Covishield: కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌! గుండెపోటు రాకుండా ఉండాలంటే ఇవి పాటించండి!

Astrazeneca, Covishield, Vaccine: కోవిషీల్డ్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయని ఆ టీకా తయారీ కంపెనీ తెలపడంతో.. చాలా మంది భయపడుతున్నారు. అయితే.. గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఉన్నాయి. అవి పాటించండి.

Astrazeneca, Covishield, Vaccine: కోవిషీల్డ్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయని ఆ టీకా తయారీ కంపెనీ తెలపడంతో.. చాలా మంది భయపడుతున్నారు. అయితే.. గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఉన్నాయి. అవి పాటించండి.

కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని స్వయంగా ఆ టీకా తయారు చేసిన సంస్థ ఆస్ట్రాజెనెకా కోర్టు ముందు అంగీకరించడంతో.. ఒక్కసారిగా జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. గతంలో కూడా కరోనా టీకాలు వేయించుకున్న వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పలు అధ్యాయనలు వెల్లడించడం, వయసుతో సంబంధం లేకుండా యువత కూడా ఈ గుండెపోటుతో మరణించడంతో కరోనా టీకాలు వేయించుకున్న వారు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఏకంగా కోవిషీల్డ్‌ తయారు చేసిన కంపెనీనే కోర్టు ముందు నిజం ఒప్పుకోవడంతో మరింత మందిలో గుండెపోటు భయం మొదలైంది. అయితే.. భయపడితే లాభం లేదు కాబట్టి.. గుండె ఆరోగ్యం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండె ఆరోగ్యం ఉండి, దాని పనితీరు మెరుగుపడాలంటే.. ముఖ్యంగా మనం తినే ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఎప్పుడు తింటున్నాం? ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్‌. ఈ విషయాలను పట్టించుకోకుండా.. ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత, ఏది పడితే అది తినడాన్ని.. బింజ్‌ ఈటింగ్‌ అంటారు. బింజ్ ఈటింగ్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదమ పెరగడమే కాకుండా ఊబకాయం, స్ట్రోక్ వంటి సమస్యల ముప్పు అధికంగా ఉంటుంది. వీటితో పాటు ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు, బీపీ, షుగర్‌ వంటి వాటితో బాధపడుతూనే ఉన్నారు. వీటన్నింటికి చెక్‌ పెట్టాలంటే మంచి ఆహారం మితంగా టైమ్‌కి తినాలి.

జంక్ ఫుడ్ తగ్గించి విటమిన్స్, న్యూట్రియెంట్స్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే మీ గుండె భద్రంగా ఉంటుంది. మాంసాహారంలో లీన్ మీట్‌ని ఎంచుకోవడం మంచిది. బటర్ కంటే పెరుగు, జామ్ కంటే ఫ్రూట్ స్లైసెస్‌కీ ఇంపార్టెన్స్ ఇస్తే ట్రాన్స్ ఫ్యాట్ సమస్యను తప్పించుకోవచ్చు. లీన్ మీట్, చికెన్, ఫిష్, పప్పులు, ఫ్యాట్ తక్కువ ఉన్న పాలు, పాల పదార్థాలు, గుడ్లు ఎక్కువ తినాలి. వీటిలో ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. పప్పులు, బీన్స్, బఠానీలు వంటి వాటిని మీట్ బదులు తీసుకోవచ్చు. వీటిలో ఫ్యాట్ తక్కువ, కొలెస్ట్రాల్ అసలు ఉండదు. స్కిన్ లెస్ చికెన్ బ్రెస్ట్ వల్ల బాడీ ప్రోటీన్‌ని తేలిగ్గా గ్రహిస్తుంది. హోల్ గ్రెయిన్స్‌లో ఫైబర్, న్యూట్రియెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. కూరగాయలు, పండ్లలో ఉండే గుణాలు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ రాకుండా చేస్తాయి. ఆహారంతో పాటు కాస్త శారీకర శ్రమ కూడా ఎంతో ముఖ్యంగా వాకింగ్‌, జాగింగ్‌ చేస్తూ ఉండాలి. అలా అని అతిగా జిమ్‌ చేసినా ప్రమాదమే. మరి మీ గుండెను జాగ్రత్తగా ఉంచుకునేందుకు పైన చెప్పిన జాగ్రత్తలు పాటించండి.

Show comments