iDreamPost
android-app
ios-app

Fasting: ఉపవాసం ప్రాణాలు తీస్తుందా? వైద్యులు చెప్పిన సంచలన నిజాలు!

చాలా మతాల ఆచారాల్లోనూ ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అనేక మందిలో ఉపవాసం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి?. దీని ఫలితాలు ఎలా ఉంటాయనే ప్రశ్నలు తలెత్తుతాయి. వీటి గురించి తెలుసుకుందాం.

చాలా మతాల ఆచారాల్లోనూ ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అనేక మందిలో ఉపవాసం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి?. దీని ఫలితాలు ఎలా ఉంటాయనే ప్రశ్నలు తలెత్తుతాయి. వీటి గురించి తెలుసుకుందాం.

Fasting: ఉపవాసం ప్రాణాలు తీస్తుందా? వైద్యులు చెప్పిన సంచలన నిజాలు!

ఉపవాసం అనేది చాలా మందికి తెలిసిందే. ఇది అనేక మతాల ఆచారాల్లో సాధారణంగా కనిపించే అంశం. ఉపవాసం చేయడం అనేది ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యంతో ముడిపడిన అంశంగా పెద్దలు చెబుతుంటారు. అందుకే చాలామంది ఫాస్టింగ్ చేయడానికి ఇష్ట పడుతుంటారు. అయితే ఈ ఉపవాసంపై మరోక వాదన ఉంది. ఉపవాసం కారణంగా ప్రాణాలకు ముప్పు ఉందని కొందరు చెబుతున్నారు. ఈ అంశాలపై మెడికోవర్ డైరెక్టర్ శరత్ చంద్ర పలు ఆసక్తికర విషయాలను తెలిపారు.

చాలా మంది దైవ భక్తితో, ఆరోగ్యం కోసం ఉపవాసాలు చేస్తుంటారు. అయితే ఈ పాస్టింగ్ లో కూడా వివిధ రకాలు ఉంటాయి. ఒక పూట మాత్రమే ఉండటం, రోజూ మొత్తం  ఆహారం తీసుకోకుండా ఉండటం వంటివి చేస్తుంటారు. ఇదే సమయంలో కొందరు అయితే రోజంతా నీటితో సహా ఎటువంటి ఆహారం ముట్టుకోకుండా ఉపవాసం ఉంటారు. మరికొందరు మాత్రం పండ్లు, నీరు, పాలు వంటివి తీసుకుంటూ  ఉపవాసం చేస్తుంటారు. ఇలా వివిధ రకాలుగా పాస్టింగ్ అనేది చేస్తుంటారు. అయితే ఉపవాసం చేయడం రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గడం, ఇన్సులిన్ పని తీరు మెరుగుపడటం వంటివి జరగుతాయని పలువురు చెబుతుంటారు. ఇదే సమయంలోఈ ఉపవాసం చేసే వారిపై అమెరికాలో ఓ సంస్థ రిసెర్చ్ చేసింది. ఆ ప్రాంతంలో ఉపవాసం చేసే వారిపై రిసెర్చ్ చేసి..అనేక ఆసక్తికర విషయాలను  వెల్లడించింది. ఈ రీసెర్చ్ కి సంబంధించిన విషయాలను మెడికోవర్ డైరెక్టర్ శరత్ చంద్ర వెల్లడించారు.

మనం ఉపవాసం ఉండటం కారణంగా బయట నుంచి శక్తి అందకపోవడంతో లోపల ఉన్న కేలరీలను శరీరం వినియోగించుకుంటుంది. అయితే ఇలాంటి సమయంలో పలు రకలా సెల్స్ అనేవి  తమ జీవాన్ని కోల్పోతుంటాయని వైద్యులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రాణాలకు ముప్పు వాటిల్ల వచ్చంట. అయితే ఈ పరిశోధన అంత అమెరికా పౌరులపై జరిగింది. అక్కడి వాతావరణం, అక్కడి ఆహారపు అలవాట్ల ప్రకారం.. ఉపవాసం అనేది ప్రమాదని తెలిపారు. అయితే మన దేశంలో పరిస్థితులు వేరని వైద్యులు అంటున్నారు. అలానే మొత్తంగా ఈ ఉపవాసంపై ఒక నిర్ధారణకు రాలేమని నిపుణులు చెబుతున్నారు. ఇక అమెరికాలో జరిగిన రీసెర్చ్ గురించి, ఉపవాసంపై వైద్యులు శరత్ చంద్ర చెప్పిన  మరిన్ని విషయాల గురించి తెలుసుకునేందుకుకింది వీడియోను వీక్షించండి. అలానే ఈ ఉపవాసంపై వస్తున్న వివిధ రకాల వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.