iDreamPost
android-app
ios-app

కోహ్లీ సెంచరీల వెనుక ఆల్కలైన్ వాటర్.. దీని లాభాలేంటో తెలుసా?

తమ అభిమాన నాయకులు, సెలబ్రిటీల జీవిత విశేషాలను తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. క్రికెట్‌లో సచిన్ తరువాత అంతటి ఘన కీర్తిని పొందిన విరాట్ కోహ్లీ సక్సెస్ కి ఆల్కలైన్ వాటర్ కారణం. దీని వల్లన ఎన్ని లాభాల్లో తెలిస్తే మీరు షాకవుతారు

తమ అభిమాన నాయకులు, సెలబ్రిటీల జీవిత విశేషాలను తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. క్రికెట్‌లో సచిన్ తరువాత అంతటి ఘన కీర్తిని పొందిన విరాట్ కోహ్లీ సక్సెస్ కి ఆల్కలైన్ వాటర్ కారణం. దీని వల్లన ఎన్ని లాభాల్లో తెలిస్తే మీరు షాకవుతారు

కోహ్లీ సెంచరీల వెనుక ఆల్కలైన్ వాటర్.. దీని లాభాలేంటో తెలుసా?

నేటికాలంలో సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. తమ అభిమాన హీరోలు, ఆటగాళ్లకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఫలానా హీరో అందంగా ఉండానికి కారణం, ఫలానా ఆటగాడు ఎంతో హుషారుగా ఉంటాడు…వీళ్ల సక్సెస్ కి కారణం ఏంటనే తెలుసుకునేంది ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాక వీళ్ల కూడా ఫాలో అయ్యేందుకు ప్రయత్నస్తుంటారు. తాజాగా కింగ్ కోహ్లి విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు మ్యాచ్ సమయంలో ఎంతో యాక్టీవ్ గా ఉంటాడు. ఇటీవలే వరుసపెట్టి సెంచరీల మోత మోగిస్తున్నాడు. అయితే కోహ్లి సక్సెస్ కు అనేక కారణాలు ఉంటే.. వాటిల్లో ఆల్కవైన్ వాటర్ ఒక కారణమని తెలుస్తోంది. మరి.. ఈ ఆల్కలైన్ వాటర్ తాగితే కలిగి లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత క్రికెట్ లో సచిన్ తెందుల్కర్ కి ఉన్న  పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనను అందరూ గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుచుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సచిన్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఎందరో యువ క్రికెటర్లు రికార్డులు సృష్టిస్తున్నారు.  ఇక సచిన్ తరువాత అంతటి ఘనకీర్తిని పొందిన వ్యక్తి విరాట్ కోహ్లి. అందరూ ముందుగా కింగ్ అని కోహ్లిని పిలుచుకుంటారు.

అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది.  విరాట్ కి సంబంధించిన విషయాలను తెలుసుకునేందు ఆయన ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తుంటారు.  కోహ్లి ఎలాంటి డైట్ తీసుకుంటారు,డ్రింక్స్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు..తదితర విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఉంటారు. కోహ్లి ఆల్కలైన్ వాటర్ మాత్రమే తాగుతాడు. ఈ వాటర్ లో ఎన్నో రకాల మినర్స్ ఉంటాయి. ఆల్కలైన్ వాటర్ నే బ్లాక్ వాటర్ అని కూడా పిలుస్తారు. ఈ వాటర్ లో ఎన్నో లాభాలు ఉన్నాయి.

ఆల్కలైన్ నీటిని ఆల్కలైన్‌ అయోనైజ్డ్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా సహజ నీటిలో పీహెచ్6.5-8.5 మధ్య ఉంటుంది. అయితే ఆల్కలైన్ వాటర్‌లో ఇంతకంటే ఎక్కువ పీహెచ్ వాల్యూ ఉంటుంది. ఈ వాటర్ శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీంతో జీవక్రియ రేటు పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిని తగ్గిస్తుంది. ఆల్కవైన్ ప్యాంక్రియాటిక్ బీటా కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.

ఆల్కలైన్‌ నీరు తాగడం వల్ల మూత్రపిండాలు మెలమైన్ విసర్జనను వేగవంతం చేస్తాయి. ఫలితంగా మూత్రంలో రాళ్లు ఏర్పడకుండా ఇవి తోడ్పతాయి. ఆల్కలైన్ వాటర్ తో స్నానం చేస్తే చర్మ సంబంధిత  సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.  అలానే  ఎసిడిటీ సమస్యను కూడా ఈ వాటర్ తొలగిస్తాయి. అయితే ఈ కథనం వివిధ మార్గాల్లో సేకరించడం జరిగింది. ఏది ఏమైన వీటిని అమలు చేసే ముందు వైద్యులను సంప్రదించడం మంచింది.