Winter: చలికాలంలో రోగాలు రాకుండా కచ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవే!

Winter: చలికాలంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని ఆహారాలు తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు.

Winter: చలికాలంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని ఆహారాలు తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు.

చలికాలం వచ్చేసింది. గజ గజ వణికిస్తుంది. ఈ సీజన్ లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఇంకా విపరీతమైన జ్వరం కూడా వస్తుంది. శరీరమంతా కూడా చాలా నీరసంగా మారుతుంది. అందువల్ల రోజంతా చాలా బద్దకంగా ఉంటారు. కాబట్టి చలికాలంలో మనకు కావాల్సిన టెంపరేచర్ లేకుంటే కష్టం. ఈ సీజన్‌లో వచ్చే సమస్యల్ని ఈజీగా తట్టుకోవాలంటే శరీరానికి కావాల్సిన శక్తిని అందించాలి. అయితే ఈ సీజన్ లో కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల బాడీలో యాక్టివ్‍నెస్ పెరుగుతుందని పోషకాహర నిపుణులు చెబుతున్నారు. మనలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి చాలా ఆరోగ్యంగా ఉంచే ఫుడ్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చలికాలంలో తాజా ఆకు కూరలు తినడం చాలా బెస్ట్. ఆకు కూరలు బాడీలో సెరోటిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి మన శరీరానికి కావాల్సిన ఫోలెట్, విటమిన్ బీని పెంచగలవు. ఈ పోషకాలు పాలకూర, గోంగూర లాంటి ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల వల్ల శరీరం బద్ధకంగా అనిపించదు. రోజంతా చాలా యాక్టివ్ గా ఉండవచ్చు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ ఆకు కూరలు తినడం వలన ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.చలికాలంలో జలుబు, దగ్గు వస్తాయని చాలా మంది కూడా సిట్రస్ పండ్లని ఎక్కువగా తినరు. కానీ నారింజ, నిమ్మ లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ సిస్టమ్ బాగా పని చేసేందుకు ఉపయోగపడుతుంది. పైగా ఈ సిట్రస్ పండ్లలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల చలికాలంలో సీజనల్ ఇన్ఫెక్షన్లు రావు. వీటిని తినడం వలన మనకు డైజేషన్ బాగా అవుతుంది.

బీట్‍రూట్, క్యారెట్లు, బంగాళదుంపల్లో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. రోజంతా మనల్ని ఆక్టివ్ గా ఉంచుతాయి.వీటిని తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. ఒత్తిడి కూడా ఈజీగా తగ్గుతుంది.పైగా ఇవి మనకు కావాల్సిన పోషకాలను శరీరానికి బాగా అందిస్తాయి. ఇక నాన్ వేజ్ తినాలనుకునేవారు మాత్రం చికెన్, మటన్ కాకుండా సీ ఫుడ్ తినండి. సాల్మన్, మాకెరెల్, సార్డినెస్ లాంటి ఫ్యాటీ చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మన మెదడు పనితీరును చురుగ్గా మారుస్తాయి. మంచి మూడ్ ని అందిస్తాయి. అలాగే ఆందోళన, డిప్రెసివ్ డిజార్డర్ లక్షణాలు ఉంటే ఈజీగా తగ్గిస్తాయి. ఈ చేపలను వారంలో మూడుసార్లు తీసుకుంటే ఇమ్యూనిట్ పవర్ డబుల్ అవుతుంది. చలికాలంలో వేడి వేడి టీ, కాఫీలకు బదులు వేడిగా ఒక గ్లాస్ పాలను తగండి. చలికాలంలో కచ్చితంగా ఈ ఆహారాలు తినండి. ఆరోగ్యంగా ఉండండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments