నేడే చంద్రగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? దాని ప్రభావమెంత..?

  • Published - 12:55 PM, Tue - 8 November 22
నేడే చంద్రగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? దాని ప్రభావమెంత..?

ఈ చంద్రగ్రహణం భారతదేశంతో సహా దక్షిణ/తూర్పు యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రంలో కనిపిస్తుంది.

చంద్రగ్రహణం సమయం:
చంద్రగ్రహణం 2022 తేదీ: 08 నవంబర్ (మంగళవారం)
చంద్రగ్రహణం ప్రారంభ సమయం: మధ్యాహ్నం 2:38 గంటలకు
చంద్రగ్రహణం ముగిసే సమయం: సాయంత్రం 06.18 గంటలకు
సూతక కాలం ప్రారంభ సమయం: ఉదయం 09:21(ఈ లోగా పూజలు.. భోజనాలు పూర్తి చేసుకోవాలి)
సూతక కాలం ముగిసే సమయం: సాయంత్రం 06.18
గ్రహణమొక్ష కాలం తరువాత మహాప్రోక్షణ (శుద్ధి) చేసి ఆలయాలు తెరవవచ్చునని పండితులు తెలిపారు.

నవంబర్ 8, 2022న చంద్రగ్రహణం, ఈ గ్రహణం రాహుగ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం, ఇందులో భాగంగా మిథునం, కర్కాటకం, వృశ్చికం, కుంభరాశి వారికి శుభ ఫలితం. అదే సమయంలో, మేషం, వృషభం, కన్య, మకర రాశులకు అశుభ ఫలితం. మిగిలిన నాలుగు రాశుల వారు గ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు పొందుతారు.

Show comments