంది.
వైరల్ ఫీవర్ వ్యాప్తి చెందే విధానం తీవ్రత, శరీరంలోని అవయవాలపై చూపే ప్రభావం మొదలైన వాటి ఆధారంగా వీటిని పలు రకాలుగా వర్గీకరిస్తారు. అలా వైరల్ ఫీవర్లు ఎన్ని రకాలంటే..
వైరల్ ఫీవర్ సాధారణంగా తీవ్రమైనది. సీజన్లు మారిన తరుణంలో ఎక్కువగా వస్తుంటుంది. అయితే వర్షాకాలంలోనే అధిక కేసులు నమోదవుతాయి. చాలా వైరల్ ఇన్ఫెక్షన్లు, వైరల్ ఫీవర్లు 3-5 రోజులు ఉంటాయి. అయితే, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లలో సుమారు 14 రోజుల వరకు జ్వరం వస్తూనే ఉంటుంది.
చిన్న పిల్లలు, వృద్ధులు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులలో వైరల్ ఫీవర్ సర్వసాధారణం.
ఒక్క రోజుకు మించి జ్వరంతో బాధపడుతుంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
వైరల్ ఫీవర్ లక్షణాలు వైరల్ ఇన్‌ఫెక్షన్ రకాన్ని బట్టి.. అలానే వ్యక్తికి వ్యక్తికి మారుతుంటాయి. అయితే వైరల్ ఇన్ఫెక్షన్లలో ఎక్కువ భాగానికి సంబంధించిన సాధారణ వైరల్ ఫీవర్ లక్షణాలు ఇలా ఉంటాయి.
మాములు జ్వరం, వైరల్ ఫీవర్ల మధ్య చాలా చిన్న తేడానే ఉంటుంది. అందుకే వీటిని గుర్తించడం తేలిక కాదు. ఇక వైరల్ ఫీవర్‌ను గుర్తించడానికి రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, కఫ పరీక్షలు, స్వాబ్ పరీక్షలు, నిర్దిష్ట వైరల్ యాంటీజెన్లు, యాంటీబాడీ పరీక్షలు వంటి రోగనిర్ధారణ పరీక్షలను చేయించమంటారు. వైరల్ ఫీవర్‌ను ధ్రువీకరించడం కోసం మీ వైట్ బ్లడ్ కౌంట్ (డబ్ల్యూబీసీ) లను టెస్ట్ చేయించమని చెబుతారు. తీవ్రమైన జ్వరం ఉన్న సందర్భాల్లో సీటీ స్కాన్, చెస్ట్ ఎక్స్ రే కూడా చేయించుకోవాలని చెబుతారు.
చిన్న పిల్లల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయినప్పుడు కచ్చితంగా అలర్ట్ అవ్వాలి. ముఖ్యంగా 102 డిగ్రీలకు మించి జ్వరం చూపిస్తుంటే వైద్యులను సంప్రదించాలి. వైరల్ ఫీవర్ సోకితే పిల్లలకు కూడా ఒళ్లునొప్పులు వస్తాయి. అలాగే చాలా నీరసం పడిపోతారు. బాగా వీక్ అవుతారు. ఆకలి తగ్గిపోవడం, ఆహారం తీసుకోలేకపోవడం జరుగుతుంది. వైరల్ ఫీవర్ వల్ల పిల్లల్లో గొంతునొప్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముక్కు కారడం, దగ్గు కూడా పిల్లల్లో వైరల్ ఫీవర్ ని సూచిస్తాయి. కొన్నిసార్లు వైరల్ ఫీవర్ వల్ల పిల్లల్లో దద్దుర్లు, చర్మ సంబంధిత అలర్జీలు రావచ్చు. కొన్నిసార్లు పిల్లలు వాంతులు చేసుకోవడం కూడా చేస్తుంటారు. జ్వరంతో పాటుగా ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
వైరల్ ఫీవర్ చికిత్స అనేది వైరల్ ఇన్ఫెక్షన్ రకం, లక్షణాల తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, వైద్యులు తక్కువ-గ్రేడ్ వైరల్ జ్వరానికి పారాసిటమాల్, ఇబుప్రోఫెన్ వంటి మందులను సూచిస్తారు. అలానే గోరువెచ్చని నీటితో స్నానం చేయటం, ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని తాగమని చెబుతారు
జ్వరం ఎక్కువగా ఉంటే.. పారాసిటమాల్ హై డోసేజ్ రిఫర్ చేస్తారు. దీన్ని ప్రతి ప్రతి 4-6 గంటలకు తీసుకోవాలని సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో పారాసిటమాల్‌ను ఇంట్రావీనస్‌గా ఇంజెక్ట్ చేయవచ్చు. తీవ్రంగా ఉంటే యాంటీబయోటిక్స్‌ను కూడా వాడమని చెబుతారు.