iDreamPost
android-app
ios-app

లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ రిపోర్ట్

లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ రిపోర్ట్

నిన్న బాక్సాఫీస్ వద్ద జరిగిన చిన్న సినిమాల జాతరలో అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో ఒకటే డీసెంట్ టాక్ తో ఓపెనింగ్స్ తెచ్చుకుంది. రివ్యూలు గట్రా పాజిటివ్ గా ఉన్నప్పటికీ బన్నీ తమ్ముడిని మొదటి రోజే చూసేంత ఆసక్తి ప్రేక్షకుల్లో లేకపోవడంతో ఫస్ట్ డే గ్రాస్ కేవలం ఒక కోటి లోపలే ఉందని ట్రేడ్ టాక్. దీనికే ఇలా ఉంటే మిగిలినవాటి గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే తొమ్మిది చిత్రాల్లో ఒకటో రెండో జనాల దృష్టిని తమవైపు తిప్పుకునేలా చేసినవి లేకపోలేదు. అందులో ఒకటి లైక్ షేర్ సబ్ స్క్రైబ్. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం, మాస్ట్రో ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ మూవీ ట్విట్టర్ టాక్, ఈ సినిమా సంతోష్ శోభన్ కెరియర్  కు బూస్ట్ ఇస్తుందా..?

విప్లవ్(సంతోష్ శోభన్) ట్రావెల్ వీడియోలు తీసుకుని యూట్యూబ్ ద్వారా ఆదాయం ప్లస్ పాపులారిటీని టార్గెట్ గా పెట్టున్న బ్లాగర్. వసుధ(ఫరియా అబ్దుల్లా)ఆల్రెడీ పేరు తెచ్చుకుని ఉంటుంది. అనుకోకుండా ఇద్దరూ ఒకరినొకరు కలుసుకుని ప్రయాణం మొదలుపెడతారు. అరకు అడవిలో ఈ జంట నక్సల్స్ బ్యాచ్ కి దొరికిపోతుంది. తమను ప్రభుత్వం మోసం చేసిందన్న ఉద్దేశంతో డిజిపిని హత్య చేసే ప్లాన్ లో ఉంటారు. ఇలా అనుకోకుండా కిడ్నాప్ కు గురైన విప్లవ్ వసుధలు అక్కడి నుంచి బయట పడే ప్రయత్నంలో ఎన్నెన్నో సంఘటనలు జరుగుతాయి. ఈ చిక్కుముడులు ఎలా వీడాయి, చివరికి కథ ఎలా సుఖంతమయ్యిందనేదే బాలన్స్ స్టోరీ.

లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్' బిజినెస్, థియేటర్స్...క్లీన్ హిట్ టార్గెట్  ఇదే!! : T2BLive

బోలెడు ఫన్ కు అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మేర్లపాక గాంధీ బ్యాడ్ రైటింగ్ తో లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ ని బోరింగ్ ఎఫైర్ గా మార్చేశాడు. అక్కడక్కడా నవ్వించినా మిగిలిందనంతా భరించేంత ఓపిక లేకుండా చేశాడు. కామెడీని సీరియస్ థీమ్ కి మిక్స్ చేయడమనేది పెద్ద రిస్క్. కిష్కిందాకాండ, సింధూరంలను కలిపి ఏదో కొత్త జానర్ సృష్టించాలనుకునే ప్రయత్నం బెడిసి కొట్టింది. సంతోష్ శోభన్ తో పాటు ఆర్టిస్టులందరూ తమ వంతుగా బాగానే చేసినప్పటికీ అసలైన కంటెంటే తేడా కొట్టడంతో సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి సహనం పూర్తిగా నశించిపోయేలా అయిపోయింది. గాంధీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ నుంచి ఆశించే అవుట్ ఫుట్ ఇది కాదు.

jojobet girişJojobet GirişEnbet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom Girişmeritbetjojobetvirüsbetmarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş