iDreamPost
android-app
ios-app

SHOCKING : అరుదైన వ్యాధితో బాధ పడుతున్న “సమంత”.. GET WELL SOON SAM !

SHOCKING : అరుదైన వ్యాధితో బాధ పడుతున్న “సమంత”.. GET WELL SOON SAM !

హీరోయిన్ సమంత ఒక అరుదైన వ్యాధి తో బాధపడుతుంది.. మీరు చదువుతున్నది అక్షరాలా నిజం!

ఈరోజు సోషల్ మీడియాలో సమంత పోస్ట్‌ సంచలనం సృష్టిస్తోంది. యశోదా ట్రైలర్‌కు వస్తున్న స్పందన అనూహ్యంగా ఉందని ట్వీట్‌ చేసిన సమంత అందులో ఒక కొత్త విషయాన్ని వెల్లడించారు సమంత. తన అనారోగ్యం గురించి నటి సమంత ట్వీట్ చేసింది. “మయోసైటిస్” అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని.. త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. చేతికి సెలైన్‌‌ ఎక్కుతుండగా.. యశోద సినిమాకు డబ్బింగ్ చెబుతూ ఆమె ఈ పోస్ట్ చేసింది. దీంతో సెలబ్రిటీలు అందరూ స్పందిస్తున్నారు. సమంతా త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు ఉస్తాద్ రామ్ పోతినేని, యంగ్ టైగర్ ఎన్టీఆర్, తదితరులు ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఇక హీరోయిన్స్ కాజల్, శ్రీయ, అనుష్క,రుహాని శర్శ, మాళవిక నాయర్, రాశీ కన్నాలతో పాటు మంచు లక్ష్మీ, సుస్మిత కొణిదెల సోషల్ మీడియా వేదికగా సమంతకు ధైర్యం చెప్పారు. స్ట్రాంగ్‌గా ఉండాలని సూచించారు. కాగా తన వ్యాధి గురించి పెట్టిన పోస్ట్‌ను ఉద్వేగ భరింతంగా రాసుకొచ్చారు సమంత. జీవితం తనకు అనేక సవాళ్లు విసురుతోందని, అదే సమయంలో ప్రేక్షకులు చూపే ప్రేమ వాటిని అధిగమించే శక్తిని ఇస్తోందని పోస్ట్‌ చేశారు. కొన్ని నెలల క్రితం తనకు ప్రాణాంతకమైన మయోసిటిస్‌ అనే వ్యాధి ఉందనే విషయం తెలిసిందని వెల్లడించారు. ప్రస్తుతం అది తగ్గుముఖం పట్టిందని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే తాను పూర్తిగా కోలుకోగలనని డాక్టర్లు చెప్పారని సమంత పోస్ట్ చేశారు. కాని కోలుకునేందుకు ఊహించిన దానికన్నా ఎక్కువ సమయం పడుతోందని అన్నారు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకునేందుకు తాను కష్టపడుతున్నానని ఆమె అన్నారు, భౌతికంగానూ, మానసికంగానూ తనకు గుడ్ డేస్, బ్యాడ్ డేస్ ఉన్నాయని ఆవేదనను తన పోస్టులో సమంత షేర్‌ చేశారు. రికవరీకి తాను కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నానని సమంత అన్నారు.

సమంతకు వచ్చిన మయోసైటిస్‌ వ్యాధి అత్యంత అరుదైనదని చెప్పాలి. ఈ వ్యాధి రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి బారిన పడిన వారికి ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. నిల్చునేందుకు కూడా వారికి శక్తి ఉండదు. కండరాలన్నీ బలహీనంగా మారతాయి, నొప్పులు విపరీతంగా ఉంటాయి. సమంత ఈ వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet