Vinay Kola
Sleep: ఈరోజుల్లో చాలా మంది కూడా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దానికి చాలా కారణాలే ఉన్నాయి.
Sleep: ఈరోజుల్లో చాలా మంది కూడా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దానికి చాలా కారణాలే ఉన్నాయి.
Vinay Kola
ప్రస్తుతం అందరినీ ఎంతగానో వేధిస్తున్న సమస్య నిద్రలేమి. మన ఆరోగ్యానికి మంచి నిద్ర అనేది చాలా అవసరం. ప్రతి రోజు కూడా 8 గంటలు నిద్ర లేకపోతే కచ్చితంగా అనేక అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. అయితే నిద్ర లేమికి రక రకాల కారణాలు ఉంటాయి. కొంతమందికి మాత్రం వారు మంచి లైఫ్ స్టైల్ మైన్టైన్ చేస్తున్నా కానీ నిద్ర పట్టదు. రాత్రుళ్లు సరైన సమయానికి తిని సరైన సమయానికి పడుకున్నా కూడా నిద్ర పట్టదు. అయితే నిద్ర పట్టకపోవడానికి ప్రధాన కారణాల్లో విటమిన్స్ లోపం కూడా అతి ముఖ్యమైన కారణం అని ఆరోగ్య నిపుణుల పరిశోధనలో తేలింది. అందుకే చాలా మందికి నిద్రలేమి సమస్య ఎక్కువ అవుతుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటో పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నిద్ర పట్టకపోవడానికి ప్రధాన కారణం విటమిన్ బీ12 లోపం. మన బాడీకి విటమిన్ బీ12 సరిగ్గా అందితేనే మనకు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఆ విటమిన్ బీ12 కోసం చాలా మంది కూడా మెడికల్ షాప్స్ లో లభించే టాబ్లెట్స్ ని డాక్టర్ ల సలహా లేకుండా వాడుతూ ఉంటారు. కానీ అలా వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇలాంటి కెమికల్స్ తో కూడిన టాబ్లెట్స్ వాడటం వలన సరిగ్గా నిద్ర పట్టడం ఏమో కానీ.. ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కచ్చితంగా ఉంది. అయితే మనకి విటమిన్ బీ12 పుష్కలంగా ఉండే కొన్ని హెల్తీ ఫుడ్స్ ఉన్నాయి. అవి తింటే మనకు న్యాచురల్ గా విటమిన్ బీ12 లభిస్తుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. అలాగే ఫ్యూచర్ లో మళ్ళీ ఈ సమస్య వచ్చే అవకాశం కూడా ఉండదు.
మీరు శాఖాహారులు అయితే కొన్ని రకాల పుట్టగొడుగులలో విటమిన్ B12 సమృద్ధిగా ఉంటుంది. షిటేక్(shiitake) అనే పుట్టగొడుగులలో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. రోజుకు ఒక 50 గ్రాముల ఎండిన షిటేక్ పుట్టగొడుగులను తీసుకుంటే శరీరానికి విటమిన్ బి12 అందుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే యాపిల్, బంగాళదుంప, ఆరెంజ్, బ్లూబెర్రీస్, బీట్ రూట్, శనగలు, జీడిపప్పు, బాదంపప్పు, అల్లం, ఉల్లిపాయలలో కూడా విటమిన్ బీ12 ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ వీటిని తినడం మంచిది. అలాగే పాలు తాగినా కూడా ఈ విటమిన్ అందుతుంది. ఇక మీరు మాంసాహారులు అయితే చేపలు, రొయ్యలు, కోడి గుడ్లు తీసుకోండి. వీటిలో కూడా విటమిన్ బీ12 పుష్కలంగా ఉంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు ఈ ఫుడ్స్ తీసుకున్నట్లైతే న్యాచురల్ గా నిద్ర పడుతుంది. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.