iDreamPost
android-app
ios-app

కుర్రాడు కష్టపడుతున్నాడు కానీ..

కుర్రాడు కష్టపడుతున్నాడు కానీ..

ఇండస్ట్రీలో నెగ్గుకురావాలంటే టాలెంట్ ఒకటే సరిపోదు సక్సెస్ అంతకు మించి అదృష్టం కలిసి రావాలి. వీటి మోతాదులో ఏ మాత్రం అటుఇటు అయినా కెరీర్ ఇంకోలా మారిపోతుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి యాక్టర్ కావాలనే లక్ష్యంతో చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వచ్చిన సత్యదేవ్ కు అన్నీ అనుకూలంగానే కనిపిస్తున్నాయి కానీ వాటి వల్ల వస్తున్న ఫలితాలు మాత్రం అభిమానులు ఆశించిన స్థాయిలో లేవు. ఇటీవలే గాడ్ ఫాదర్ లో తన పెర్ఫార్మన్స్ ని పొగడని వాళ్ళు లేరు. అంతటి మెగాస్టార్ చిరంజీవి ఆ స్థాయిలో ప్రశంసల వర్షం గుప్పించారంటే అంతకంటే ఏ నటుడికైనా కావాల్సింది ఏముంటుంది. అయినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాలేదు.

మొదటి నాలుగు రోజుల హడావిడి ఆ తర్వాత అధాటున పడిపోయింది. కలెక్షన్లు విపరీతంగా తగ్గిపోయి నెల తిరక్కుండానే చాలా చోట్ల ఫైనల్ రన్ కు వచ్చేసింది. దెబ్బకు యూనిట్ అందరూ సైలెంట్. వసూళ్ల గురించి నిర్మాత ఎన్ని చెప్పుకున్నా ఫస్ట్ డే వచ్చిన టాక్ కి నెక్స్ట్ వసూలైన మొత్తానికి పొంతన లేకుండా పోయిన మాట వాస్తవం. సినిమా పరిస్థితి ఇలా ఉంటే ఇక సత్యదేవ్ గురించి ఎవరాలోచిస్తారు. తాజాగా అక్షయ్ కుమార్ రామ్ సేతులోనూ ఓ కీలక పాత్ర పోషించాడు. మార్నింగ్ షో నుంచే నెగటివ్ రివ్యూలు, నిరాశ పరిచే టాక్ డేంజర్ బెల్ మ్రోగిస్తోంది. బాలీవుడ్ లో పెద్ద గుర్తింపు తెస్తుందని ఆశపడిన రామ్ సేతుకి ఇలాంటి రెస్పాన్స్ ఒకరకంగా పెద్ద షాకే.

ఇక్కడితో అయిపోలేదు. తమన్నాతో కలిసి సత్యదేవ్ నటించిన గుర్తుందా శీతాకాలం విడుదల తేదీ కోసం నెలల తరబడి పోరాడుతూనే ఉంది. కన్నడ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకి ఆశించిన బిజినెస్ జరగడం లేదని ట్రేడ్ టాక్. కొరటాల శివ సమర్పణలో రూపొందిన కృష్ణమ్మ సైతం ఆశించిన స్థాయిలో బజ్ రాబట్టుకోలేకపోతోంది. సత్యదేవ్ సోలో హీరోగా చేసిన గత చిత్రం గాడ్సే దారుణంగా డిజాస్టర్ కావడం మార్కెట్ మీద ప్రభావం చూపించింది. మూడు సినిమాలు వరసగా ఓటిటిలో రావడం కూడా కొంత దెబ్బె. మొత్తానికి విపరీతంగా కష్టపడుతున్నా దానికి తగ్గ ఫలితం అందుకోలేకపోతున్న సత్యదేవ్ కి బ్రేక్ ఎప్పుడు వచ్చెనో..

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet