జాను పొరపాటు లవ్ టుడేకి చేయలేదు..

  • Published - 10:56 AM, Tue - 8 November 22
జాను పొరపాటు లవ్ టుడేకి చేయలేదు..

మాములుగా ఒక భాషలో సెన్సేషనల్ హిట్ అయిన సినిమాను రీమేక్ చేసేందుకు మన నిర్మాతలు పోటీ పడటం సహజం. ఇక్కడా అదే ఫలితం దక్కుతుందన్న గ్యారెంటీతో పెద్ద మొత్తానికే హక్కులు కొంటూ ఉంటారు. కొన్ని ఒరిజినల్ ని మించి ఆడతాయి కొన్ని అంచనాలను అందుకోలేక తుస్సుమంటాయి. ఎంచుకునే టైంలోనే ఇది ఏ వెర్షన్ లో బెటరో ఆలోచించుకుంటే మంచి ఫలితాలు అందుకోవచ్చు. తమిళ నాట్టమై కంటే పెదరాయుడు బాగుంటుంది. మలయాళం హిట్లర్ కన్నా ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ చిరంజీవి మూవీలో చూడొచ్చు. దబాంగ్ ని హరీష్ శంకర్ మార్చి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో చూపించిన తీరు ఇప్పటికీ ఒక వండర్.

ఇక విషయానికి వస్తే ఆ మధ్య అగ్ర నిర్మాత దిల్ రాజు గారు 96ని కొన్నారు. విజయ్ సేతుపతి త్రిషల కాంబోలో రూపొందిన ఈ రీ యూనియన్ కాలేజీ స్టోరీకి అక్కడ అద్భుత విజయం దక్కింది. దీన్ని అగ్ర హీరోలతో తీయాలని నాని, అల్లు అర్జున్ తదితరులకు స్పెషల్ షోలు వేసి చూపించి ఫైనల్ గా శర్వానంద్ తో తెరకెక్కించారు. దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్లనే తీసుకొచ్చారు. సమంతా హీరోయిన్ గా వచ్చేసింది. జాను పేరుతో తెలుగులో రూపొందిన ఈ మూవీ ఎంత పెద్ద డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంత సాగతీతని మనవాళ్ళు భరించలేకపోయారు. ఒకవేళ డబ్బింగ్ చేసి ఉంటే ఇంకాస్త బెటర్ రిజల్ట్ దక్కేదేమో కానీ ఫైనల్ గా పోయింది.

అందుకే ఈసారి అలాంటి పొరపాటు చేయకుండా దిల్ రాజు జాగ్రత్త పడుతున్నారు. ఇటీవలే విడుదలైన కోలీవుడ్ మూవీ లవ్ టుడే అక్కడ బ్రహ్మాండంగా ఆడుతోంది. మొదటి వారంలోనే బడ్జెట్ తో సంబంధం లేకుండా రికార్డు వసూళ్లు దక్కాయి. మరీ ఆలస్యం చేస్తే ఓటిటిలో సబ్ టైటిల్స్ తో చూసేస్తారని గుర్తించిన దిల్ రాజు దీన్ని అనువదించి ఈ నెల 18న తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఇది మంచి నిర్ణయం. మంచి ఎంటర్ టైన్మెంట్ తో రూపొందిన లవ్ టుడే ఆరిస్టులను మన వాళ్ళతో రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. జయం రవితో కోమలి తీసిన ప్రదీప్ రంగనాథన్ దీనికి దర్శకుడు. వచ్చే వారం పెద్దగా పోటీ లేదు కాబట్టి ఛాన్స్ కొట్టినట్టే.

Show comments