iDreamPost
android-app
ios-app

జూలై 31న కామికా ఏకాదశి! పాపాల నుంచి విముక్తి పొందే రోజు! ఇలా చేయండి!

  • Published Jul 29, 2024 | 9:32 PM Updated Updated Jul 29, 2024 | 9:32 PM

హిందూ పంచాగం ప్రకారం.. ఈ ఏడాది ఆషాఢ మాసంలో క్రిష్ణ పక్షంలో ఏకాదశి తిధి రాబోతుంది. దీనినే కామికా ఏకాదశి అంటారు. అయితే ఈ ఏకాదశిన ప్రత్యేకత ఏమిటి? ఎప్పుడు,ఎలా జరుపుకుంటారు? సకాల పాపాల నుంచి విముక్తి పొందుతుటకు విష్ణు అనుగ్రహం ఎలా పొందాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ పంచాగం ప్రకారం.. ఈ ఏడాది ఆషాఢ మాసంలో క్రిష్ణ పక్షంలో ఏకాదశి తిధి రాబోతుంది. దీనినే కామికా ఏకాదశి అంటారు. అయితే ఈ ఏకాదశిన ప్రత్యేకత ఏమిటి? ఎప్పుడు,ఎలా జరుపుకుంటారు? సకాల పాపాల నుంచి విముక్తి పొందుతుటకు విష్ణు అనుగ్రహం ఎలా పొందాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jul 29, 2024 | 9:32 PMUpdated Jul 29, 2024 | 9:32 PM
జూలై 31న కామికా ఏకాదశి! పాపాల నుంచి విముక్తి పొందే రోజు! ఇలా చేయండి!

దేశంలో హిందువులకు ఎన్నో రకాల పండుగలు ఉన్నాయి. అయితే అలాంటి వాటిలో ఏకాదశి కూడా ఒకటి. ఇక ఈ ఏకాదశిని తెలుగు పంచాంగం ప్రకారం.. తిథి బట్టి జరుపుకుంటారు. అయితే ఈ ఏకాదశి ప్రతి నెల శుక్ల పక్షంలోనూ, క్రిష్ణ పక్షంలోనూ కలుపుకొని నెలకు రెండు సార్లు వస్తుంది. ఇక ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే.. ఏకాదశి నాడు హిందువులంతా విష్ణువవును చాలా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్శహిస్తారు.ఈ నేపథ్యంలోనే.. ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశిని హిందువులంతా జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మాసంలోనే ఇప్పుడు క్రిష్ణ పక్షంలో రెండవ ఏకాదశి కూడా రాబోతుంది. ఇక ఈ ఏకాదశికి ఉన్న ప్రత్యేకంత వేరు. పైగా ఈ ఏకాదశిని కామికా ఏకాదశి అని కూడా అంటారు. మరీ, పురాణాల ప్రకారం.. ఆ రోజున పూజ చేస్తే.. చేసిన పాపాల నుంచి ఎలా విముక్తి పొందుతారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ పంచాగం ప్రకారం.. ఈ ఏడాది ఆషాఢ మాసం క్రిష్ణ పక్షంలో బుధవారం(జూలై 31వ తేదీన) ఏకాదశి వస్తుంది. దీనినే కామికా ఏకాదశి, సర్వైకాదశి అంటారు. అంతేకాకుండా.. చాతుర్మాస కాలంలో మొదటి ఏకాదశి అని కూడా అంటారు. అయితే చాతుర్మాస కాలంలో వచ్చిన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల అనేక భయాలు, పాపాలు తొలిగిపోతాయని అందరూ నమ్ముతారు. ఎందుకంటే శ్రాస్త్రాల ప్రకారం.. శ్రీ మహా విష్ణవు ఈ కాలంలో 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు. కనుక ఈ కాలంలో వచ్చిన ఏకాదశి నాడు ఉపవాసంతో..  శ్రీ విష్ణుమూర్తిని పూజిస్తూ, కామికా వ్రతం ఆచారిస్తే సకాల పాపాలతో పాటు అన్ని కష్టాలు తొలగిపోతాయట.

