iDreamPost
android-app
ios-app

రష్మిక ఆవేదనకు కారణం ఎవరు ..?

రష్మిక ఆవేదనకు కారణం ఎవరు ..?

పుష్ప హీరోయిన్ గా కంటే శ్రీవల్లిగా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న ఇవాళ సోషల్ మీడియా వేదికగా తన మీద జరిగిన జరుగుతున్న ట్రోలింగ్, నెగటివ్ క్యాంపైన్ గురించి సుదీర్ఘమైన నోట్ ఒకటి విడుదల చేసింది. అందులో ఇండస్ట్రీ రావడం మొదలు ఎన్ని కష్టాలు పడింది, ఈ స్థాయికి రావడానికి ఎన్ని అవరోధాలను దాటిందో నేరుగా ఆయా సంఘటలను ప్రస్తావించకపోయినా ఇన్ డైరెక్ట్ గా ఎవరిని ఉద్దేశించి అంటోందో అర్థమయ్యేలాగే ఉంది. కన్నడలో మొదటి బ్లాక్ బస్టర్ కిరాక్ పార్థి సాధించాక ఇక్కడ గీత గోవిందం, ఛలో సూపర్ హిట్లు కావడం, రక్షిత్ శెట్టితో చేసుకున్న ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ కావడం లాంటి పరిణామాలు చాలా జరిగాయి.

Rashmika Mandanna: పుష్ప‌2 ఎలా ఉండ‌నుందో తెలుసా.? ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసిన ర‌ష్మిక‌.. | TV9 Telugu

నిర్ణయాలు తీసుకునే విషయంలో అందరికీ స్వేచ్ఛ ఉన్నప్పటికీ కేవలం తెలుగు సినిమాల అవకాశాల కోసమే రష్మిక పెళ్లి డ్రాప్ అయ్యిందన్న ప్రతికూల వ్యాఖ్యలు కన్నడ ఫ్యాన్స్ చాలా బలంగా చేశారు. అయినా తట్టుకుని కొనసాగుతూ వచ్చింది. పుష్ప ప్యాన్ ఇండియా సక్సెస్ అయ్యాక కూడా ఇవి ఆగలేదు. అమితాబ్ బచ్చన్ తో హిందీలో ఆయన కూతురిగా చేసిన గుడ్ బై చేదు ఫలితాన్ని అందుకుంది. దీన్ని సైతం ట్రోలింగ్ కి వాడుకున్న వాళ్ళు ఉన్నారు.బాలీవుడ్ లోనే కాదు తమిళంలోనూ విజయ్ సరసన వారసుడులో అవకాశం దక్కించుకోవడం కంటగింపుగా మారి మరింతగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఎదిగే క్రమంలో ఇవన్నీ మామూలే.

Rashmika Mandanna : నెట్టింట హాట్ టాపిక్ గా మారిన రష్మిక డ్రెస్.. ట్రోల్స్ తో ఆడుకుంటున్న నెటిజన్లు.. | TV9 Telugu

ఇప్పుడు రష్మిక వెలిబుచ్చిన ఆవేదన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇది అందరు హీరోయిన్లు ఎదురుకుంటున్నదే అయినా టాప్ ఫామ్ లో కథానాయిక ఇలా ఓపెన్ అవ్వడం అరుదు. ఇండస్ట్రీతో సహా సాధారణ ప్రేక్షకులు సైతం ఈ విషయంలో రష్మికకు మద్దతు పలుకుతున్నారు. పుష్ప 2 ది రూల్ రెగ్యులర్ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్న రష్మికకు జనవరి రిలీజ్ కాబోయే వరిసు రిజల్ట్ చాలా కీలకం. హిందీలో చేసిన మిషన్ మజ్ను వచ్చే ఏడాది రిలీజ్ కానుండగా టైగర్ శ్రోఫ్ తోనూ ఓ సినిమా ఓకే అయ్యే అవకాశాలున్నాయి. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో రన్బీర్ కపూర్ తో చేస్తున్న యానిమల్ అన్నిటికంటే కీలకం.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet