ఎక్కువ మందికి సేమ్ మార్కులు వస్తే.. JEE అడ్వాన్స్డ్ ర్యాంకుని ఎలా లెక్కిస్తారు?

JEE Advanced 2024 Rank: చాలా మంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. చాలా మందికి ఒకే లాంటి మార్కులు వచ్చినా కూడా మంచి ర్యాంకు మాత్రం కొంతమందికే వస్తుంది. దీంతో తాము చేసిన తప్పేంటో అనేది చాలా మందికి తెలియదు. ఈ కథనంలో జేఈఈ ఎగ్జామ్స్ లో చాలా మంది చేసే తప్పు ఏంటో తెలుస్తుంది. ఫ్యూచర్ లో ఈ తప్పులు చేయకుండా ఉంటే మీరు కూడా మంచి ర్యాంకుని సాధించవచ్చు.

JEE Advanced 2024 Rank: చాలా మంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. చాలా మందికి ఒకే లాంటి మార్కులు వచ్చినా కూడా మంచి ర్యాంకు మాత్రం కొంతమందికే వస్తుంది. దీంతో తాము చేసిన తప్పేంటో అనేది చాలా మందికి తెలియదు. ఈ కథనంలో జేఈఈ ఎగ్జామ్స్ లో చాలా మంది చేసే తప్పు ఏంటో తెలుస్తుంది. ఫ్యూచర్ లో ఈ తప్పులు చేయకుండా ఉంటే మీరు కూడా మంచి ర్యాంకుని సాధించవచ్చు.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహా దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో సీటు పొందాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటారు. దీని కోసం అత్యంత కఠినమైన జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. ఏటా కొన్ని లక్షల మంది ఈ ఎగ్జామ్ రాస్తున్నా గానీ కేవలం చాలా తక్కువ మంది మాత్రమే మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. ఈ ఏడాది 2024 మే 26న జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ జరిగింది. జేఈఈ మెయిన్స్ 2024 ఎగ్జామ్స్ లో అర్హత సాధించిన 2,50,284 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాశారు. ఇక ఎగ్జామ్ కి సంబంధించి ఫలితాలు జూన్ 9న వెలువడనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల్లో ఒకటే ఆసక్తి నెలకొంది. అయితే చాలా మందికి మార్కులు వస్తాయి. అటువంటి సందర్భంలో ర్యాంకులను ఎలా నిర్ణయిస్తారో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

జేఈఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల ర్యాంకుని అన్ని సబ్జెక్ట్స్ లో వాళ్ళు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా లెక్కిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించాలంటే.. ఖచ్చితంగా బోర్డు నిర్ణయించిన కనీస మార్కులతో ప్రతీ సబ్జెక్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి ఒకేలా మార్కులు వస్తే ఎగ్జామ్ బోర్డు టై-బ్రేకింగ్ విధానాన్ని అమలు చేస్తుంది. దీని ప్రకారమే ర్యాంకులను నిర్ణయిస్తుంది. ఒకేలాంటి మార్కులు వచ్చిన విద్యార్థులకు ర్యాంకుని ఎలా నిర్ణయిస్తారో వివరిస్తూ ఐఐటీ మద్రాస్ యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో సేమ్ మార్క్స్ వచ్చిన విద్యార్థులకు ర్యాంకింగ్ ను ఎలా నిర్ణయిస్తారో వివరించే టై-బ్రేకింగ్ పాలసీ గురించి వెల్లడించింది. ఇందుకోసం రెండు స్టెప్పులను ఫాలో అవుతామని వివరించింది.      

మొదటి స్టెప్:

సేమ్ మార్కులు వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువ పాజిటివ్ మార్క్స్ ఎవరికి వస్తే వారికి ర్యాంక్ అనేది ఇస్తారు. మార్కులు, ఎక్కువ పాజిటివ్ మార్క్స్ విషయంలో కూడా సమానంగా ఉంటే కనుక రెండో స్టెప్ కి వెళ్తారు. 

రెండో స్టెప్:

ఒకే మార్కులు వచ్చిన విద్యార్థుల్లో లెక్కలులో ఎక్కువ మార్కులు ఎవరైతే సాధిస్తారో వారికి ర్యాంకుని కేటాయిస్తారు. అప్పుడు కూడా లెక్కలలో మార్కులు సమానంగా వస్తే ఫిజిక్స్ లో ఎవరు ఎక్కువ మార్కులు సాధించారో చూస్తారు. ఫిజిక్స్ లో ఎక్కువ స్కోర్ చేస్తే వారికి ర్యాంకు కేటాయిస్తారు. ఫిజిక్స్ లో కూడా సేమ్ మార్కులు వస్తే ఇక టై కింద నిర్ణయించి ఒకే మార్కులు సాధించిన విద్యార్థులకు ఒకే ర్యాంకుని కేటాయిస్తారు. కాబట్టి జస్ట్ ఒకటి, రెండు మార్కుల్లో కూడా ర్యాంకుని కోల్పోవచ్చు. వేరొకరితో పోలిస్తే ఒకే మార్కులు వచ్చినా గానీ పాజిటివ్ మర్క్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ లో వచ్చిన ఎక్కువ మార్కుల ఆధారంగా ర్యాంకుని నిర్ణయిస్తారు. కాబట్టి భవిష్యత్తులో జేఈఈ ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులు దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.

Show comments