ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఓ ఫ్యామిలీ ఫ్యామిలీ తమ బ్యాగుల్లో ఈ కరెన్సీ పట్టుకెళ్తూ కస్టమ్స్ అధికారులకు దొరికేసింది.ముంబయి నుంచి దుబాయ్ వెళ్తున్న ముగ్గురు భారతీయుల నుంచి 4,97,000 డాలర్ల (సుమారు 4.1 కోట్ల రూపాయలు) నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పక్కా సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ దుబాయ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అడ్డగించింది. అనుమానంతో వారి బ్యాగ్‌లను పరిశీలించగా భారీ మొత్తంలో నగదు దొరికింది. వారు బ్యాగ్‌లో, చెప్పులు, చీరల్లో ఈ నగదును దాచినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 4,97,000 డాలర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి స్థానిక కోర్టు తరలించారు. న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.