Stomach Health: పొట్టలో గ్యాస్ ప్రాబ్లెమా? ఇలా చేయండి క్షణాల్లో రిలీఫ్!

Stomach Health: ఈరోజుల్లో చాలా మంది కూడా గ్యాస్ సమస్యతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే చాలా ఈజీగా ఈ సమస్యని తగ్గించుకోవచ్చు.

Stomach Health: ఈరోజుల్లో చాలా మంది కూడా గ్యాస్ సమస్యతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే చాలా ఈజీగా ఈ సమస్యని తగ్గించుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కూడా ఎక్కువగా ఫేస్ చేసే సమస్యల్లో పొట్ట సమస్యలు ఎక్కువ. కేవలం కడుపు ఆరోగ్యంగా ఉంటే చాలు అన్ని రకాల సమస్యలు ఈజీగా తగ్గిపోతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా మందికి బెల్లి ఫ్యాట్ ఎంతో దారుణమైన సమస్యగా వేధిస్తుంది. దీని కారణంగా నలుగురిలో తిరగాలన్న ఏదో లాగా ఉంటుంది. బెల్లి ఫ్యాట్ మన అందాన్ని పోగొడుతుంది. మన బాడీ షేప్ ని మార్చేస్తుంది. దీని వల్ల అనేక కడుపు సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గ్యాస్ సమస్య అందరినీ ఎంతగానో వేధిస్తుంది. అసలు ఈ రకంగా కడుపు సమస్యలు రావడానికి కారణం ముమ్మాటికే మనం తినే చెడు ఆహారమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ కొన్ని వ్యాయామాలు చేస్తే గ్యాస్ సమస్యే కాదు.. పొట్టకి సంబంధించిన అన్నీ సమస్యలు తగ్గడమే కాకుండా మన జీవితంలో ఎన్నడూ లేని హుషారుగా ఉంటాము. ఇక మనకి ఇంత అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే హెల్తీ ఫుడ్ ఏంటో అలాగే మనం రోజూ ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటామో పూర్తిగా తెలుసుకుందాం.

పొద్దున్నే లేవగానే 10 ఒక ముప్పావు లీటరు నీళ్ళు తాగండి. ఒక గంట లేదా అరగంట దాకా సూర్య నమస్కారాలు చేయండి. బ్రేక్ ఫాస్ట్ కింద ఒక రెండు గ్లాస్ ల జ్యూస్ తాగండి. కచ్చితంగా రెండు సార్లు మోషన్ కి వెళ్ళండి. పొద్దున్నే లేచాక ఒకసారి మళ్ళీ 10 లోపు ఎప్పుడైనా కూడా ఒకసారి మోషన్ కి వెళ్ళండి. అయితే ఈ పనులన్నీ కూడా పొద్దున్నే 10 లోపు పూర్తి చేయండి. 11:30 నుంచి 12 లోపు లంచ్ చేయండి. లంచ్ కింద ఒక ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోండి. ఆ ఫుడ్ ఏంటంటే.. మొలకలు తీసుకొని అందులో దానిమ్మ గింజలు, ఖర్జూరాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వాటిని స్పూన్ తో మిక్స్ చేసుకోండి. అలా ఈ ఫుడ్ ని డెయిలీ లంచ్ గా తినండి. ఈ ఫుడ్ తిన్నాక ఏదోక పండు తినండి. అప్పుడు మీరెంత హుషారుగా ఉంటారో మాటల్లో చెప్పలేం. ఈ విధంగా లంచ్ చేస్తే జీవితంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా మీరు ఉంటారు.

ఆ తరువాత సాయంత్రం 4 గంటల దాకా నీళ్ళు ఎక్కువగా తాగండి. ఇక 4 దాటాక ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లేదా కొబ్బరి నీళ్ళు, లేదా చెరుకు రసం తాగండి. ఇక సాయంత్రం 5:30 నుంచి 6 లోపు డిన్నర్ చేయండి. డిన్నర్ కింద మీరు నానబెట్టిన జీడిపప్పులు ఒక 20,నానబెట్టిన బాదం 20, నానబెట్టిన పిస్తా ఒక 20 పప్పులు తినండి. వీటితో పాటు ఖర్జూరాలు కూడా తినండి. ఆ తరువాత ఏదైనా పండు తినండి. ఈ విధంగా మీరు రోజూ తిన్నారంటే గ్యాస్, కొలెస్ట్రాల్, అజీర్తి, అసిడిటీ, నోటి దుర్వాసన.. ఇలా ఏ సమస్యలు ఉన్నా ఈజీగా పోతాయి. మీ పొట్ట కూడా ఫ్లాట్ గా ఉంటుంది. ఇలా తింటే మీకు చాలా త్వరగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ముఖ్యంగా గ్యాస్ సమస్య ఈజీగా పోతుంది. కాబట్టి కచ్చితంగా ఈ డైట్ ఫాలో అవ్వండి. ఆరోగ్యంగా ఉండండి. ఇక ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments