Keerthi
Rainy Season Health Article: సాధారణంగా ఈ వర్షకాలంలో పని నిమిత్తం బయటకు వెళ్లిన వారు వర్షం కారణంగా.. తడిచిపోయే అవకాశం ఉంటుంది. కానీ, ఇలా వర్షంలో తడిచిన వారు బట్టలు వాటంతట అవే అరిపోతయానో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఇలా ఎక్కువ సమయం వర్షంలో తడవటమే కాకుండా.. తడచిన బట్టలతో ఎక్కువ సేపు ఉంటే ఎంత ప్రమాదమో ఎవరికైనా తెలుసా? అయితే ఈ విషయాలను తెలుసుకోండి.
Rainy Season Health Article: సాధారణంగా ఈ వర్షకాలంలో పని నిమిత్తం బయటకు వెళ్లిన వారు వర్షం కారణంగా.. తడిచిపోయే అవకాశం ఉంటుంది. కానీ, ఇలా వర్షంలో తడిచిన వారు బట్టలు వాటంతట అవే అరిపోతయానో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఇలా ఎక్కువ సమయం వర్షంలో తడవటమే కాకుండా.. తడచిన బట్టలతో ఎక్కువ సేపు ఉంటే ఎంత ప్రమాదమో ఎవరికైనా తెలుసా? అయితే ఈ విషయాలను తెలుసుకోండి.
Keerthi
ప్రస్తుతం వర్షకాలం కావడంతో.. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఎప్పుడు వర్షం పడుతుందో అనేది ఎవరికి తెలియదు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆఫీస్, స్కూల్స్, బయట పనులకు వెళ్లి, వచ్చినవారు.. వర్షానికి తడిచే అవకాశం ఉంటుంది. అలాగే మరి కొందరు కావాలనే ఈ వర్షం తడవాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే.. ఈ వర్షంలో తడిస్తే చాలా మంచిదని కొంతమంది నమ్మకం. ఈ క్రమంలోనే ఎక్కువ సమయం వర్షంలో తడవాలని అనుకుంటారు. కానీ, ఇలా ఎక్కువ సమయం వర్షంలో తడవటమే కాకుండా.. తడచిన బట్టలతో ఎక్కువ సేపు ఉంటే ఎంత ప్రమాదమో ఎవరికైనా తెలుసా? అయితే ఈ విషయాలను తెలుసుకోండి.
సాధారణంగా ఈ వర్షకాలంలో పని నిమిత్తం బయటకు వెళ్లిన వారు వర్షం కారణంగా.. తడిచిపోయే అవకాశం ఉంటుంది. కానీ, ఇలా వర్షంలో తడిచిన వారికి ఆఫీసు నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీసుకి చాలా దూరం ప్రయాణం చేయాలనో, లేకపోతే గాలికి బట్టలు వాటంతట అవే అరిపోతయానో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఇలా నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరం. ఒకసారి వర్షంలో తడిచిన బట్టలతో గంటల తరబడి ఉంటే చాలా ప్రమాదకరమని ఎవరికైనా తెలుసా ఈ విషయం తెలియక చాలామంది తడిచిన బట్టల్లోనే ఎక్కువ సమయం ఉంటారు. కానీ, ఇలా చేయడం వలన వర్ష నీరులో తడిచిన బట్టలతో ఉంటే.. చర్మంపై బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. తద్వార చర్మం అలర్జీ, ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా.. ఈ తడిచిన బట్టలు కారణంగా.. శరీర ఉష్ణోగ్రతల్లో మార్పలు వచ్చి చలి జ్వరం, దగ్గు, జలుబు వంటి వచ్చే ప్రమాదంకు ఛాన్స్ ఉంది. దీంతో పాటు ఇతర రోగాల బారిన పడే అవకాశం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఫంగాల్ ఇన్ఫెక్షన్, అలర్జీ అనేవి ఒకసారి సోకితే వాటి నుంచి బయటపడటానికి ఆసుపత్రిలో వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి చర్మం అంతా వ్యాపించే అవకాశం ఉంటుంది. పైగా ఇది ఒక అంటువ్యాధి కాబట్టి, ఇంట్లో ఒకరి నుంచి వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు వర్షంలో ఎక్కువ సేపు తడవకుండా చూసుకోవడమే మంచింది. ఒకవేళ తడిచిపోయినా, తడి బట్టలతో ఎక్కువ సేపు ఉండకుండా జాగ్రత్తాలు తీసుకోవడం చాలా మంచిది. లేకుండా.. ఈ వివిధ అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంటుంది.