Tirupathi Rao
Vinayaka Chavithi 2024- What If Wife Gets Her Periods: వినాయక చవితి శోభ రెండు తెలుగు రాష్ట్రాల్లో వెల్లి విరుస్తోంది. ఊరు వాడా ఆ బొజ్జ గణపయ్యను పూజించేందుకు సిద్ధమైపోయాయి. అయితే ఇలాంటి సమయంలో స్త్రీకి నెలసరి వస్తే.. ఆ ఇంట్లో పూజా కార్యక్రమాలు చేయవచ్చా?
Vinayaka Chavithi 2024- What If Wife Gets Her Periods: వినాయక చవితి శోభ రెండు తెలుగు రాష్ట్రాల్లో వెల్లి విరుస్తోంది. ఊరు వాడా ఆ బొజ్జ గణపయ్యను పూజించేందుకు సిద్ధమైపోయాయి. అయితే ఇలాంటి సమయంలో స్త్రీకి నెలసరి వస్తే.. ఆ ఇంట్లో పూజా కార్యక్రమాలు చేయవచ్చా?
Tirupathi Rao
వినాయక చవితికి రెండు తెలుగు రాష్ట్రాలు ముస్తాబు అయ్యాయి. పల్లెటూర్ల నుంచి మొదలు.. మహా నగరాల వరకు గణేశ్ మండపాలు సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. ఊరువాడ ఆ బొజ్జ గణపయ్యను పూజించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పెద్ద మండపాలు మాత్రమే కాకుండా.. ఇళ్లలో కూడా వినాయక చవితికి ఆ గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. దుర్గామాత నవరాత్రుల తరహాలోనే గణేశ్ నవరాత్రులను కూడా నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు వారి వీలును బట్టి ఇంట్లో గణేశ్ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు. అయితే మీరు ఒక్కోసారి మాకు ఈసారి పండుగ జరుపుకునే అవకాశం దక్కలేదు అని చెప్పడం వినే ఉంటారు. అంటే ఆ ఇంట్లో ఇల్లాలికి అడ్డు వచ్చింది అంటారు. అయితే నిజంగానే ఇంట్లో ఇల్లాలికి, ఇంకా ఎవరికైనా నెలసరి వస్తే.. ఆ ఇంట్లో గణేశ్ పూజ జరుపుకోవచ్చా? జరుపుకోకూడదా?
సాధారణంగా మహిళలకు నెలసరి వచ్చిన సమయంలో పూజలకు దూరంగా ఉంటారు. అలా ఉండాలి అని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. ఆ సమయంలో చాలా వరకు ఎవరూ కూడా ఇంట్లో పూజాది కార్యక్రమాలు నిర్వహించరు. అలా ఎందుకు అంటే.. ఆ సమయంలో దేవుడి ఆరాధన చేయకూడదు అని అనాధిగా చెప్తూ ఉన్నారు కాబట్టి. అయితే పండుగకు ఇంట్లో అలాంటి అడ్డంకి ఏర్పడితే మాత్రం.. ఎలాంటి అభ్యంతరం లేకుండా వినాయక చవితి పూజను ఆ ఇంట్లో జరుపుకోవచ్చు అని పురోహితులు సూచిస్తున్నారు. అంటే నెలసరి వచ్చిన ఆ ఇల్లాలు పూజా క్రతువుగా దూరంగా ఉండి.. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు. అలా దూరంగా ఉండమని చెప్పడం కూడా.. ఆమెకు విశ్రాంతి అవసరం అనే ఉద్దేశంలోనే అంటున్నారు. సాధారణంగా పిరియడ్స్ అంటే మూడ్ స్వింగ్స్, చికాకు, అలసట ఉంటాయి. అలాంటి సమయంలో పూజా కార్యక్రమాలు అంటే అంత ఏకాగ్రత ఉండదు అని చెబుతున్నారు.
సాధారణంగా ఇల్లాలు దూరంగా ఉంటే.. ఆ ఇంట్లో ఎలాంటి అభ్యంతరం లేకుండా గణేశ్ పూజను జరుపుకోవచ్చు అని స్పష్టం చేస్తున్నారు. ఆ ఇల్లాలి భర్త పూజను చేయచ్చు అంటున్నారు. సాధారణంగా కూడా భార్య అన్నీ ఏర్పాట్లు చేస్తే భర్తే పూజ చేస్తే మంచిదని తెలిపారు. అయితే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజచేస్తే ఇంకా మంచిది అంటున్నారు. నిత్యం ఇంట్లో చేసుకునే పూజలు, దీపారాధనకు సంబంధించి కూడా ఒక అవగాహన అయితే కల్పించారు. అంటే నెలసరి ఉన్న సమయంలో నిత్య దీపారాధన కూడా ఆ ఇంటి పెద్ద, భర్త చేసుకుని వెళ్లే మంచిది అంటున్నారు. ఆ సమయంలో ఆమె చక్కగా స్నానం చేసి.. మంచి దుస్తులు ధరించి.. పక్కన కూర్చుంటే సరిపోతుంది అంటున్నారు. అంటే నిత్యం చేసుకునే పూజా క్రతువులను కూడా నెలసరి సమయంలో వాయిదా వేయాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా.. అన్నీ విషయాలను మనకు, మన పనులకు ముడి పెట్టుకుని ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు అంటూ స్పష్టం చేస్తున్నారు.