అంతేకాకుండా.. ఈ కాలంలో శ్రీ మహావిష్ణువుకి   తులసీ దళాలతో  ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే  వెన్నతో పాటు మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేస్తే మంచిదని పండితులు చెబుతారు.అంతేకాకుండా.. ఈ కామిక ఏకాదశిని ఆచారించి కథ చదవడం, వినడం చేస్తే ఆ విష్ణువు అనుగ్రహం పొందుతారట. ఒకవేళ ఇవి ఏవీ చేయకపోతే ఉపవాసం ఉన్నా అది అసంపూర్ణంగా పరిణిస్తారట. అయితే పురణాల ప్రకారం.. కామిక ఏకాదశి వెనుక ఓ పెద్ద చరిత్ర కూడా ఉంది. మరీ ఆ కథేంటో తెలుసుకుందాం.

కామికా ఏకాదశి వ్రత కథ
క్రోధ స్వభావం గల గ్రామాధికారి ఒక గ్రామంలో నివసించేవాడు. ఒకరోజు కోపంతో ఒక దుష్టుడిని చంపుతాడు. అతడు బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి కావడంతో .. అతనికి బ్రహ్మహత్యా పాపం అంటుకుంటుంది. దీంతో అతడు ప్రాయశ్చిత్తం కోరుకుంటాడు. ఒక ఋషిని కలిసిన గ్రామపెద్ద.. దుష్టుడిని చంపడానికి, ప్రాయశ్చిత్తం పొందడానికి మార్గమేమిటని అడుగుతాడు. అప్పుడు ఋషి ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి కామికా ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని సలహా ఇస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు నశిస్తాయి అని రుషి చెబుతాడు. ఆ ఉపదేశం ప్రకారం గ్రామాధికారి కామిక ఏకాదశి ఉపవాసం పాటించారు. నిత్యం విష్ణుమూర్తిని పూజించేవారు. అందుకు సంతసించిన మహా విష్ణువు గ్రామాధికారికి పాపము నుంచి విముక్తి కల్పిస్తాడు. కనుక ఆ విధంగా ఆచరనలోకి ఈ కామికా ఏకాదశి వచ్చింది. అప్పటి నుంచి  ఎవరైనా పాపాలను పొగొట్టుకోవాలంటే.. ఇలా కామికా ఏకాదశిని పాటిస్తుంటారు. మరీ, ఆ రోజున ఎలా పూజిస్తే విష్ణువు అనుగ్రహం కలుగుతుందో ఆ విషయాలను తెలుసుకుందాం.

కామిక ఏకాదశి పూజా విధానం

  • కామిక ఏకాదశి ముందు రోజు రాత్రి కేవలం అల్పాహారాన్ని స్వీకరించాలి.
  • ఇక ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం ఆచరించాలి. ఆ తర్వాత ఇంటియందు తూర్పు ఉత్తర లేదా ఈశాన్య భాగంలో మహా విష్ణువును స్థాపన చేసి ఆరోజు విష్ణుమూర్తిని షోడసోపచారాలతో అష్టోత్తర శతనామాలతో పూజించాలి.
  • దీంతో పాటు గంగాజలాలతో విష్ణుమూర్తిని ఆరాధించి,  విష్ణుమూర్తికి పుష్పాలు, తులసిదళాల సమర్పించాలి.
  • ఇక శ్రీ మహావిష్ణువుకు అర్చించే నైవేద్యంలో తులసీ దళాలను చేర్చాలి. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని పూజించాలి.
  • ముఖ్యంగా ఆ రోజంతా ఉపవాసంతో నియమాలు పాటిస్తూ విష్ణవు ఆరాధించాలి.
  • అలాగే కామిక ఏకాదశి రోజున గంధం, పసుపు, సుగంధ ద్రవ్యాలు దానం ఇవ్వాలి.
  • ఇక ఆ రోజున  అష్టాదశ పురాణాలు గానీ, రామాయణ, మహాభారతాలు గానీ చదవడం, వినడం చాలా మంచిది.
  • ఒకవేళ అవి కుదరని పక్షంలో విష్ణు సహస్ర నామం పారాయణం చేయడం, భగవద్గీత చదవడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది.
  • అయితే ఆ రోజున ముఖ్యంగా మద్యపానానికి దూరంగా, బ్రహ్మచర్యం పాటించాలి. 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş