iDreamPost
android-app
ios-app

రేపు ఆదివారం కదా నాన్ వెజ్ తింటారా? వీరి కథ తెలిస్తే చికెన్ షాపు వైపు వెళ్ళరు!

Karnataka News: నాన్ వెజ్ అంటే చాలా మందికి ఇష్టం. సండే వచ్చింది అంటే చాలా ఇళ్లలో మసాల గుమగుమలు వస్తుంటాయి. అయితే చికెన్, మటన్ వంటి ఇతర నాన్ వెజ్ లు తెచ్చుకునే వారు జాగ్రత్త. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు రిస్క్ లో పెట్టినట్లే. అందుకు ఉదాహరణే తాజాగా జరిగిన ఓ సంఘటన.

Karnataka News: నాన్ వెజ్ అంటే చాలా మందికి ఇష్టం. సండే వచ్చింది అంటే చాలా ఇళ్లలో మసాల గుమగుమలు వస్తుంటాయి. అయితే చికెన్, మటన్ వంటి ఇతర నాన్ వెజ్ లు తెచ్చుకునే వారు జాగ్రత్త. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు రిస్క్ లో పెట్టినట్లే. అందుకు ఉదాహరణే తాజాగా జరిగిన ఓ సంఘటన.

రేపు ఆదివారం కదా నాన్ వెజ్ తింటారా? వీరి కథ తెలిస్తే చికెన్ షాపు వైపు వెళ్ళరు!

నేటికాలంలో మాంసాహారం తినే వారి సంఖ్య బాగా పెరిగింది. చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ ఐటెమ్స్ ను ఎక్కువగా తీసుకుంటారు. కొందరికి అయితే మాంసలేనిదే ముద్ద కూడా దిగదు. ఇక ఆదివారం అయితే చాలు ఇళ్లలో నాన్ వెజ్ గుమగుమలు వస్తుంటాయి. ఇక రేపు కూడా వీకెండ్ కావడంతో చాలా మంది చికెన్, మటన్ తెచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. అలా ఎవరైనా నాన్ వెజ్ తినాలనుకునే తప్పకుండా ఈ స్టోరీ తెలుసుకోండి. ఆ తరువాతనే మీ నిర్ణయం తీసుకోండి. మాసాహారం తినే ఓ కుటుంబంలో ఏకంగా నలుగురు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి జిల్లా కల్లూరు గ్రామంలో భీమన్న(60) అనే వ్యక్తి తన కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని షోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం షాపుకు వెళ్లి మాసం తీసుకొచ్చాడు. అనంతరం ఇంట్లో వండుకొని అందరూ భోజనం చేశారు. తర్వాత ఎవరికివారు వ్యవసాయ పనులకు వెళ్లారు. భీమణ్ణ కుమార్తె పార్వతి (17) పొలంలో పనిచేస్తుండగా వాంతులయ్యాయి. ఇదే విషయాన్ని ఆమె సోదరుడు మల్లేశ్‌(19)కి తెలిపింది. అదే సమయంలో తనకూ వాంతులు అవుతున్నట్లు మల్లేశ్‌ తెలిపాడు. వెంటనే ఇద్దరూ ఇంటికి బయలుదేరి రాగా.. అక్కడ తల్లి ఈరమ్మ (50), తండ్రి భీమణ్ణ సైతం వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. స్థానికులు గమనించి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ప్రాథమిక చికిత్సలు చేసిన వైద్యులు పరిస్థితి విషమించడంతో వారిని రాయచూరులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.  ఈ క్రమంలోనే చికిత్స పొందుతు గురువారం రాత్రి నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న భీమన్న మరో కుమార్తె మల్లమ్మ (18) ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.  వారు వండుకొని తిన్న నాన్ వెజ్ ఆహారమే విషమైందా.. లేదా కావాలనే విషం కలిపిన ఆహారాన్ని తిన్నారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ వీరి మరణంలో ఏమైనా కుట్ర కోణం ఉంటే..పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. అయితే భీమన్న తెచ్చిన మాంసమే నాణ్యత లేకపోవడంతో అది పాయిజన్ గా మారి..వారి మరణానికి కారణం అయిండొచ్చని వాదనలు వినిపిస్తోన్నాయి.

మనం ఇప్పటికే నాణ్యతలేని, కుళ్లిపోయినా మాంసాన్ని విక్రయించిన ఘటనలు అనేకం  చూశాము. ముఖ్యంగా కోళ్ల పెంపకంలో శుభ్రతను పాటించకపోవడం, అవి రోగాల బారిన పడటం, అలాంటి వాటిని తెచ్చి కొన్ని నాన్ వెజ్ షాపులు విక్రయిచండం చేస్తున్నాయి.  ఈ క్రమంలోనే భీమన్న కుటుంబంలో విషాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అభిప్రాయా పడుతున్నారు. మొత్తంగా ఎవరైనా చికెన్, మటన్ తెచ్చుకునే ముందు.. చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యణ నిపుణలు సూచిస్తున్నారు. నాణ్యతలోని మాంసాహారం తిన్నడం వల్ల కూడా ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటాయని వారు చెబుతున్నారు. రేపు సండే కాబట్టి నాన్ వెజ్ ప్రియుల పై విషయాలను గుర్తుంచుకోవాలి.