iDreamPost
android-app
ios-app

మీరు ఎలాంటి వారో మీ బొటన వేలే చెప్పేస్తుంది!

మీ బొటన వేలు గనుక నిటారుగా ఉన్నట్లయితే.. మీరు ఈ సైకాలజీని కలిగి ఉంటారు. అవేంటంటే.. మీరు మొండి పట్టుదల కలవారు. ఎవ్వరి మాటా వినరు.

మీ బొటన వేలు గనుక నిటారుగా ఉన్నట్లయితే.. మీరు ఈ సైకాలజీని కలిగి ఉంటారు. అవేంటంటే.. మీరు మొండి పట్టుదల కలవారు. ఎవ్వరి మాటా వినరు.

మీరు ఎలాంటి వారో మీ బొటన వేలే చెప్పేస్తుంది!

ఓ మనిషిని చూడగానే ఆ మనిషి ఎలాంటి వాడో చెప్పటం చాలా కష్టం. ఒకరకంగా అసాధ్యం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇక్కడ ‘‘ డోంట్‌ జడ్జ్‌ ఏ బుక్‌ బై ఇట్స్‌ కవర్‌’’ అన్న సామెత కచ్చితంగా వర్తిస్తుంది. చూడ్డానికి మంచిగా కనిపించే వాళ్లు చెడ్డవాళ్లు కావచ్చు. చెడ్డగా కనిపించే వారు మంచి వాళ్లు కావచ్చు. సాధారణంగా ఓ మనిషి సైకాలజీ అన్నది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. కానీ, కొన్ని సార్లు శరీర అవయవాలను బట్టి వారి ఎలాంటి వారో చెప్పేయ వచ్చట. ఇప్పుడు మనం మన చేతి బొటన వేళ్ల తీరును బట్టి వారి సైకాలజీని చెప్పవచ్చు.

మీ బొటన వేలు గనుక నిటారుగా ఉన్నట్లయితే.. మీరు ఈ సైకాలజీని కలిగి ఉంటారు. అవేంటంటే.. మీరు మొండి పట్టుదల కలవారు. ఎవ్వరి మాటా వినరు. మీరు ప్రతీ విషయాన్ని లాజికల్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మీకు నాయకత్వ లక్షణాలు నిండుగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అధికారం చెలాయించే విధంగా ఉంటారు. మీ చుట్టు పక్కల ఉన్న వారు ఎలాంటి వారో మీకు ఓ అంచనా ఉండి ఉంటుంది.

మీరు ఇబ్బందుల్లో ఉన్నపుడు దాన్ని ఎవరైనా దాన్ని అడ్వాంటేజ్‌ తీసుకోవాలని చూస్తే అస్సలు సహించరు. అన్ని విషయాల్లో చాలా అలెర్ట్‌గా ఉంటారు. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ముందే గుర్తిస్తారు. మీరు జాలి, దయ కలిగిన వారు. మీరు దృఢమైన విల్‌ పవర్‌ ఉంటుంది. చాలా పద్దతిగా ఉంటారు. మీరు ఎవరి మీదైనా కోపం తెచ్చుకుంటే వారిని అస్సలు క్షమించరు.

మీ బొటన వేలు గనుక వంకరగా ఉన్నట్లయితే.. మీరు ఈ సైకాలజీని కలిగి ఉంటారు. అవేంటంటే.. మీరు చాలా ఎమోషనల్‌ మనుషులు. మీ భావాలను చక్కగా ఎదుటి వ్యక్తికి వ్యక్త పర్చగలరు. కొత్త వాతావరణాలకు, పరిస్థితులకు అలవాటుపడ్డం మీకు వెన్నతో పెట్టిన విద్య. ఇతరుల పరిస్థితుల్ని అర్థం చేసుకోగల మనుషులు. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు తర్వాత మిమ్మల్ని ఇబ్బందికర పరిస్థితుల్లోపడేస్తూ ఉంటాయి.

మీరు భావోద్వేగాలకు, బంధాలకు మీకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీకు మీరు విలువ ఇచ్చుకునే పరిస్థితులు భవిష్యత్తులో కలుగుతాయి. మీకు కొత్త కొత్త ఆలోచనలు చేయగలరు. మీ ఆశయాలను సాధించటానికి కొత్త కొత్త దార్లు అన్వేషించగలరు. మీరు సృజనాత్మకత కలవారు. కళా హృదయం కలవారు. కొన్ని విషయాల్లో ఓపెన్‌ మైండెడ్‌గా ఉంటారు. ఊహా శక్తి చాలా ఎక్కువ. కళారంగాల్లో మీరు ఉచ్చ స్థాయికి వెళతారు. మరి, చేతి బొటన వేళ్ల సైకాలజీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.