చెత్త బండి లాగుతూ చదువు… IAS అవ్వాలని చిట్టితల్లి ప్రయత్నం!

’చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా‘ అని ఓ కవి విద్యకు ఉన్న విలువ గురించి చెప్పారు. ఎవ్వరూ దోచయలేనిది, దొంగిలించలేదని చదువు మాత్రమే. చదువుకుంటే.. మన లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు.

’చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా‘ అని ఓ కవి విద్యకు ఉన్న విలువ గురించి చెప్పారు. ఎవ్వరూ దోచయలేనిది, దొంగిలించలేదని చదువు మాత్రమే. చదువుకుంటే.. మన లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు.

చదువుకోవాలన్న తపన ఉండాలే కానీ.. అవరోధాలు అడ్డుకావు. కరెంటే లేని రోజుల్లోనే.. వీధి దీపాల కింద, చిమ్మిల వెలుతురులో విద్యా బుద్దులు నేర్చుకుని.. ఉన్నత స్థాయిలో ఎదిగిన వారున్నారు. కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ బడులకు కాలినడక వెళ్లి చదువుకున్నవారున్నారు. కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రుల పిల్లలు డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. గొప్ప గొప్ప స్థానాల్లో నిలబడ్డారు. ఒకపూట తిని తినక.. పస్తులున్న పిల్లలు ఉన్నత చదువులు చదివి.. నలుగురికి కడుపునిండా అన్నంపెట్టే స్థాయిలో ఉన్నారు. చదువుకోవాలన్న ఆలోచన.. ఎంత కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొగలదు. భవిష్యత్తులో సాధించాల్సిన లక్ష్యాల వైపు అడుగులు వేయించగలదు.

కలలు సాకారాన్ని పక్కన పెడితే.. ముందు కలలు కనాలి. ఆ కలలను నెరవేర్చుకునే దిశగా పరుగులు తీయాలి. ఆ కోవకే వస్తోంది ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి. పుట్టింటి పేదరికంలో అయినా.. డ్రీమ్స్ చాలా పెద్దగానే కంటోంది. తల్లికి సాయం చేస్తూనే డిగ్రీ చదువుతూ ఉంది. విమానం దగ్గరగా చూస్తేనే మైమరిచిపోయే కుటుంబంలో ఉన్న ఆమె.. ఏకంగా అమెరికా వెళ్లి అధ్యయనం చేసింది. ఈ యువతి పేరు జయలక్ష్మి. మూసారాంబాగ్ సమీపంలోని సలీంగనగర్‌లో ఉంటుంది. జయలక్ష్మి అమ్మ మున్సిపాలిటీలో వర్క్ చేస్తుంది. ప్రతి ఇంటి నుండి చెత్త సేకరిస్తూ ఉంటుంది. జయలక్ష్మి కూడా అమ్మ చేస్తున్న పనిలో సాయం చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తల్లి వెంట వెళుతూ.. చెత్త బండిని నడుపుతుంది.

చిన్నప్పుడు తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు బాటలు వేసుకుంది. ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్న ఉద్దేశంతో నాలుగు కిలోమీటర్ల నడిచి వెళ్లేదట బడికి. ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారి గాంధీ కింగ్ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్ స్కాలర్షిప్ దరఖాస్తులు కోరగా.. ఎన్నో అప్లికేషన్లు వచ్చాయి. వీరిలో 10 మంది మాత్రమే తెలుగు రాష్ట్రాల నుండి ముగ్గురు ఎంపికయ్యారు. వారిలో జయలక్ష్మి ఒకరు. ఇందులో భాగంగా జూన్‌లో అమెరికా వెళ్లి వచ్చింది. అంతేకాకుండా మురికి వాడల్లోని పిల్లలకు పాఠాలు చెబుతుంది. ప్రజా సమస్యల గురించి గళమెత్తుతుంది. హైదరాబాద్ లో 56 మురికి వాడలు ఉంటే అందులో 21 ప్రాంతాల్లో అంగన్ వాడీ కేంద్రాలు లేవు. ఆమె మహిళా సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడేది. ఇంతకు ఆమె లక్ష్యం ఏంటంటే సమాజానికి మరింత సేవ చేయాలన్న ఉద్దేశంతో ఐఏఎస్ సాధించాలనుకుంటోంది.

Show comments