iDreamPost
android-app
ios-app

రెడ్డివారి నానబాలు మొక్కతో సంతానం సమస్యలకు చెక్..!

ఈ మొక్కను ఎప్పుడో కప్పుడు చూసుంటారు. కానీ దీని పేరు ఏంటో తెలియదు కదా. రోడ్డు పక్కన, పొలాల్లో, చెరువు గట్లపై పెరిగే ఈ మొక్క పేరు రెడ్డివారి నానబాలు అని పిలుస్తుంటారు. పిచ్చి మొక్కలా ఉంటే.. దీనితో సంతానం సమస్యలకు చెక్ పెట్టొచ్చని తెలుసా..?

ఈ మొక్కను ఎప్పుడో కప్పుడు చూసుంటారు. కానీ దీని పేరు ఏంటో తెలియదు కదా. రోడ్డు పక్కన, పొలాల్లో, చెరువు గట్లపై పెరిగే ఈ మొక్క పేరు రెడ్డివారి నానబాలు అని పిలుస్తుంటారు. పిచ్చి మొక్కలా ఉంటే.. దీనితో సంతానం సమస్యలకు చెక్ పెట్టొచ్చని తెలుసా..?

రెడ్డివారి నానబాలు మొక్కతో సంతానం సమస్యలకు చెక్..!

పిచ్చి మొక్కలని భావించే ఎన్నో మొక్కలు.. ఆయుర్వేదంలో సిద్ధ మూలికలుగా ఉపయోగపడుతున్నాయి. అందులో ఒకటి రెడ్డివారి నానబాలు/ నానుబాలు. వినడానికి వింతగా ఈ ప్లాంట్‌లో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో రహస్య శక్తులు ఉన్నాయంటే నమ్ముతారా..? నిజమేమరీ. నిత్యం ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటాయి ఈ మొక్కలు. గడ్డి మధ్యలో పెరుగతూ..చిన్న చిన్న పుష్పాలు పూస్తుంటాయి. ఈ మొక్కనే పాలకాడ, నాగార్జుని అని కూడా పిలుస్తుంటారు. ఈ మధ్య టాటూల కల్చర్ విపరీతంగా నడుస్తుంది. ఇప్పుడు వివిధ కెమికల్స్ వినియోగించి టాటూస్ వేస్తుంటారు. కానీ ఒకప్పుడు పచ్చబొట్టును వేసేందుకు ఈ ఆకు రసాన్ని వినియోగించే వారట. అందుకే దీనికి పచ్చబొట్టాకు అని కూడా పేరు.

రెడ్డి వారి నానుబాలు వెనుక ఎన్నో కథలు ఎలా ఉన్నా.. దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం పుష్కలమని చెప్పొచ్చు. ఈ ఆకు రసాన్ని సేవించడం వల్ల.. అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్క‌ను అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించడంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. మొక్క ఆకుల ర‌సాన్ని లేదా ఆకుల క‌షాయాన్ని ప‌రిమిత మోతాదులో తీసుకుంటే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. ఇక ఈ మొక్కను తుంపినప్పుడు వచ్చే పాలను కంటిలో వేసుకోవడం వల్ల కంటిలో ఉండే కురుపు, మలినాలు తొలగిపోతాయి. అలాగే కణతల,సెగడ్డలు మీద కూడా రాసుకున్నా వాపు తగ్గుముఖం పడుతుంది. ఈ ఆకు రసాన్ని తాగితే.. ఉబ్బసం వంటి శ్వాస కోశ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

ఈ మొక్కలో యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్ వంటి సహజ సిద్ధమైన లక్షణాలు ఉండటం వల్ల.. రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. మహిళలకు, పురుషులకు ఈ మొక్క ఓ వరం అని చెప్పాలి. మహిళల్లో పీరియడ్స్ సమయంలో కడుపునొప్పితో సహా ఏర్పడే ఎన్నో సమస్యలను తొలగిపోయి.. గర్భాశయ దోషాలు తొలగిపోయి.. సంతానం కలుగుతుంది. రోజు ఈ ఆకు రసాన్ని, మిరియాల పొడితో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య మెరుగుపడతాయి. రెడ్డి వారి నానబాలు మొక్క ఆకుల‌ను ఏదైనా కూర‌లో వేసి వండుకుని తింటూ ఉండ‌డం వ‌ల్ల ర‌క్త మొల‌లు త‌గ్గుతాయి. ఈ ఆకుల‌ను ప‌ప్పులో వేసుకుని తింటే బాలింత‌ల్లో పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది.

ఇవే కాదు చర్మ సంబంధిత ఇష్యూస్‌ను నివారిస్తుంది ఈ ఆకు. పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు రెడ్డి వారు నానుబాలు మొక్క వేరును నీటితో క‌లిపి మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని పిప్పి ప‌న్నుపై ఉంచ‌డం వ‌ల్ల పోటు తగ్గుతుంది.  ఈ మొక్క ర‌సానికి పంచ‌దార‌ను క‌లిపి తీసుకోవడం వ‌ల్ల నీళ్ల విరేచ‌నాలు త‌గ్గుతాయి. ఈ ఆకు రసాన్ని తీసుకుంటే.. రక్త కణాలు వృద్ధి చెందుతాయి. నిత్యం కషాయంగా తీసుకుంటే.. ఒత్తిడి, ఆందోళన తగ్గి, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. నోటిపూత వంటి వాటికి కూడా మంచి మందుగా పనిచేస్తుంది ఈ రెడ్డి వారి నాను బాలు. చూడటానికి కలుపు మొక్కలా ఉంటే.. ఈ మొక్కలో ఎన్నో రోగాలను, వ్యాధులను తరిమికొట్టే ఔషధ గుణాలున్నాయి. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చింది. దీన్ని ఐడ్రీమ్ నిర్ధారించలేదు.