Dr Shivkumar Sarin- Paracetamol- Liver Damage: పారాసెట్మాల్ అతిగా వాడేస్తున్నారా? మీరు డేంజర్ లో ఉన్నట్టే: డాక్టర్ సరిన్

Paracetamol: పారాసెట్మాల్ అతిగా వాడేస్తున్నారా? మీరు డేంజర్ లో ఉన్నట్టే: డాక్టర్ సరిన్

Dr Shivkumar Sarin- Paracetamol- Liver Damage: చిన్న ఒళ్లునొప్పులు, స్వలంగా జ్వరం రాగానే ఎవరైనా వెంటనే పారాసెట్మాల్ ట్యాబ్లెట్లు వేసేసుకుంటారు. అయితే అలా అతిగా పారాసెట్మాల్ వాడేస్తే మీరు ప్రమాదంలో పడినట్లే అంటూ ప్రముఖ వైద్యుడు శివకుమార్ సరిన్ హెచ్చరిస్తున్నారు.

Dr Shivkumar Sarin- Paracetamol- Liver Damage: చిన్న ఒళ్లునొప్పులు, స్వలంగా జ్వరం రాగానే ఎవరైనా వెంటనే పారాసెట్మాల్ ట్యాబ్లెట్లు వేసేసుకుంటారు. అయితే అలా అతిగా పారాసెట్మాల్ వాడేస్తే మీరు ప్రమాదంలో పడినట్లే అంటూ ప్రముఖ వైద్యుడు శివకుమార్ సరిన్ హెచ్చరిస్తున్నారు.

వర్షాకాలం అనగానే కచ్చితంగా సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. వాటిలో మరీ ముఖ్యంగా జ్వరం, ఒళ్లునొప్పులు అయితే కొందరికీ తరచూ వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మొదటే వైద్యులను సంప్రదించరు. వాళ్లే మెడికల్ షాపునకు వెళ్లి ఒక పారాసెట్మాల్ షీట్ తెచ్చుకుంటారు. ఇంక ఒక మూడు, నాలుగు రోజులు.. రోజుకు మూడు పూటలు మూడు ట్యాబ్లెట్లు వేసేసుకుంటారు. అప్పటికీ జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గకపోతేనే వైద్యులను సంప్రదిస్తారు. అయితే ఇలా మీకు ఇష్టమొచ్చినట్లు పారాసెట్మాల్ ట్యాబ్లెట్లు వాడకూడదు. అలా వాడటం వల్ల మీ లివర్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ మాటలు మేము చెప్పడం లేదు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శివకుమార్ సరిన్ వెల్లడించారు.

పారాసెట్మాల్ అనేది కేవలం జ్వరానికి వేసుకునే ట్యాబ్లెట్ మాత్రమే కాదు. ఈ ట్యాబ్లెట్ కి జర్వం మాత్రమే కాదు.. ఒళ్లు నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అందుకే ప్రతి చిన్న నొప్పికి ఈ పారాసెట్మాల్ ని వాడేస్తూ ఉంటారు. అయితే అవసరానికి మించిన వాడకం మాత్రం ప్రమాదం అంటూ ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శివకుమార్ సరిన్ హెచ్చరిస్తున్నారు. ఆయన తాజాగా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పారాసెట్మాల్ వాడకానికి సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇండియాలో వీటి వాడకం బాగా అధికంగా ఉందని చెప్పారు. అలాగే అతిగా పారాసెట్మాల్ వాడితే లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

పారాసెట్మాల్ వాడకం వల్ల మీ లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే గ్లూటథియోన్ అనే సబ్ స్టాన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది మీ ఇమ్యూన్ సిస్టమ్ పనితీరు, శరీరానికి కావాల్సిన ప్రొటీన్, కెమికల్స్ తయారు చేయడంలో కీలకంగా పనిచేస్తుందట. ఇది మద్యం సేవించే వాళ్లు.. ఒబేసిటీ ఉన్న వారిలో తక్కువగా ఉంటుంది. అలాగే అధికంగా పారాసెట్మాల్ వాడే వారిలో కూడా తగ్గిపోతుందంట. దానివల్ల లివర్ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయని డాక్టర్ సరిన్ స్పష్టం చేశారు. లివర్ డ్యామేజ్, లివర్ ఫెయిల్యూర్ జరిగే ఆస్కారం ఉంటుందట. మీరు ఒక రోజులో రెండు, మూడు సార్లు పారాసెట్మాల్ వాడాలి అంటే అర ట్యాబ్లెట్ చొప్పున వాడుకోవాలని సూచిస్తున్నారు.

రోజులో ఒక పారాసెట్మాల్ ట్యాబ్లెటికి మించి వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. లేని పక్షంలో అమెరికా, ఇంగ్లాండ్ తరహాలో ఇండియాలో కూడా లివర్ ఫెయిల్యూర్ కి పారాసెట్మాలే ప్రధానం కారణం అవుతుందని డాక్టర్ శివకుమార్ సరిన్ హెచ్చరించారు. ఒకవేళ మీరు పారాసెట్మాల్ ట్యాబ్లెట్ ని అధిక మోతాదులో వాడుతున్న పక్షంలో ఆ విషయాన్ని మీ వైద్యునికి వెంటనే తెలియజేయాలని కోరారు. మీరు కూడా పారాసెట్మాల్ ని అధికాంగా వాడేస్తున్నారా? అయితే ఇకనైనా జాగ్రత్త పడండి. ఈ సమాచారాన్ని మీ ప్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వారిని కూడా అలర్ట్ చేయండి.

Show comments