Keerthi
ప్రపంచవ్యాప్తంగా అన్నం వండేముందు బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు కడిగిన తర్వాతే మళ్లీ నీళ్లు పోసి స్టవ్ మీద పెడుతూ ఉంటాము. అయితే అన్నం వండేటప్పుడు బియ్యాన్ని ఎందుకు కడగాలో.. అలా కడగాకపోతే ఏలాంటి ప్రమాదం ఎదురవుతుందో తెలిస్తే షాక్ అయిపోతారు.
ప్రపంచవ్యాప్తంగా అన్నం వండేముందు బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు కడిగిన తర్వాతే మళ్లీ నీళ్లు పోసి స్టవ్ మీద పెడుతూ ఉంటాము. అయితే అన్నం వండేటప్పుడు బియ్యాన్ని ఎందుకు కడగాలో.. అలా కడగాకపోతే ఏలాంటి ప్రమాదం ఎదురవుతుందో తెలిస్తే షాక్ అయిపోతారు.
Keerthi
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా అన్నం వండాలి అనుకునేటప్పుడు మొదట బియ్యన్ని కడిగి వండుతారనే విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే రైస్ తో చేసిన ఏ వంటకాలైనా అనగా.. బిర్యానీ, పులిహోర, పరమాన్నం వంటి ఏవైనా మొదట ఆ రైస్ ని శుభ్రంగా నీళ్లతో కడగడం అనేది కామన్. ఎందుకంటే బియ్యం కడగకుండా వండితే.. వాటిలో ధాన్యం కడుపుకుపోతుంది. అందుకని ఆ రైస్ ను ఒకటికి రెండు సార్లు కడిగిన తర్వాతే మళ్లీ నీళ్లు పోసి స్టవ్ మీద పెడుతూ ఉంటాము. అయితే అన్నం వండే ముందు అసలు బియ్యాన్ని ఎందుకు కడగాలి. అలా కడిగి వండి తింటే మంచిదా.. లేకపోతే ఏమైనా హాని జరుగుతుందా అని ఇప్పటికి చాలామందిలో ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. అయితే బియ్యన్ని వండి తినకేపోతే చాలా ప్రమాదకరమంటా. మరి అలా అన్నం వండే ముందు కడగకుండా తింటే వచ్చే ప్రమాదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నం వండేముందు అందరూ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు కడిగిన తర్వాతే మళ్లీ నీళ్లు పోసి స్టవ్ మీద పెడుతూ ఉంటారు. అయితే అలా అన్నం వండేటప్పుడు బియ్యాన్ని ఎందుకు కడగాలో..? బియ్యం కడగకుండా అన్నం వండుకుంటే ఏమవుతుంది.. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం. ప్రతిఒక్కరూ అన్నం వండే ముందు బియ్యాన్ని తప్పకుండా కడగాలి. ఎందుకంటే.. ఇందులో ఆర్సెనిక్ అనే హానికరమైన మూలకం ఉండవచ్చు. ఇది మట్టి, నీటి ద్వారా బియ్యంలోకి వస్తుంది. కనుక వీటిని శుభ్రంగా కడిగితే 90% వరకు ఆర్సెనిక్ తొలగిపోతుంది.అయితే ఎక్కువగా.. ముంపునకు గురైన పొలాల్లో పండిన బియ్యంలో ఎక్కువ ఆర్సెనిక్ ఉంటుంది. కనుక బియ్యం కడిగితే, గింజలపై ఉండే దుమ్ము, రాళ్లు, ఇతర కాలుష్యం తొలిగిపోతుంది. దీంతో అన్నం శుభ్రంగా, రుచిగా ఆరోగ్యకరంగా ఉంటుంది. లేకుంటే.. అన్నం జిగురుగా మారి, రుచి చెడిపోతుంది. అలాగే ఫుడ్ ప్యాకేజింగ్ నుంచి వచ్చే మైక్రోప్లాస్టిక్స్ కూడా బయటికి వెళ్లిపోతాయి. దీంతో పాటు ఆర్సెనిక్‌తో పాటు ఎక్కువగా పిండి పదార్థం కూడా తొలగిపోయి.. అన్నం మెత్తగా, రుచిగా ఉంటుంది. ఇక రైస్ ని చక్కగా కడిగితే.. దానిపై ఉండే ఫైటిక్ యాసిడ్ కూడా తొలగిపోతుంది. ఫైటిక్ యాసిడ్ శరీరం ఐరన్, జింక్ వంటి పోషకాలను గ్రహించకుండా అడ్డుకుంటుంది. దీనిని తొలగిస్తే ఈ పోషకాలను శరీరంలోకి సులభంగా గ్రహించగలగుతాయి.
ఆర్సెనిక్ చాలా డేంజర్
ఆర్సెనిక్ అనేది చాలా విషపూరితమైన మూలకం. కనుక ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అలాగే ముఖం పై మొటిమలు, గాయాలు, చర్మ సమస్యలు కూడా రావచ్చు. ఇక కడుపులో నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, గుండె లయ దెబ్బతినడం, కండరాల తిమ్మిరి, జలదరింపు, చర్మం నల్లబడటం, నిరంతర గొంతునొప్పి, జీర్ణ సమస్యలు వంటివి కూడా ఈ ఆర్సెనిక్ ద్వారా రావచ్చు.
ఎలా వ్యాపిస్తుంది?
ఇక ఆర్సెనిక్ సహజంగా నీరు, నేల, రాళ్లలో కనిపిస్తుంది. ముఖ్యంగా.. పురుగుల మందులు, కలుపు సంహారకాలు, కలప సంరక్షణకారులు, పారిశ్రామిక వ్యర్థాలు, మైనింగ్ కార్యకలాపాల వంటివి కూడా ఆర్సెనిక్ కాలుష్యానికి దోహదం చేస్తాయి. పైగా ఇతర పంటలతో పోలిస్తే వరి ఆర్సెనిక్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. ముంపునకు గురైన పొలాల్లో పండిన బియ్యంలో ఆర్సెనిక్ స్థాయిలు మరింత ఎక్కువగా ఉంటాయి.
ఆర్సెనిక్ ప్రభావాన్ని దూరం చేసే టిప్స్
అలాగే బియ్యాన్ని వండే ముందు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కనీసం రెండు నుంచి మూడు సార్లు అయిన కడగడం మంచిది. అలాగే నీరు పారదర్శకంగా వచ్చే వరకు కడగాలి. అప్పుడే ఆర్సెనిక్ స్థాయిలు తగ్గుతాయి. అన్నం ఉడికించే సమయంలో తక్కువ సోడియం కలిగిన ఎముక రసం యాడ్ చేస్తే ఎక్స్‌ట్రా ప్రోటీన్, పోషకాలు లభిస్తాయి. హోల్‌గ్రెయిన్ బ్రౌన్ రైస్ ఎంచుకుంటే ఇంకా మంచిది. బ్రౌన్ రైస్‌లో ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి వైట్ రైస్ కంటే ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
మరి బియ్యన్ని కడుగి వండుకొని తినకపోతే ఏర్పడిన ప్రమాదాల పై మీ అభిప్రాాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.