నేపాల్ లో 6.3 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీలో భారీ ప్రకంపనలు..

  • Published - 12:35 PM, Wed - 9 November 22
నేపాల్ లో 6.3 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీలో భారీ ప్రకంపనలు..

నేపాల్‌లో భూకంపం సంభవించడంతో ఢిల్లీలో భారీ ప్రకంపనలు వచ్చాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.57 గంటల సమయంలో భూమి కంపించింది.

రిక్టర్‌ స్కేల్‌పై 6.3 తీవ్రతగా నమోదైంది. దీంతో దిల్లీ సరిహద్దుల్లోని నోయిడా, గుడ్‌గావ్‌ ప్రాంతాల్లో పది సెకండ్ల పాటు ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి రోడ్లపైకి చేరుకున్నారు. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం ప్రకటించింది. నేపాల్‌లో గత 5 గంటల్లోనే రెండోసారి భూమి కంపించింది.

అంతకుముందు మంగళవారం రాత్రి 8.52 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూమి కంపించింది. భూప్రకంపనలు చోటుచేసుకున్న అర్ధగంటలోపే ఈ అంశం ట్విటర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దాదాపు 20వేల ట్వీట్లు చేశారు. భూకంప తీవ్రతకు నేపాల్‌లోని దోతి జిల్లాలో ఆరుగురు చనిపోయారు.

Show comments